Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నారాయణ నారాయణ… ఒక్క టీవీ రియాలిటీ షో వెనుక ఇన్ని కథలా…

September 17, 2022 by M S R

కార్పొరేట్ మీడియా ప్రపంచంలో ప్రతి కదలిక వెనుక ఓ వ్యాపార ఎత్తుగడ ఉంటుంది… తెరపై కనిపించేది వేరు, తెర వెనుక పన్నాగాలు వేరు… వందల కోట్ల దందాగా మారిన బి‌గ్‌బాస్ వ్యవహారమూ అంతే… అయిదు సీజన్ల లాంచింగ్ షోలు ఏకంగా 15 నుంచి 18 రేటింగ్స్ పొందితే, హఠాత్తుగా ఆరో సీజన్ లాంచింగ్ కేవలం 8.8 రేటింగ్స్‌కు పడిపోయిన పతనం వెనుక కూడా ఏదో వ్యాపారపరమైన వ్యూహం ఉందనే ప్రచారం టీవీ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది…

వంద కారణాలు చెప్పినా సరే… ఒకే సీజన్‌కు సగానికి సగం రేటింగ్స్ పడిపోవడం అసాధారణం… ప్రస్తుతం నడుస్తున్న సీజన్-6 లాంచింగ్ షో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని ‘ముచ్చట’ అందరికన్నా ముందే పబ్లిష్ చేసింది… వీక్ డేస్‌లో మరీ వీక్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పింది… ఒకసారి దిగువ టేబుల్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఈసారి రేటింగ్స్ దుర్భిక్షం ఏ స్థాయిలో ఉందో… సినిమా భాషలో చెప్పాలంటే సింప్లీ మెగా డిజాస్టర్… అంతే…

bb6

Ads

అయితే… ఈ పతనం ఉద్దేశపూర్వకమా..? ఇదీ ప్రశ్న… కావాలని రేటింగ్స్‌ను డౌన్ చేస్తున్నారా..? చేయవచ్చా..? తమ ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్‌ను తామే ఎందుకు అండర్ ప్లే చేస్తారు..? లక్ష్యం ఏమిటి..? ఇవీ అనుబంధ ప్రశ్నలు… సరే, నిజానిజాలు దేవుడికెరుక… కానీ ఓ డిబేట్ కోసం ఈ విశ్లేషణ…

పాపులర్ డచ్ రియాలిటీ షో బిగ్‌బ్రదర్ నుంచి పుట్టుకొచ్చిన ఇండియన్ టీవీ రియాలిటీ షో ఇది… దీని ఒరిజినల్ కంపెనీ ఎండెమాల్ షైన్ ఇండియా… దీని హక్కుల్ని అంబానీకి చెందిన వయాకామ్18 తీసుకుంది… తెలుగు, తమిళంలో ప్రసారహక్కుల్ని డిస్నీ‌హాట్‌స్టార్ తీసుకుంది… తెలుగులో స్టార్ మాటీవీ, తమిళంలో స్టార్ విజయ్, మలయాళంలో ఆసియానెట్ ప్రసారం చేస్తుంటాయి… హిందీ, కన్నడం, బంగ్లా, మరాఠీలలో కూడా బిగ్‌బాస్ షో వచ్చింది… బంగ్లా షోను అర్థంతరంగా క్లోజ్ చేసినట్టున్నారు…

కరోనా కాలంలో కూడా ఈ డిమాండ్‌ను సొమ్ముచేసుకోకుండా ఉండలేక… తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీల్లో ప్రసారం చేశారు… అయితే ఎండెమాల్, వయాకామ్, డిస్నీ‌హాట్‌స్టార్ నడుమ ఒప్పందాల గడువు పూర్తయిపోతోంది… త్వరలో రెన్యువల్ జరగాల్సి ఉంది… ఒకవైపు సోనీ, జీటీవీ కలిసిపోతున్నయ్… బిగ్‌బాస్ మీద కన్నుంది… ఇప్పుడున్న రేటు పెరగకుండా ఉండాలంటే షో రెవిన్యూను అండర్ ప్లే చేయాలి… అబ్బే, ఎవడూ చూడటం లేదు, రెవిన్యూ లేదు, యాడ్స్ లేవు అనే సీన్ స్టార్‌గ్రూపు కావాలనే క్రియేట్ చేస్తున్నదా..?

లీడ్ స్పాన్సరర్ లేడు, ఇష్టారాజ్యంగా నాసిరకం కంటెస్టెంట్ల ఎంపిక జరిగింది… రెండు వారాలకొస్తున్నా షోలో జోష్ లేదు, ఏదో నీరసంగా సాగుతోంది… హోస్ట్ నాగార్జున కూడా ఏదో తూతూమంత్రంగా వీకెండ్ షో నడిపించాడు… ఈ షోలను నిజానికి ముంబైలో ఉండే ఓ పెద్ద మనిషి ప్లాన్ చేస్తుంటాడు… పేరు అనవసరం… కానీ ఆమధ్య కాస్టింగ్ కౌచ్ విమర్శలు కూడా బాగా వెల్లువెత్తాయి కదా… తరువాత ఓ లేడీ కొలీగ్‌కు తెలుగు బిగ్‌బాస్ బాధ్యతల్ని అప్పగించినట్టు ప్రచారం సాగుతోంది… నారాయణ, నారాయణ… ఆఫ్టరాల్, ఒక్క టీవీ రియాలిటీ షో వెనుక ఇన్ని కథలుంటాయా..? ఉంటయ్…  ఈ ఒక్క షో చుట్టూ కొన్ని వందల కోట్ల దందా మరి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions