.
లక్షల మందితో నిన్న ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన హైందవ శంఖారావం వార్తకు ప్రాధాన్యమే లేదా..? విశ్వహిందూపరిషత్ నేతృత్వంలో సాగిన ఆ సభకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంది…
అంతమంది సాధుసంతులు హాజరైనందుకు కాదు… హిందూ చైతన్యం అంతంతమాత్రం కనిపించే ఏపీలో అంతమందితో సభ జరగడం, మా గుళ్లపై సర్కారీ పెత్తనాలు ఏమిటి అని ప్రశ్నించడం ఖచ్చితంగా వార్తా ప్రాధాన్యం ఉన్న సభే…
Ads
ఏపీలో జరిగింది కాబట్టి అది ఏపీ వార్త మాత్రమేనా..? ఏపీ పనికిమాలిన రాజకీయ సొల్లు వార్తలన్నీ హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలో వేసి రుద్దుతుంటారు కదా… మరి హైందవ శంఖారావం వార్తను తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లు ఎందుకు పట్టించుకోలేదు..?
ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో చిన్నాచితకా వార్తలకు కూడా చోటు దక్కుతున్నప్పుడు… ఏపీలో జరిగిన ఓ భారీ బహిరంగసభ వార్త ఎలా గాకుండా పోయింది..? మొదట సాక్షి గురించి…
ఏపీలో జరిగింది కాబట్టి ఏపీ ఎడిషన్‌లో కాసింత కవరేజీ దక్కింది… తప్పలేదు… మొదటి పేజీలో కూడా కాస్త ఉనికి కనిపించింది… కానీ హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లు..? ఏం, అది వార్త ఎందుకు గాకుండా పోయింది…? అది రాజకీయ సభ కాదు, హైందవ సభ… మరెందుకు ఈ పక్షపాత ధోరణి..?
అదే ఆంధ్రజ్యోతి చూడండి… ఏపీలో ఫస్ట్ పేజీ బ్యానర్ వేసింది… హైదరాబాద్ ఎడిషన్‌లో లోపల పేజీలకు వెళ్లిపోయినా సరైన ప్రాధాన్యమే దక్కింది… చివరకు ప్రజాశక్తి వంటి మార్క్సిస్టు పత్రిక కూడా ఏపీలో వార్త కవర్ చేసింది… విశాలాంధ్రను వదిలేయండి కాసేపు…
ఈనాడు… ఏపీ ఎడిషన్‌తోపాటు హైదరాబాద్ ఎడిషన్‌లో కూడా మంచి ప్రయారిటీ ఇచ్చింది… టీడీపీ, వైసీపీ వార్తల కవరేజీలో తేడాను వదిలేస్తే, న్యూట్రల్ వార్తల విషయంలో ఈరోజుకూ ఈనాడుదే సరైన ప్రయారిటీ జడ్జిమెంట్… ఈ కోణంలో సాక్షి ఈనాడుకు ఆమడల దూరంలో ఆగిపోయింది…
నమస్తే తెలంగాణ… దిక్కుమాలిన అనేక వార్తలకు, వక్రబాష్యాలకు చోటు ఉంటుంది తప్ప ఈ హైందవ శంఖారావం వార్త అసలు వార్తే గాకుండా పోయిందా…? ఏపీ వార్త మాత్రమేనా అది..? చివరకు వెలుగు కూడా అంతే… తెలంగాణ పత్రికలు ఐనంతమాత్రాన వేరే రాష్ట్రాల వార్తలు వేయడం లేదా..?
ఇంగ్లిషు పత్రికల రీచ్ తెలుగు రాష్ట్రాల్లో తక్కువే కాబట్టి వాటినీ పెద్దగా ఇక్కడ ప్రస్తావించుకోవడం అనవసరం… కానీ టీవీ చానెళ్లు… ఏదో టీవీ నటి ఇంట్లో కుక్కపిల్ల ఈనితే కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే బాపతు… మరి శంఖారావం వార్తకు అసలు ప్రయారిటీ ఇవ్వలేదెందుకు..?
ఈ శంఖారావంలో వినిపించిన డిమాండ్లపై అందరికీ సానుకూలత లేకపోవచ్చు, విభేదించవచ్చు, బీజేపీ ఈ తరహా సభలతో ఏపీలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నదనే అసహనం కూడా ఉండవచ్చు… కానీ అదైనా వార్తే కదా..!
Share this Article