Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం సాక్షి..! చంద్రబాబు మీద కోపంతో యోగాపై రప్పారప్పా దాడి..!!

June 22, 2025 by M S R

.

ఎండీ స్థాయి లేదా ఎడిటర్ స్థాయిలో వారానికో ‘ఐటమ్ స్టోరీ’ వదిలేవి ఆంధ్రజ్యోతి… సాక్షి… ఈనాడుకు ఆ అలవాటు లేదు- ఆ పద్ధతికీ దూరం.., ఆ ఎడిటర్లు రాయలేక కాదేమో… కావాలంటే ఘోస్ట్ రైటర్లు దొరకరా ఏం..?

ఇక మిగతా పత్రికల్లో రాతల గురించి పెద్దగా చెప్పుకునే పనేమీలేదు… ఐతే సాక్షిలో ఏకైక ఎజెండాతో ఉంటాయి ‘ఆవు వ్యాసాలు’… చంద్రబాబు అడుగుల్ని, ఆలోచనల్ని, పద్ధతుల్ని అక్షరాలతో రప్పా రప్పా నరకడం, అంతే…

Ads

సో, పెద్దగా మన అభిప్రాయం చెప్పడానికి కూడా ఏమీలేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా జగన్ విషయంలో అంతే… కానీ తను వర్తమాన వ్యవహారాల్ని చాలా టచ్ చేస్తాడు… ఇన్‌సైడ్ స్టోరీలు చెబుతాడు… అందుకే వాటికి పఠనీయత ఎక్కువ… విశ్వసనీయత అనేది వేరే సంగతి…

సాక్షిలో ఈరోజు వ్యాసం చూస్తే కాస్త నవ్వొచ్చిన మాట నిజం… చంద్రబాబు యోగాంధ్ర పేరిట రెండు గిన్నీస్ రికార్డుల కోసం హంగామా, అట్టహాసం, ఆడంబరాన్ని ప్రదర్శించాడు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించడం కోసం అని ఏదేదో రాశారు, సరే, అది ఆ పత్రిక బేసిక్ పొలిటికల్ లైన్, ఎప్పుడూ రాసేదే కదా…

కానీ చంద్రబాబును వ్యతిరేకించడం వేరు… చంద్రబాబు చెబుతున్నాడు కాబట్టి యోగాను వ్యతిరేకించడం వేరు… ఏమని రాసుకొచ్చిందీ అంటే…

సాక్షి

ఈమధ్య చాలా మంది యోగా రోగ స్పెషలిస్టులు బయల్దేరారు, ఏ రోగానికి ఏ ఆసనమో చెప్పేస్తున్నారు… నడుం నొప్పి, కడుపు నొప్పి, సంతానం, దగ్గు, ఆయాసం, గ్యాస్ మంటకే కాదు, చివరకు ఎయిడ్స్, కేన్సర్‌కు కూడా యోగాయే మందు అని చెప్పేస్తున్నారు, వైద్యశాస్త్రం అంగీకరిస్తుందా..?

అసలు అష్టాంగయోగ పాటించేవాళ్లలో 62 శాతం మందికి కీళ్లు పట్టుకోవడం, మోకాలి నొప్పులు, పిక్క కండరాలు పట్టేయడం వంటివి కొత్తగా మొదలైనట్టు టెలిగ్రాఫ్ ఇండియా వాడు రాసేశాడు తెలుసా..? వాటీజ్ దిస్ యోగా, నాన్సెన్స్, అబ్సర్డ్ అన్నట్టుగా కొన్ని పేరాలు చెప్పుకొచ్చాయి ఫాఫం…

యోగా చేయలేకపోవడం వేరు, యోగాను సరిగ్గా చేస్తే వచ్చే సత్ఫలితాలు వేరు… వెక్కిరించినక్కర్లేదు, చంద్రబాబు ప్రమోట్ చేసినంతమాత్రాన, అందుకని దాన్ని అక్షరాల్లో దునుమాడినంత మాత్రాన ఇప్పుడు యోగా హఠాత్తుగా చేదు అయిపోదు… విచిత్రం ఏమిటంటే… ఇదే పత్రికలో ఇదే పార్టీ అధినేత, ఇదే పత్రిక ఓనరుడైనటువంబటి జగన్ ప్రకటన ఉంది...

సాక్షి

‘‘యోగా మన జీవితంలో భాగం కావాలి, ఇది దేహం మీదే కాదు, ఆత్మ మీదా పనిచేస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది’’ అని సెలవిచ్చాడు… హహహ… మరొకటీ ఉంది… ఆ వ్యాసం కనిపించిన పేజీలు రెండోమూడో తిప్పేశామో లేదో సిటీ ప్లస్ అని ఓ ఫీచర్ పేజీ దర్శనమిచ్చింది… అందులో ప్రధాన కథనం ఏమిటో తెలుసా..?

డయాబెటిస్, బీపీ, ఆస్తమా, జీర్ణ సమస్యలు, మైగ్రేన్, డిప్రెషన్, ఒబెసిటీ, వెన్నునొప్పి వంటి సర్వరోగాలకూ యోగాయే జిందాతి లిస్మాత్, అమృతాంజన్ అన్నట్టుగా రాసుకొచ్చారు వివరంగా… అవున్నిజమే సుమీ అని ఓ డాక్టరయ్య సర్టిఫికెట్టు కూడా జతచేశారు…

మరలాంటప్పుడు ఎడిట్ వ్యాసంలో అలా చంద్రబాబు యోగా మేనియా, పబ్లిసిటీ ప్రయాస మీద అలా కలం పారేసుకోవడం దేనికి..? ప్చ్, కొన్నాళ్లు వ్యాసకర్త సీరియస్‌గానే అష్టాంగయోగ ప్రాక్టీస్ చేయాలి... తప్పదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?
  • ఇందిరమ్మ బీమా ! రేవంత్ రెడ్డి తనే ఓ సీరియస్ లుక్కేయాలి !!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • Empress Sridevi – బయోపిక్‌లో ప్రియాంక చోప్రా ! హింట్ ఇచ్చేసిందా !!
  • AI చాట్ జీపీటీని ఏళ్ల క్రితమే ఊహించిన యండమూరి !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions