రాజకీయంగా ఎత్తులు, జిత్తులు, ప్రయత్నాలు అన్ని పార్టీలూ చేస్తాయి… బీజేపీ కూడా చేస్తుంది… కానీ ఎటొచ్చీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే తమ లక్ష్యం దిశలో… సోనియా గాంధీ కుటుంబాన్ని వ్యక్తిగత నిందలకు టార్గెట్ చేయడం సంస్కారరాహిత్యమే… పదే పదే ఆమె విదేశీయతను, గాంధీ అనే సర్నేమ్ను, కుటుంబ వారసత్వాన్ని చర్చల్లోకి తీసుకొస్తూ ఉంటుంది… ఆ పార్టీకి ఆ కుటుంబమే కేంద్రకం కాబట్టి, ఆ కుటుంబం నుంచి పార్టీ జారిపోతే ఇక ఆ పార్టీని ఎవరూ రక్షించలేరు కాబట్టి, నానా చీలికలతో చిన్నాభిన్నం అవుతుంది కాబట్టి, తమ విమర్శకు ఆ కుటుంబాన్నే కేంద్రకం చేసుకోవడం పొలిటికల్లీ ఆప్ట్… కానీ దానికీ ఓ పరిమితి ఉంటుంది కదా… ఉండాలి కదా…
విషయం ఏమిటంటే..? ఎఐసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దాసోజు శ్రావణ్ ఓ ప్రకటన ఇచ్చాడు… సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా కేసీయార్ ఆమె జీవితాన్ని తెలంగాణ స్కూళ్ల పాఠ్యప్రణాళికల్లో చేర్చాలని కోరాడు… అనేకానేక ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులను తట్టుకుని మరీ ఆమె… తెలంగాణ సమాజానికి ఇచ్చిన మాటకు కట్టుబడి, తెలంగాణ ఏర్పాటు దిశలో స్థిరంగా నిలబడింది… ఆరోజు ఆమె అలా నిలబడకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా పుట్టేదే కాదు… ఆ సంగతి కేసీయార్‌కు కూడా బాగా తెలుసు… సో, దాసోజు కోరికను మరీ తేలికగా కొట్టిపడేయనక్కర్లేదు… వోకే, ఆయన ఓ పార్టీవాదిగా విధేయత, అభిమాన ప్రకటనలకు ఆ డిమాండ్ లేవనెత్తవచ్చుగాక…
Ads
వెంటనే బీజేపీ అలర్టయిపోయింది… అదీ జాతీయ స్థాయిలో… నిజంగానే కేసీయార్ ఆమె పాఠాన్ని సిలబస్‌లో పెట్టేసినట్టుగా ఉలిక్కిపడింది… తమ అనుకూల వెబ్సైట్లలో దాడి స్టార్ట్ చేసింది… వెటకారాన్ని దట్టించి రాతలకు దిగింది… ఓపీఇండియా సైటులో వచ్చిన ఓ వ్యాసం అలా అర్జెంటుగా వండిందే… అందులో కొన్ని అంశాలు…
‘‘అవకాశమొస్తే ఆమె జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించమనీ అడుగుతారు ఈ కాంగ్రెసోళ్లు… ఇప్పటికే దేశంలో కొన్ని వందల స్కూళ్లు, కాలేజీలు, పార్కులు, రోడ్లు, ప్రాజెక్టులు, స్టేడియాలు, వంతెనలు, పోర్టులకు గాంధీల పేర్లు పెట్టిన సంగతి కూడా మరిచిపోయి… ఆ కుటుంబభజన కోసం సిలబస్‌లను ఎత్తుకుంటున్నారు…
సిలబస్‌లో చేర్చాలట… ఏం..? అందులో, ఆమె జీవితగాథలో తన ఒరిజినల్ పేరు ఆంటోనియా మైనో అని చెబుతారా..? ఎందుకంటే, ఈ మాట అన్నందుకే ఓ మిత్రుడి టీవీ మీద డజన్ల కొద్దీ కేసులు పెట్టారు కదా… ఆమె జీవితగాథలో ఆమె స్కూలింగ్, విద్యార్హత, ప్రత్యేకించి ఆమె తండ్రి వృత్తిని కూడా పొందుపరుస్తారా..? టీనేజీలో ఆమె ఏం వృత్తి చేసేదో కూడా రాస్తారా..? ఇండియన్ నేవీ ఓడల్ని, విమానాల్ని కుటుంబ పార్టీలకు వాడుకున్న విధానమూ రాస్తారా..?
ఇందిరాగాంధీకి ఆ గాంధీ సర్నేమ్ రావడం వరకూ వోకే… కానీ అది తరువాత తరాలకు… చివరకు సోనియా, ప్రియాంకలకు కూడా ఎందుకు వర్తిస్తుందో కూడా వివరిస్తారా..? ఐనా కేవలం ఆమె బయోగ్రఫీ దగ్గరే ఎందుకు ఆగిపోవాలి..? ఆమె విగ్రహాలు, ఆమె కోసం మ్యూజియాలు, కొన్నిరోడ్లు, వంతెనలకు ఆమె పేరుపెట్టడం కూడా అవసరమేమో… అవీ డిమాండ్ చేయండి… ఇదుగో ఇంత భజన అవసరమా..? అవునూ, ఈ డిమాండ్ మీద కేసీయార్ స్పందన ఏమిటో..?’’………. ఇలా సాగిపోయింది ఆ కథనం… మరీ అంత అవసరం లేదు… వ్యక్తి ఆరాధన లేని పార్టీ ఏముంది ఇండియాలో… అది తప్పే కావచ్చుగాక… మరి మోడీని ప్రస్తుతిస్తూ వస్తున్న వేల కథనాలు, సోషల్ పోస్టుల మాటేమిటి..? సోనియాగాంధీ కుటుంబాన్ని ప్రతి విషయానికీ ఈరకంగా టార్గెట్ చేయడం అవసరమా మోడీజీ..?! తమరేమంటారు..?
Share this Article