- జగన్ ఏపీ సాహిత్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమించిన మహిళ ఆంధ్రా సాహిత్య అభిమానుల్లో ఎవరికైనా తెలుసా..?
- ఆల్ రెడీ లక్ష్మిపార్వతి అధ్యక్షురాలిగా ఉన్న తెలుగు అకాడమీ ఉద్దరించింది ఏమిటి..? తెస్కృత అకాడమీగా పేరుమార్చి, రెండు భాషలూ పేకముక్కలే అని సూత్రీకరించడమేనా..?
- దృశ్య కళల అకాడమీ, చరిత్ర అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ వంటి రకరకాల సంస్థల పేర్లు కనిపిస్తున్నాయి జాబితాలో… అసలు అవి గతంలో ఉన్నాయా..? ఉంటే ఏం చేసేవి..? ఏం చేయాలి..? సంసృతికి ఓ కార్పొరేషన్ అవసరమే అనుకుందాం… దాన్ని ఇన్ని భాగాలుగా విభజించి, పప్పూబెల్లాల్లా పదవులు పంచిపెట్టాలా..? పోనీ, ఈ పోస్టులకు ఎంపికైనవాళ్లు ఎవరికైనా తెలుసా..? వాళ్లకూ ఆ సబ్జెక్టులకూ ఏమైనా సంబంధం, పరిచయం, ప్రవేశం, ఆసక్తి, చరిత్ర ఉందా..?
- ఇలాంటివే బోలెడు… ఏపీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశారు కదా… మళ్లీ రీజనల్ బోర్డుల వారీగా పదవుల పందేరం దేనికి..? వాళ్లు ఏం చేయాలి..?
- డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఇలా పాలకవర్గాలను నామినేట్ చేసిన చరిత్ర ఉందా..? పాపం, గతంలో ఎన్నికలూ గట్రా ఉండేవిగా…? ఇంకేముంది, సాగునీటి సంఘాలు గట్రా సహకార రంగంలోని ప్రతి నియామకాన్ని నామినేషన్ రూట్లోకి మళ్లించేయండి…
- టైలర్లకు ఓ కార్పొరేషన్… హేమిటో… మరి ప్రతి కులానికీ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్దరిస్తున్నట్టుగానే, ప్రతి వృత్తికీ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇంకా బోలెడు మందికి పదవులిచ్చేవాళ్లం కదా…
- క్రైస్తవ ఆర్థిక సంస్థ సరే… వక్ఫ్ బోర్డు సరే… హజ్ కమిటీ సరే… షేక్ కమిటీ సరే… మళ్లీ ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ సరే… మరి ఫాఫం, హిందువులకు ఓ సంస్థ ఏది..? జైనులు, సిక్కులు, పార్శీలు ఏం పాపం చేశారు..? అందరినీ మైనారిటీ కార్పొరేషన్ ఛత్రీ కింద కమ్మేశారా..?
- క్రిస్టియన్లలో ప్రొటెస్టెంట్లకు వేరే, కేథలిక్కులకు వేర్వేరు సంస్థలు ఏవి..? ముస్లింలలో సున్నీలు, షియాలకు వేర్వేరు ఎందుకు లేవు..? తదుపరి లిస్టులో ఉంటాయా..?
- ఫారెస్ట్ కార్పొరేషన్ ఉంది కదా, మరి ఈ గ్రీనరీ కార్పొరేషన్ ఏమిటి..? ఏం చేయాలి..? సుందరీకరణ అట… ఎవరిని..? వేటికి..?
- తెలుగు అకాడమీ ఉంది, ఉర్దూ అకాడమీ పెట్టారు… మరి తమిళ, ఒడియా, కన్నడ అకాడమీల మాటేమిటి..?
- సరే, సరే… సామాజిక న్యాయం సూపర్ సరే… మరి సామాజిక ప్రయోజనం ఏముంది ఈ పనికిమాలిన కార్పొరేషన్లతో..? అసలు ఎన్నింటికి ఆఫీసులున్నయ్, కనీసం అంటెండర్లు, కుర్చీలైనా..? వాటి విధివిధానాలేమిటి..? ఇప్పటివరకూ ఉనికిలో కూడా లేని అకాడమీలకు పాలకవర్గాలతో ఏం ఉద్దరించాలని..?
- అప్పట్లో చంద్రబాబు ఇలాంటి కథలు చాలా పడేవాడు… కాస్త చదువూజ్ఞానం ఉన్నవాడు విసుక్కునేవాడు, తిట్టుకునేవాడు… మరి జగన్ చంద్రబాబుకన్నా ఏం భిన్నం..? దీన్ని మరో హైట్లోకి తీసుకుపోతున్నాడు కదా…
- సరే, రాజకీయాల్లో తన అనుచరగణాన్ని ప్లీజ్ చేయడం ఓ అవసరం… పనిలోపనిగా బీసీలకు, మహిళలకు బోలెడు ప్రాధాన్యం ఇచ్చామనే ముద్ర అవసరం… నిజంగా ఆ మైలేజీ వచ్చిందా..? మస్త్ డబ్బు కొట్టేసే డప్పు పత్రికలు, సైట్లు కూడా పట్టించుకోలేదు… నిజంగానే ఆ పదవులు పొందినవాళ్లకు ఆనందం ఉంటే ఇప్పటికే సాక్షి పత్రిక బోలెడన్ని పేజీల యాడ్స్‌తో బరువు పెరిగిపోయేది…
- గ్రంథాలయాల సంస్థలకు నియామకాలూ ఓ కంట్రవర్సీయే…
- అసలు ఈ నియామకాలతో సంకల్పించిన ఒక్క ఉద్దేశమైనా నెరవేరుతుందా..? లాఫింగ్ స్టాక్‌గా మారడమేనా..? నేను చంద్రబాబు తాతను అని ఇలా కాదు నిరూపించుకోవడం… జగన్ ఓ నిర్ణయం తీసుకుంటే, అది దేశవ్యాప్తంగా ఓ డిబేటబుల్, కన్స్ట్రక్టివ్, సోషల్ సబ్జెక్టు కావాలి… కోట్లకుకోట్లు నెలనెలా సలహాదారులకు జీతాలు ఖర్చుచేయడం కాదన్నా…. కాస్త, మంచి సలహాలు ఇచ్చేవాళ్లను పెట్టుకో… పోయేదేమీ లేదు, జనం సొమ్మే కదా…! మరీ నీ దిక్కుమాలిన మీడియా సలహాదారుల్లాగా ఎందుకిలా…!!
- జగన్ ప్రభుత్వ పాలనకు ఓ భిన్నమైన, ఉపయుక్తమైన దిశను చూపిస్తాడని తనను నిఖార్సుగా అభిమానించేవాళ్లు కోరుకునేది… ఈ కార్పొరేషన్లను ఏకమొత్తంగా రద్దు చేయాలని…! జగన్ వంటి సాహసి కాకపోతే ఇంకెవరు చేయాలి…?! ఏం జరుగుతోంది..!! జనం నాలుగు తరాలు గుర్తుపెట్టుకునే కొత్తపాలన రీతుల్ని ఆలోచించు బాసూ… అసలే నీ ఫ్యాన్స్ మేం… గొప్పగా చెప్పుకోవాలి కదా…!!
Share this Article
Ads