Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మార్వాడీ గో బ్యాక్..! సమాజంలో ఓ అలజడి రేపే కుటిలయత్నాలు..!!

August 16, 2025 by M S R

.

బండి సంజయ్ అంతే… దాపరికాలు, మార్మికమైన పరోక్ష వ్యాఖ్యలు ఉండవ్… స్ట్రెయిట్… ‘‘ఏందిరా ఈ మార్వాడీ గోబ్యాక్ కూతలు..? హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు చేస్తే… మేం హిందూ కులవృత్తుల రక్షణ ఎజెండా తీసుకుంటాం… చేతనైతే రోహింగ్యా గోబ్యాక్ అనండి…’’ అని విరుచుకుపడ్డాడు…

ఎస్, బండి సంజయ్‌ తప్ప మరొకరికి ఇలా కుండబద్ధలు కొట్టడం తెలియదు… విషయం ఏమిటి..? ఈమధ్య కొన్నాళ్లుగా మార్వాడీ గోబ్యాక్ అట… ఆమనగల్లు బంద్ అట… ఎందుకు..? మార్వాడీలు వ్యాపారాల్లో పాతుకుపోతున్నారట… తెలంగాణ సమాజం సహించదట… ఫాఫం…

Ads

అసలు హఠాత్తుగా ఎవరు రేపుతున్నారు ఈ మంటలు..? అంత తేలికగా అంతుపట్టదు… పట్టనివ్వరు… తెర వెనుక కుట్రలుంటయ్… అదుగో, వాటితోనే తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి… ఎస్, బీజేపీ ఎలాగూ వీటికి మద్దతునివ్వదు… అడ్డుకుని, ఉల్టా ఆందోళనలకూ సిద్ధమవుతుంది…

లెఫ్ట్ పార్టీలు ఈ సంకుచిత ధోరణిని ప్రదర్శించిన దాఖలాలు లేవు… కాంగ్రెస్ జాతీయ పార్టీ… ఏ ప్రాంతవాసినో ఇంకెక్కడో ద్వేషించే ధోరణిని కనబర్చదు… పైగా రేవంత్ రెడ్డి అందరినీ రమ్మంటున్నాడు… మీకు రక్షణ, మీ పెట్టుబడులకు నాదీ భరోసా అంటున్నాడు… ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను మారుద్దాం అంటున్నాడు… అందరూ బతకాలి… ఐనా అధికారంలో ఉన్న ఎవరూ కొత్త తలనొప్పులను కోరుకోరు… తనకు పార్టీలోనే అంతర్గతంగా ఉన్న చికాకులతోనే సరిపోతుంది…

బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, లెఫ్ట్ అసలే కాదు… మరెవరు..? బీఆర్ఎస్..? ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అన్‌రెస్ట్ క్రియేట్ చేయడానికి, ప్రజల్లో ఏదో అసంతృప్తిని పెంచడానికి నానా పాట్లూ పడుతోంది… ఏ చాన్స్ దొరికినా వదలదు… రేవంత్ రెడ్డికి తలనొప్పులు క్రియేట్ చేయడమే లక్ష్యం అయితే… నేరుగా బయటపడితే… ఇప్పటికే తెలంగాణ సమాజాం ఛీత్కరింపులు ఎదుర్కొంటున్న పార్టీ, ఇకపై దీనిపైనా తెలంగాణ సొసైటీ నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుంది…

ఎస్, తన ధోరణి ఏదో తనే స్పష్టం చేయాల్సిన సిట్యుయేషన్ తనదే… మార్వాడీలు ఇప్పుడు కొత్త కాదు, నిజాం కాలం నుంచీ, అంతకుముందు నుంచీ దేశవిదేశాల నుంచీ ప్రజలు వచ్చారు ఇక్కడికి… దశాబ్దాలుగా ఈ నేలతో, ఈ కల్చర్‌తో మమేకం అయ్యారు… వాళ్ల భిన్న సంస్క‌ృతులను కాపాడుకుంటూనే తెలంగాణ సంస్కృతినీ, జీవనవిధానాన్ని గౌరవించారు… ఇక్కడే కాదు, గుజరాతీలు, పంజాబీలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారు… బతికేస్తారు…

వాళ్లేమీ మన పొరుగు తెలుగువాళ్లలాగా దోచుకోలేదు… అధికారంలోకి రాలేదు… నీళ్లు, నిధులు, నియామకాలే కాదు… అన్నింటా తెలంగాణను గేలి చేశారు… భాషను, కట్టును, బొట్టును, పండుగను, యాసను, అలవాట్లను, తిండిని… వాట్ నాట్..? ప్రతిదీ..! అన్నం తినడం నేర్పాడుట, పొద్దున్నే లేవడం నేర్పాడుట… దాదాపు ప్రతి వ్యాపారమూ వాళ్ల గుప్పిట్లోనే… వాళ్లు వోకే, మరి హఠాత్తుగా మార్వాడీలు శత్రువులయ్యారా..? ఎలా..?

ఎస్, కేసీయార్ హయాంలో హైదరాబాద్ ఐఎస్ఐ ఏజెంట్ల అడ్డాగా మారి, ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య బయటపడ్డా దాని మూలాలు హైదరాబాదులో తేలడం స్టార్టయింది… అది కదా మనం సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న… నిర్లక్ష్యం… ఉపేక్ష… రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ వలసలు బయటపడుతున్నాయి… పలు నేరాల్లోనూ వాళ్ల పాత్ర… సో, మార్వాడీ గోబ్యాక్ వెనుక ఏదో కుటిలాలోచన కనిపిస్తోంది…!

మన వాళ్లు భీవండి పోవడం లేదా..? పనిచేయడం లేదా..? మనవాళ్లు ఎక్కడెక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేయడం లేదా..? వ్యాపారాలు చేయడం లేదా..? వేరే దేశాలకు వెళ్లడం లేదా..? అంతెందుకు..? ఈరోజు బీహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా,  బెంగాల్ కూలీలు లేకపోతే… తెలంగాణలో ఏ పనీ జరగదు… చిన్న చిన్న వ్యాపారాలూ చేస్తున్నారు… అందరూ భారతీయులే… మనలాగే వాళ్లూ ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఉండొచ్చు… చేతనైతే మనం వ్యాపారాల్లో బీట్ చేయాలి… అది చేతగాకే ఈ గోబ్యాకులు… సోెషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు… అశాంతిని క్రియేట్ చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు…

రైస్ మిల్లులు, భవన నిర్మాణాలు, కంట్రాక్టు పనులు, సెక్యూరిటీ, ఇటుక బట్టీలు, హోటళ్లు, హాస్పిటళ్లు,. సూపర్ మార్కెట్స్, స్వీట్ షాపులు, చివరకు నగల షాపుల దాకా…. అన్నింటా వాళ్లే… పనిచేసుకుంటున్నారు బతుకుతున్నారు… అందరినీ అక్కున చేర్చుకునేదే తెలంగాణ… అది తెలంగాణ సంస్కృతి… ఎవడినీ భాష పేరిటో, ప్రాంతం పేరిటో,  కులం పేరిటో అవమానించదు… అలుముకుంటుంది…

ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, వార్డ్ రోబ్స్, లిఫ్ట్ ఆపరేటర్స్, ఫుడ్ డెలివరీస్, సరుకు డెలివరీస్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, సీడ్స్, వెల్‌నెస్ ఇండస్ట్రీ, మినరల్ వాటర్, గ్రాసరీస్, స్టీల్ షాప్స్, చివరకు పానీ పురి, హెన్నా ఆర్టిస్టుల దాకా అనేక ప్రాంతాల మనుషులు… ఈ హైదరాబాద్ మాది కూడా అని ఇక్కడే బతుకుతున్నారు… తెలంగాణ తల్లి ఒడిలో సురక్షితంగా, కడుపు నింపుకుంటూ…

వాళ్లు మనపై అధికారం కోరుకోవడం లేదు… మనల్ని వెక్కిరించడం లేదు… మన నెత్తిన ఎక్కి తైతక్కలాడాలని అనుకోవడం లేదు… ఎవరో కొందరు ఎప్పుడూ ఉంటారు… వెర్రి వేషాలు వేసేవాళ్లు, వాళ్లను కంట్రోల్ చేయాలే తప్ప… ఏకంగా గోబ్యాక్ అనే ఆందోళనల్ని క్రియేట్ చేస్తే అది అంతిమంగా తెలంగాణకే నష్టం… అది తెలంగాణ కల్చర్ కానేకాదు… మన కల్చర్ అన్ని నదీపాయల్ని కలుపుకునే ఓ విశిష్ట సాగరం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాఫర్ డ్యామ్ కదా… పర్లేదు, అప్పుడప్పుడూ అలా జారుతూ ఉంటాయి…
  • ప్రశాంత్, వంగా, రాజమౌళి, మణిరత్నం…. ఈ ప్రేమకథ తీయగలరా..?
  • మార్వాడీ గో బ్యాక్..! సమాజంలో ఓ అలజడి రేపే కుటిలయత్నాలు..!!
  • దర్శనమివ్వని ఆ దేవదేవుడికి … బయటి నుంచే ఓ పే-ద్ద దండం పెట్టింది బిడ్డ..!!
  • ప్రజల కోసం చేసే పోరాటాలు, త్యాగాల వాస్తవ విలువ ఎంత..?!
  • సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!
  • పెళ్లయిన 9 రోజులకే భర్త హత్య…! ఆ తరువాత ఆమె కథ ఏమైంది..?!
  • బిపాషా మగది..! నెట్‌లో ఓ పిచ్చి ‘కండల’ పంచాయితీ కలకలం..!
  • పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!
  • సీఎం ప్రసంగాల్లో గుణాత్మక మార్పు… విజన్ 2047 గురించి గుడ్ ప్రొజెక్షన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions