Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ అవార్డు తెలుగు సినిమాకు చాలా ఉపయోగకరం… ఓ భిన్న విశ్లేషణ !

July 19, 2026 by M S R

.

‘పుష్ప 2’ సినిమాకు ‘ఉత్తమ స్క్రీన్ ప్లే’కు గానూ జాతీయ ప్రభుత్వ పురస్కారం వచ్చింది. అభినందనలు… సుకుమార్ ప్రతిభకు అభినందనలు. 2024 డిసెంబర్ 8న నేను ‘పుష్ప 2’ గురించి ఇలా రాశాను…:

పుష్ప 2 సినిమా పరంగా గొప్పగా ఉంది. Grip and tempo పరంగా పుష్ప 2 గొప్పగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ చాల ప్రతిభావంతంగా సినిమాను తీశారు. ప్రత్యేకమైన అభినందన చిత్ర దర్శకుడికి. బిగి, పొంకంతో కథనాన్ని నడిపించారు సుకుమార్.

Ads

సినిమా మొదలు, తుది చాల బావున్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ చాల బావున్నాయి. దర్శకత్వం, స్క్రీన్ ప్లే, పరంగా పుష్ప 1 కన్నా పుష్ప 2 మేలుగా ఉంది. సంగీతం, పాటల రచన పరంగా పుష్ప 1 మేలైంది. అల్లు అర్జున్ గొప్పగా చేశారు. అభినందన ఆయనకు.

నాయకుడికి ఇంటి పేరు వచ్చిన విధం, కథనం పరంగా చాల బావుంది. Aesthetics పరంగానూ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు గొప్పగా పని చేశారు. జపాన్ ఉదంతం ఒక కలగా చూపించడం దర్శకుడి ప్రతిభ. ఆ కల ముగిశాక అల్లు అర్జున్ మాటలు చాల గొప్పగా ఉన్నాయి. అక్కడ నుంచి సినిమా నడిచిన విధం చాల గొప్పగా ఉంది.

Sentimentకు emotionకు చాల తేడా ఉంది, ఉంటుంది. ఈ సినిమా దర్శకుడికి ఆ తేడా తెలుసు. Emotionను సినిమాలో పకడ్బందీగా పండించారు దర్శకుడు. నాయకుడు చిన్నాయనా అన్న పిలుపు కోసం తన మారుటి అన్న కూతుర్ని రక్షించే అంశం విలువైంది. కథ పరంగా నాయకుడి లక్ష్యం తనకు ఇంటి పేరు రావడం, తాను ఆ ఇంటి కొడుకు అని గుర్తించబడడం. ఆ లక్ష్యం సిద్ధించింది.

ఒక రూపకం ‘లక్ష్య, లక్షణ సమన్వితంగా ఉండాలి’ అని ఆలంకారికులు చెప్పారు. ఈ సినిమాలో నాయకుడి లక్ష్యం సమన్వితం అయింది. ఇది ఒక గొప్ప దర్శకుడి తీరుకు ప్రతిఫలం. ‘నెగటీవ్ ముగింపుల సినిమాలు’ గొప్పవి అన్న తప్పుడు ఆలోచనల affected geniusలకు, సినిమా అంటే family dramaనే అనుకునే నాసిరకం mind setలకు అతీతంగా పుష్ప 2 గొప్ప సినిమా.

సినిమాలో దేశ, హిందు వ్యతిరేకత లేదు కాబట్టి మేధావులకు ఈ సినిమా రుచించదు. తెలుగు సినిమా విదేశీ మత దాస్యం నుంచి విముక్తం అయి విజయవంతం అవుతూండడం సంతోషకరం. పుష్ప 2 పెద్ద విజయాన్ని సాధించింది. కల్కి సినిమా తరువాత 1000 కోట్ల కలెక్షన్ వస్తుందని ఆశిస్తున్నారు. తథాస్తు. హిందీలో కూడా సినిమా హిట్.

ఇంకా గుండమ్మ కథ దగ్గరే, ఇంకా పెండ్యాల దగ్గరే, ఇంకా ఘంటసాల దగ్గరే మంచి తెలుగు సినిమా ఉంటేనే అది గొప్పది ఔతుంది అని అనుకుంటున్న (అంటే అక్కడ గొప్పతనం లేదని కాదు) మధ్యతరగతి మాంద్యానికి అతీతంగా పయనిస్తూ తెలుగు సినిమా జాతీయమూ, అంతర్జాతీయమూ అవుతూండడం పుష్ప 2 ద్వారానూ సాధ్యమైంది. ఇది తెలుగు సినిమాకు ఎంతో కావాల్సింది.

దర్శకుడు సుకుమార్, నాయకుడు అల్లు అర్జున్ పరిశ్రమ, ప్రతిభ, ప్రజ్ఞ వెరసి పుష్ప 2.




ఇప్పుడు పుష్ప 2 సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ పురస్కారం రావడం తెలుగు సినిమాకు మేలు చేస్తుంది.

సినిమానో, నటనో, సంగీతమో, పాటో, సాహిత్యమో, కళో, సమాజమో ‘మధ్యతరగతి మాంద్యం’కు బలి అవకూడదు. తెలుగు సినిమా, సంగీతం, సాహిత్యం మధ్యతరగతి మాంద్యానికి పెద్ద ఎత్తున బలి అయిపోయాయి. ఇటీవల ఆ దుస్థితి నుంచి తెలుగు సినిమా బయటపడుతోంది. పుష్ప 2 విజయం, ఇదిగో ఆ సినిమాకు ఈ పురస్కారం తెలుగు సినిమాకు మేలు చేసేవి.

తమను తాము ‘మేధావులం’ అనుకుంటూనూ, తమ effected intellect ప్రామాణికం అనుకుంటూనూ, అంటూనూ గగ్గోలు పెట్టే పనికిమాలిన, మనో వికాసంలేని ‘మధ్య తరగతి మాంద్యం’కు, మేధావర్గానికి సినిమా, సంగీతం, సాహిత్యం వంటి కళా రూపాలు బలి కాకూడదు.

ఏ కళ అయినా మధ్యతరగతి బుద్ధి మాంద్యానికి, affected geniusలకు, నాసిరకం mind setలకు సంబంధించినది కాదు; ఏ కళైనా ప్రతిభకు, ప్రజ్ఞకు, కష్టానికి, పరిశీలనకు, ప్రయోగశీలత్వానికి, ప్రత్యేకమైన ఆలోచనా సరళికి, పనితనానికి సంబంధించినది.

పుష్ప 2 కు ఈ జాతీయ పురస్కారం రావడం శుభ పరిణామం. ‘తెలుగు సినిమా ప్రతిభ’ మధ్య తరగతి మాంద్యానికి, మేధావర్గానికి అతీతంగా ఇలా జాతీయ స్థాయిలో రాణించడం హర్షనీయం.

‘పుష్ప 2’ సినిమాకు గానూ కాస్ట్యూమ్ డిజైనర్స్ దీపాలీ నూర్, శీతల్ శర్మ; ‘లక్కీ భాస్కర్’ సినిమాకు గానూ సంభాషణల రచయితగా దర్శకుడు వెంకీ అట్లూరి; ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రాళ్లు’; జాతీయ పురస్కారాల్ని పొందాయి. జాతీయ స్థాయి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నాగ్ అశ్విన్ ‘కల్కి’ పురస్కారాన్ని పొందడం విశేషం.

రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వన్డే సిరీస్ చేజేతులా సమర్పయామి ! కొంపముంచిన బౌలింగ్ వైఫల్యం !!
  • ఈ అవార్డు తెలుగు సినిమాకు చాలా ఉపయోగకరం… ఓ భిన్న విశ్లేషణ !
  • అమ్మవారి విగ్రహంతో బరిబాతల చెరువులోకి… అంతుచిక్కని అసాధారణ మిస్టరీ !!
  • సర్! ప్లీజ్ చెప్పండి సర్! నా ‘సర్’ ఏమయ్యింది సర్..?
  • కట్లపాము పెళ్లాం ! ఈసారి మరో కొత్త ఐడియాతో మరో మొగుడు ఖతం !!
  • బన్నీకి మళ్లీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు రాలేదు ?!
  • పోసాని మార్క్ వింత విన్యాసం ! సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ !!
  • గగనానికి బాటలు వేస్తూ కొందరు – ‘జంతర్ మంతర్’ గుప్పిట్లో ఇంకొందరు
  • నో నో… ఈ కుందనపు బొమ్మకూ ఆ గణిత మేధావికీ ‘నెత్తుటి సంబంధం’ లేదు !!
  • ఇదేం పైత్యంరా !? లోదుస్తుల చోరీ ఫుటేజ్ చూసి పోలీసులూ విభ్రాంతి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions