ఫాఫం, సేతుపతి…. నిన్నమొన్నటిదాకా తనపై కొంత సదభిప్రాయం ఉండేది… ఒక హీరోగా కాదు, ఒక విలన్‌గా కాదు… ఓ మంచి నటుడిగా…! ఇండస్ట్రీలో ఒకసారి మంచి పేరు వస్తే దాన్ని కాపాడుకోవడం కష్టం… ఒక మెట్టు ఎక్కడం గొప్పకాదు, ఆ మెట్టుకు మరి కొన్ని మెట్లు ఎక్కకపోయినా పర్లేదు… కానీ నిల్చున్న మెట్టు మాత్రం దిగొద్దు… దానికి చాలా జాగ్రత్తలు కావాలి… కానీ విజయ్ సేతుపతికి ఈ సోయి లేనట్టుంది… వచ్చిన పాపులారిటీని అర్జెంటుగా సొమ్ము చేసుకోవాలనే తన తాపత్రయం తనను ఇంకా దిగజార్చబోతోంది… ఈమధ్య సేతుపతి సినిమాలు చూస్తే అలాగే అనిపిస్తోంది… ఎవరేం చేయలేరు… జస్ట్, జాలిపడటం తప్పితే… కాకపోతే ఇంతకుముందు సేతుపతి సినిమా అంటే, ఆ పేరు చూసి సినిమా చూద్దాం ఓసారి అనిపించేది, ఇప్పుడు ఆ నమ్మకాన్ని కోల్పోయాడు… చేజేతులా… పక్కా ఉదాహరణ అనబెల్ సేతుపతి అనే తాజా సినిమా…
ఇప్పుడు ఓ దరిద్రం మనకు అలవాటైపోయింది… ఓటీటీతో సుఖం ఎంత ఉందో, అంతకు మించిన దరిద్రం కూడా ఉంది కదా… ఎవడో ఏ మలయాళంలోనో, తమిళంలోనో ఓ దిక్కుమాలిన సినిమా తీస్తాడు…. దాన్ని ఇక తెలుగు, తమిళం , మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి, ఐదు భాషల పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసేస్తాడు… చూసేవాడి ఖర్మ… నిర్మాతకు డబ్బు… ప్రేక్షకుడికి గబ్బు… ఈ సినిమా కూడా అంతే… అసలు సేతుపతి చాయిసే ఓ పెద్ద దరిద్రం… బూత్ బంగళా హారర్ కామెడీ సినిమాలు బొచ్చెడు వచ్చాయి ఇండియాలో… ఇంకా వస్తయ్… వాటిల్లో కథ, తొక్కాతోలూ ఏమీ ఉండదు… ఉన్నంతలో నాలుగు మంచి కామెడీ సీన్లు ప్లస్ భయపెట్టే సీన్లు పెట్టేసి, రెండు మూడు ట్విస్టులు పెట్టేసి, పల్లీబఠానీ టైంపాస్ సినిమాలాగా చుట్టేయడం, ప్రేక్షకుల మీదకు వదిలేయడం… వచ్చినకాడికి డబ్బులు లెక్కెట్టుకోవడం… అయితే దీనివల్ల సేతుపతి ఏం కోల్పోతున్నాడో తనకు తెలియనట్టుంది బహుశా…
Ads
ఇదొక చెత్త సినిమా… దీన్ని చూడటంకన్నా టీవీల్లో, యూట్యూబుల్లో వచ్చే కామెడీ సీరియళ్లు, వీడియోలు చూడటం బెటర్… పాపం శమించుగాక… ఆ దిక్కుమాలిన జబర్దస్త్ ఎపిసోడ్లు కూడా నయమే… స్థూలంగా చూస్తే సేతుపతే కాదు, తాప్సి ఉంది… జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఉన్నారు… అన్నింటికీ మించి ఆ వెటరన్ నటి రాధిక కూడా ఉంది… అసలు తాప్సి అనే మెంటల్ ఆర్టిస్టు డబ్బు కోసం ఈ పిచ్చి పాత్రకు ఒప్పుకుని ఉంటుంది… ఆఫ్టరాల్, ఆమెకూ డబ్బు కావాలి కదా… అర్థం చేసుకోవచ్చు, ఆ పాత్ర ఏమిటో, తనేం నటిస్తుందో తనకూ తెలియదు, నిర్మాతకు తెలియదు, దర్శకుడికి అసలే తెలియదు… ప్రేక్షకుడికి కూడా తెలియదు… కానీ రాధికకు ఈ వయస్సులో ఈ సినిమాలో ఈ పాత్రలో నటించాలని ఎందుకు అనిపించిందో మరి… జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ రీసెంటుగా ఇలాంటి పిచ్చి పాత్రలే చేస్తున్నారు, క్రమేపీ అవి ఇకపై డిస్‌కార్డెడ్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్లను వదిలేద్దాం కాసేపు… మరీ రాజేంద్రప్రసాద్ నవ్వించేది లేదు, ఇక ఆ పని తనకు చేతకాదు, జనానికి నచ్చదు, ఆ ఓవర్ ఎగ్జిబిషన్ చూసేవాళ్లకు కూడా చిరాకెత్తిస్తోంది… ఎందుకు రిటైర్ అయిపోడో అర్థం కాదు, తనకు ఇంకా ఇండస్ట్రీ మీద ఎందుకింత కసో అర్థం కాదు… అంతా తెలుగు ప్రేక్షకుల ఖర్మ… (సీనియర్ నరేష్ ఎంచుకునే పాత్రలు ఓసారి పరిశీలించు రాజేంద్రప్రసాద్…) జగపతిబాబు ఎంతసేపూ అదే రొటీన్ అండ్ మొనాటనీ యాక్షన్… సార్, ప్లీజ్, రిటైర్ అయిపొండి సార్… నిష్ఠురంగా ఉన్నట్టుంది కదా ఈ వ్యాఖ్య… కానీ ఈ పిచ్చి సినిమా చూశాక అందరికీ అనిపించే భావనే అది… రాధిక, సేతపతి, తాప్సి, జగపతిబాబు పేర్లు చూడగానే… ఇకపై గుడ్డిగా సినిమా చూడకుండా, ఒకటికి పదిసార్లు ఆలోచించడం బెటర్ అన్నట్టుగా ఉంది… థాంక్ గాడ్… ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేశారు… లేకపోతే వేలాది మంది జనానికి డబ్బు బొక్క… మైండ్ ఖరాబ్…!!
Share this Article