ఈ మోనాల్ హౌస్‌లోకి మళ్లీ వచ్చిందిరోయ్…..!! భయపడకండి… ఏ నర్మదా నదీ శోకసుందరి ప్రవేశం గురించి ఆందోళన చెందకండి… జస్ట్, ఓ గెస్టులా వచ్చింది… పాత కంటెస్టెంట్లు కొందరిని మళ్లీ హౌస్‌లోకి తీసుకొచ్చి, ఇక ఫినాలే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు… గతంలో కూడా చేసిందే… కానీ ఈసారి కరోనా కారణంగా… స్వేచ్ఛగా అనుమతించలేరు కాబట్టి… ఓ అద్దాల చాంబర్లోకి తీసుకొచ్చి, మాటామంతీ ఏర్పాటు చేశారు… సేమ్, కుటుంబసభ్యులను కలిసినట్టుగానే…!
లాస్య, కల్యాణి, మోనాల్ గట్రా వచ్చారు… మోనాల్ వచ్చీరాగానే ఏం చేసింది..? ఊహించిందే… అఖిల్‌ను హత్తుకుపోయింది గట్టిగా… మధ్యలో అద్దం పగిలిపోతుందేమో అన్నట్టుగా…. అప్పటికి వాళ్లిద్దరూ ఏదో కొన్ని యుగాలుగా దూరం ఉన్నట్టు… వాళ్ల నడుమ ఏదో గాఢమైన ప్రేమబంధం ఏదో అల్లుకున్నట్టు… సర్లే… వాళ్ల పిచ్చి వాళ్లకానందం… కానీ..? ఈమధ్య బిగ్‌బాస్ టీం ఏదో కుట్ర చేస్తున్నట్టుంది… ఏమిటబ్బా అది..?
Ads
ఇలాంటి రియాలిటీ షోలకు చివరివరకూ ఓ సస్పెన్స్, థ్రిల్ ఫ్యాక్టర్ ఉంటేనే మజా… ఫినాలే ఇంట్రస్టింగుగా ఉంటుంది… రేటింగ్స్ బాగుంటయ్… కానీ అభిజిత్ విన్నర్ అని నెల రోజులుగా అందరూ అనుకుంటున్నారు… ఆ వాతావరణం క్రియేటై ఉంది… వోటింగు మేనేజ్ చేసే ఓ భారీ టీం తన కోసం ఆర్గనైజ్ చేయడం ఒక కారణం కాగా… నిజంగానే తను ఓ మెచ్యూర్డ్, డిగ్నిఫైడ్, ఇంటలిజెంట్ ధోరణితో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు…
మరి ముందే అంతా తేలిపోతే, షో మజా ఏముంది..? అందుకే థ్రిల్ ఫ్యాక్టర్ తీసుకురావడానికి ఏం చేశారో ఏమో గానీ… మెల్లిగా ఓ ప్రచారం మొదలైంది… ‘‘అరెరె, ఇన్నిరోజులూ అభిజిత్‌కు యాభై శాతం వోట్లు వచ్చేవి… సీన్ రివర్స్ అయిపోయింది… మూడో స్థానంలో ఉన్న అరియానా ఎగబాకి ఏకంగా అభిజిత్‌ను కిందకు తొక్కేసి, తను ఫస్ట్ ప్లేసులోకి వెళ్లిపోయింది’’…. ఇదీ ప్రచారం… చివరకు మెయిన్ స్ట్రీమ్ పత్రికల సైట్లు కూడా దీన్ని నమ్మేసి, హడావుడిగా రాసేసుకుంటున్నాయి…
ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో…. ఒకటో రెండో అనామక సైట్ల వోటింగు రిజల్టును ఇష్టం వచ్చినట్టుగా చూపించడం, దాని ఆధారంగా విశ్లేషణలు గీకడం పెద్ద ఇష్యూ కాదు… అయితే బిగ్‌బాస్ టీమే గనుక ఈ క్యాంపెయిన్ సృష్టికి కారణమైతే… ఆ కుట్ర ఉద్దేశం ఏమిటి..?
- నిజంగానే కాస్త సస్పెన్స్, థ్రిల్ పెంచడమేనా… నిజంగానే ఏదైనా కుట్ర ఉందా..?
- రాంగోపాలవర్మ దోస్త్ ఈ బిగ్‌బాస్ ముంబై టీంలో కీలక స్థానంలో ఉన్నాడు… తన ద్వారా అరియానా విజేత అయ్యేలా ఏదైనా తతంగం నడుస్తోందా..?
- అందుకేనా తొలిసారి ఆడ బిగ్‌బాస్ అని విశ్లేషణలు కనిపిస్తున్నాయి అక్కడక్కడా…?
- ఒకవేళ అదే జరిగితే..?
- ఇప్పటికే బిగ్‌బాస్ ఎలిమినేషన్లకు క్రెడిబులిటీ లేదు… జనం వేసే వోట్లకు విలువ లేదు… బిగ్‌బాస్ తన గేమ్ ప్లాన్ మేరకే ఎవరిని కట్ చేయాలో, ఎవరిని ప్రమోట్ చేయాలో నిర్ణయించుకుంటున్నాడు…
- ఇప్పుడిక స్థిరంగా సగానికి పైగా ఎప్పటి నుంచో వోట్లు పొందుతున్న అభిజిత్‌ను కాదని, ఇంకెవరికో ట్రోఫీ గనుక ఇస్తే… అయిదో సీజన్‌ను చేజేతులా బొందపెట్టుకున్నట్టే…
- అసలు ఈ సీజనే బాగా నిరాశపరిచింది… ఇక విజేతల్ని కూడా తమ ఇష్టానుసారం నిర్ణయిస్తారు అని తేలిపోతే షో చూసేవాళ్లెవరు..? ఎవరికి ఇంట్రస్టు ఉంటుంది…
- నిజమే, సొహెల్, అరియానా మంచి ఫైటర్లే… కానీ అభిజిత్‌ను దాటేసేంత పాపులారిటీ మాత్రం రాలేదు… అఖిల్, హారిక అంటారా..? లైట్ తీసుకొండి…!!
- ఒకవేళ అభిజిత్, అరియానా, సొహెల్ ఫ్యాన్స్‌ను మరింతగా రెచ్చగొట్టి ఇంకా కసికసిగా ఎక్కువ వోట్లు వేయించే పిచ్చి ప్రయత్నం అయితే కాదు కదా కొంపదీసి..!
Share this Article