.
సీన్ 1 … ది రాజా సాబ్ సినిమాకు టికెట్ రేట్ల పెంపు, అర్ధరాత్రి మెమో జారీ… హైకోర్టు ఆగ్రహం… కానీ చిరంజీవి సినిమా శివశంకర ప్రసాద్ గారు టికెట్ రేట్ల పెంపుకు అంతకు రెండురోజుల ముందే మెమో జారీ… ఎందుకా ప్రేమ..?
అడ్డగోలు రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం తెలిసీ, పాత కేసులు తెలిసీ ఎందుకు ఇచ్చినట్టు..? అందులోనూ స్టార్లవారీ వివక్ష దేనికి..? నథింగ్ డూయింగ్, ఎవరికీ టికెట్ రేట్లు పెంచేది లేదని హూంకరించిన కోమటిరెడ్డి ప్రకటన ఏమైపోయింది..? చివరకు చిరంజీవి సినిమా రేట్ల పెంపుదల మీద హైకోర్టు నుంచి తెలంగాణ హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహం చూడాల్సి వచ్చింది… కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అని వార్తలూ కనిపించాయి…
Ads
సరే, సరే, అనధికారిక సినిమాటోగ్రఫీ మంత్రి దిల్ రాజు పంపిణీదారు కాబట్టి ఆ ప్రేమ చూపించబడిందని అనుకుందాం…

సీన్ 2 … ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్… చిరంజీవి ప్రత్యక్షం… ప్రసంగం… ఇద్దరు మంత్రుల్ని పంపించి మరీ రేవంత్ రెడ్డి నన్ను ఆహ్వానించాడు అని చెప్పుకోవడం… తనకు అక్కడే సీఎం సన్మానం… ఎందుకు ఈ ప్రాధాన్యం..? తను పెట్టుబడిదారుడు కాదు, రాజకీయ వేత్త కాదు, పాలసీ మేకర్ కాదు, పాలసీలు ఎలా ఉంటే బాగుంటాయో చెప్పే మేధావివర్గం కూడా కాదు… ఏదో స్టార్ అట్రాక్షన్ కావాలీ ప్రచారం కోసం అనుకుంటే… ఆ ఒక్కడే దేనికి..?
సరే, హైదరాబాద్‌లోని ప్రముఖుల్ని కూడా ఆ మెగా ఈవెంటులో పాల్గొనేలా చేయాలని సీఎం అనుకున్నాడని అనుకుందాం…

సీన్ 3 …. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు… తెలంగాణ నుంచి టీమ్ వెళ్లింది… సీఎం, సంబంధిత అధికారులు, మంత్రులు, పెట్టుబడుల వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు… కానీ హఠాత్తుగా మంత్రుల నడుమ చిరంజీవి కనిపించాడు…
తనకూ దావోస్‌కూ ఏం లింక్..? తనకూ తెలంగాణ ప్రభుత్వంలో స్థానం ఏమిటి..? అనే ప్రశ్నలు తలెత్తాయి… తీరా చూస్తే… చిరంజీవి తన కుటుంబ స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో ఉన్నాడని తెలిసి సీఎం ప్రత్యేకంగా ఆహ్వానించాడనీ, అందుకే దావోస్ మీటింగులో పాల్గొన్నాడని మరో వార్త కనిపించింది…
అసలు తనకూ రాష్ట్రంలో పెట్టుబడులకూ ఏమాత్రమైనా లింక్ ఉందా…? అక్కడ చిరంజీవి పార్టిసిపేషన్‌తో వీసమెత్తు ఫాయిదా ఉందా..? మరెందుకీ పదే పదే అధిక ప్రాధాన్యం..? ఎవరికీ అర్థం కాని మిస్టరీ ఇది..!

తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేశాక… ఇక రాజకీయాలకూ నాకూ సంబంధం లేదనీ, సినిమాలు తప్ప వేరే లోకమే లేదన్నాడు చిరంజీవి… పాపం కాంగ్రెస్ పార్టీయే చాన్నాళ్లు చిరంజీవి తమ పార్టీలోనే కొనసాగుతున్నట్టు చెప్పుకుంది… కానీ చిరంజీవి అవుననలేదు, కాదనలేదు… తన తమ్ముడిని ఉన్నత పదవిలో చూడాలని ఉందని మాత్రం చెప్పుకున్నాడు… ఏదో అస్పష్ట, సందిగ్ధ వైఖరి…
నారా లోకేష్ ప్రభుత్వం నడుస్తున్న ఏపీలో చిరంజీవిని తమ ప్రభుత్వ భాగస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నగా మాత్రమే, ఓ నటుడిగా మాత్రమే చిరంజీవి చూడబడతాడు… కానీ తెలంగాణలో మాత్రం సీఎం అంతకు మించి ఇస్తున్న అధిక ప్రాధాన్యం మిస్టరీ ఏమిటో ఎవరికీ తెలియదు... తెలంగాణ సమాజానికి ఫాయిదా ఏమిటో కూడా రేవంత్ రెడ్డే చెప్పాలిక..!!
అన్నట్టు… కేంద్ర మంత్రిగా చిరంజీవి పార్లమెంటులో సమైక్యవాదం వినిపించాడు విభజన సమయంలో..!! మోడీ కూడా పలుసార్లు చిరంజీవిని అభినందించాడు…. మోడీయిష్టుడే మనిష్టుడా సీఎం సాబ్..!!
Share this Article