Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముసలోడే గానీ మగానుభావుడు… 77 ఏళ్ల వయస్సులో మాజీ భార్యపై వ్యాఖ్యలు…

March 18, 2024 by M S R

నిజంగానే వీడొక దిక్కుమాలిన మొగుడు..! ఆయన గారి పేరు మోహన్ శర్మ… తమిళ నటుడు… ఎవరీయన అంటారా..? సీనియర్ నటి లక్ష్మి తెలుసు కదా… వందల సినిమాల్లో నటించి మెప్పించింది… తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్, అగ్రనటులందరితోనూ, అందరికీ దీటుగా నటించింది… తరువాత వయసుకు తగినట్టుగా తన పాత్రల్ని మార్చుకుంటూ, తన నట ప్రతిభతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది… ఆమె మాజీ భర్త ఈయన… అప్పట్లో ఆమెతో కొన్ని సినిమాలు కూడా జంటగా చేశాడు… తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు, తీశాడు…

ఎవరో విలేకరి ఈయన్ని గెలికాడు… దాంతో సదరు మాజీ భర్త గారు రెచ్చిపోయి… ‘‘పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీ వెంట కుక్కలా ఉంటా అని చెప్పింది… రూమ్‌కు రమ్మంది, వెళ్లాను, నన్ను పెళ్లిచేసుకో అనడిగింది… ఒక అమ్మాయి నేరుగా పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో షాక్ అయ్యాను, తరువాత ఆమె ప్రతిపాదనకు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, పెళ్లి మీద ధ్యాస లేదని చెప్పాను… తరువాత పదే పదే అడగడంతో కన్విన్సయి ఆమె నొసటన కుంకుమ పెట్టాను…

అదే హోటల్‌లో, అదే గదిలో ఆ క్షణమే భార్యాభర్తలమైపోయాం… (గాంధర్వ వివాహం..?) అదే పెళ్లి… తరువాత చెన్నై వచ్చాక లాయర్ ద్వారా మీడియాకు మా పెళ్లి విషయం బహిరంగపరిచాం… ఇదంతా 1975లో… (దాదాపు యాభై ఏళ్ల క్రితం మాట)… అప్పట్లో లక్ష్మి సంపాదన ఎక్కువే… ఓసారి షాపుకి వెళ్తే ఒక సెంట్ కావాలని అడిగాను… అప్పట్లోనే 500 పెట్టి కొనిచ్చింది… కానీ అలాంటిది తరువాత దారితప్పింది, తప్పులు చేసింది… అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను… జీవితంలోకి వేరేవాళ్లకు చాన్స్ ఇచ్చింది…’’ ఇలా చెప్పుకొచ్చాడు…

Ads

Telugu Lakshmi, Lakshmimohan, Mohan Sharma, Senioractress-Movie

వాళ్ల పెళ్లి 1975లో జరిగితే ఐదేళ్లలోనే పెటాకులైంది… ఇద్దరి నడుమ గొడవలు… చివరకు 1980లో ఆమె విడాకులు ఇచ్చింది… ఇక అసలు విషయానికి వద్దాం… ఆమె వయస్సు ఇప్పుడు 71 సంవత్సరాలు… ఆమె బతుకేదో ఆమె బతుకుతోంది… బిడ్డ ఐశ్వర్యతోనూ కొన్నాళ్లు భేదాభిప్రాయాలు… ఐశ్వర్య పెళ్లి కూడా దాదాపు అంతే… తన్వీర్‌తో పెళ్లి,  రెండేళ్లకే విడిపోయారు…

Telugu Lakshmi, Lakshmimohan, Mohan Sharma, Senioractress-Movie

మోహన్ శర్మను పెళ్లి చేసుకునే నాటికే ఐశ్వర్య పుట్టింది… లక్ష్మి మొదటి భర్త పేరు భాస్కరన్… 1971లో పదిహేడేళ్లకే మొదటి పెళ్లి జరిగింది… తరువాత ఆయనతో విడాకులు… ఇవన్నీ తెలిసే ఈ మోహన్ శర్మ పెళ్లిచేసుకున్నాడు… పరస్పర అంగీకారంతోనే… మరి పెళ్లి చేసుకో, నీ వెంట కుక్కలా పడి ఉంటానని చెప్పిన ఆమె అయిదేళ్లకే ఎందుకు ఆయన్ని వదిలేసింది… తప్పు తనలో లేదా..?

సరే, ఏదో జరిగింది… ఆమె ఇవేవీ ఎక్కడా మాట్లాడలేదు, మోహన్ శర్మను వదిలించుకున్న తరువాత శివచంద్రన్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది… తరువాత ఏమైందో తెలియదు గానీ కన్నడ నటుడు అనంత నాగ్‌తో సాహచర్యం చేసినట్టు చెబుతారు… సో, ఆమె వైవాహిక జీవితం మొత్తం ఒడిదొడుకులే… ఇద్దరూ విడిపోయాక 44 ఏళ్ల తరువాత ఇప్పుడు… ఆమె తప్పులు చేసింది, అవన్నీ చెప్పలేను అంటూ ఆమెను ఇప్పుడు కించపరచాల్సిన అవసరం ఏముంది..? ఈ వయస్సులో ఆమెకు మనోక్లేశం దేనికి..? ఈ ముసలి వయసులో ఈ ఆరోపణల ద్వారా ఈ 77 ఏళ్ల ముసలాయనకు వచ్చేదేముంది..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions