Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సార్, జూనియర్ గారూ… కనీసం ఇక్కడైనా ఆ వంశచరిత్రలు ఆపండి సార్…

August 27, 2021 by M S R

కేబీసీ… కౌన్ బనేగా కరోడ్‌పతి… అనేక దేశాల్లో అనేక భాషల్లో సూపర్ హిట్ షో అది… మన దేశంలో కూడా పలు భాషల్లో ప్రసారం చేస్తున్నా అమితాబ్ నిర్వహించే షో మాత్రమే అల్టిమేట్… పలువురు వేరే హీరోలు ట్రై చేశారు, తెలుగులో కూడా నాగార్జున, చిరంజీవి ప్రయత్నించారు… దాదాపుగా అందరూ చేతులు కాల్చుకున్నవాళ్లే… మరీ నాగార్జునతో పోలిస్తే చిరంజీవి ఎపిసోడ్లు ఫ్లాప్… చిరంజీవి తరువాత ఇక ఆ షోయే ఆగిపోయింది… ఇప్పుడది జూనియర్ ఎన్టీయార్ హోస్టుగా వస్తోంది… బిగ్‌బాస్‌ షో చూశాం కదా, జూనియర్ ఫుల్ ఎనర్జీ, స్పాంటేనిటీ, ఫ్రెండ్లీ సంభాషణలు… అదరగొట్టాడు… జూనియర్‌ను మించిన ప్రయోక్త మళ్లీ రాడు అనే స్థాయిలో చేశాడు… అంతేకాదు, ఎక్కడా తన సినిమాల సంగతులు గానీ, తన వారసత్వాల ముచ్చట్లు కానీ తీసుకురాలేదు… జస్ట్, బిగ్‌బాస్ స్క్రిప్ట్ ఏదుంటే అది… నిజానికి అమితాబ్ షో కూడా అంతే… తన పట్ల అమితమైన ఆరాధనను చూపిస్తారు కంటెస్టెంట్లు, కానీ ఎక్కడా దాన్ని శృతి మించనివ్వడు అమితాబ్… ఓ విజ్ఞానదాయకమైన షోను మరీ ఓ ఎంటర్‌టైన్‌మెంట్ షోగా మారిస్తే అది ఫట్‌మని పేలిపోతుంది… దాన్ని ఓ డిఫరెంటు పోకడతో పోనివ్వాలి… కానీ..?

mek

అన్నీ తెలిసిన జూనియర్ ఎందుకిలా అయిపోయాడు..? మొదటిరోజు పూర్తిగా రాంచరణ్, జూనియర్ పరస్పర అభినందనలు, హైపులు, ప్రమోషన్లు, భుజకీర్తులతో సాగిపోయింది… సరే, లాంచింగ్ సెషన్ కదా, కాస్త సరదాగా మొదలుపెట్టారు అనుకుంటే… అనుకోకుండా ఓసారి చూడబడ్డాను… Hierarchical Worshipping.. A Remix ✍️✍️ ఎవరో ఒకామె! జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలుంటే చాలు ఇంకేమీ వద్దట! మరి జూనియర్ ఎన్టీఆర్ గారు Host కాకపోతే ఈ Programకి వచ్చేదో, లేదో అనిపించింది. ఒక నిమిషం పాటు ఆయన్ని, ఆయన నటననూ పొగిడింది. ఆ తర్వాత రెండు ప్రశ్నలు. రెండు ప్రశ్నల గురించి మాట్లాడే టైంలో ‘నందమూరి తారక రామారావు’ గారి ప్రస్తావన వచ్చింది. అది యాదృచ్ఛికమా? కావాలని వచ్చిందా అర్థం కాలేదు… బిగ్‌బాస్ షో దగ్గర కనబరిచిన సంయమనం, బ్యాలెన్స్ ఇప్పుడేమైంది జూనియర్..?!

Ads

Telugu Showsలో ఈ రోజుకీ చాలామంది కాస్త గౌరవించి, ఇష్టపడ్డ కార్యక్రమం… TV9లో వచ్చిన ‘నవీన’…! అలాంటి Social Oriented and Useful కార్యక్రమం మరొకటి కనిపించలేదు… TV9లోనే ‘చేతన’ అనే మరో మంచి కార్యక్రమం వచ్చేది… These both are All time Favourites on Telugu small screen… ఇప్పటి టీవీ9 గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ…  అయిదారేళ్ల క్రితం దాకా ప్రేక్షకులు ‘బతుకు జట్కాబండి’, ‘జబర్దస్త్’, ‘జీన్స్’, ‘క్యాష్’ షోలను బాగానే చూసేవాళ్లు… Ignorance is Bliss… ఈ కార్యక్రమాలు చూడాలంటే అలాటి అజ్ఞానం కొంచెం ఉండాలి… ఎప్పుడైతే ఆ కార్యక్రమాల లోగుట్లు తెలిశాయో వాటిని చూడటం ఇబ్బంది అయ్యింది అందరికీ… Daily 1GB Data Pack వీక్షణా పరిధిని విస్తృతం చేసింది. సినిమా రంగంలో Hierarchical Worshipping అనే Concept ఒకటి ఉంది. ఫలానా వాళ్ల పిల్లలు వాళ్ల తాతల్ని, తండ్రులను పొగడటం, మాటిమాటికీ వారిని గుర్తు చేయడం, వాళ్ల పాటల్ని Remix చేయడం, సినిమాల్లో వాళ్ల ఫొటోలు చూపించడం, వారి సేవల్ని(?) పొగడ్డం.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది Marketing Technique అనుకుంటాం కానీ, పక్కాగా వారి భావజాల వ్యాప్తికి, వారిని మర్చిపోకుండా ఉంచేందుకు చేసే ప్రయత్నం. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీఆర్, నాగయ్య, కాంతారావు.. వీళ్లు తక్కువా? మరి వీళ్ల గురించి ఎప్పుడూ ఎవరూ ఏమీ చెప్పరు ఎందుకో? వీళ్ల పాటలు Remix చేయరు ఏలనో?

సినిమా అగ్రనటులు టీవీల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా Hierarchical Worshipping కూడా వారి వెనుక వస్తుందన్న ఊహ తప్పేమీ కాదని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ నిరూపించింది… అఫ్‌కోర్స్ జనాలకు ఆ వ్యక్తి పూజల్లో ఆనందం ఉంటే కాదనడానికి మనమెవరం..? కానీ ఎంత పూజలైనా, వారి తాతలకైనా రోజూ చేస్తానంటే మాత్రం విసుగే కదా…! ఐనా ఓ సందేహం! అల్లు రామలింగయ్య మహానటుడు. వెయ్యికి పైగా చిత్రాలు చేశాడు..,. ఆయన ‘ముత్యాలు వస్తావా’ పాటని అల్లు అర్జున్ లేదా అల్లు శిరీష్ Remix చేసి తమ సినిమాల్లో ఎక్కడైనా వాడే అవకాశం ఉందా..? లేక అలాంటి Remix అవకాశాలు కొందరు బడా బడా హీరోల మనవళ్లకు మాత్రమే ఉందా..? అన్నట్టూ… దయచేసి ఈ ఎంఈకే ప్రోగ్రామ్‌లో మీరు గుర్తించిన విజ్ఞాన లాభాలను చెప్పొద్దు సుమా… అంతకంటే ఎక్కువ విజ్ఞానం CBSE 8వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions