షణ్ముఖ ప్రియ… ఓ అచ్చ తెలుగు సంగీతకెరటం… మన విశాఖపట్నం అమ్మాయి… సోనీ టీవీ ఇండియన్ ఐడల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడబోతున్న ఫిమేల్ సింగర్ అనే ప్రచారం జరిగింది… ఈ 12వ సీజన్ ద్వారా అంతగా పాపులర్ అయిపోయింది… ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆ రేంజ్‌లోనే తన ప్రతిభను ప్రదర్శిస్తోంది కూడా… కానీ హఠాత్తుగా ఆమె మీద సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్టయ్యింది… మీమ్స్, కామెంట్స్ దాడికి దిగాయి… నిజానికి సీనియర్లయితే ఈ దాడికి సరైన రిప్లయ్స్ ఇవ్వగలరు… కానీ షణ్ముఖప్రియ వయస్సెంతని..? తను జవాబు చెప్పగలదా అనుకున్నారు అందరూ… అనూహ్యంగా… మంచి పరిణతితో… ఎహె, పోరా కుయ్యా, లైట్ తీసుకుంటాను ఇవన్నీ అనేసింది… గుడ్, సోషల్ మీడియా పట్ల ఉండాల్సిన వైఖరి అదే… డిస్టర్బ్ కాకపోవడం అనేది, తన పంథాలో తను వెళ్లిపోవడమనేది ఆమె జీవితానికి భవిష్యత్తులోనూ ఉపయోగకరం…
ఇక్కడ ఓ విషయం ఆలోచించాలి… ఎందుకు షణ్ముఖ ప్రియ టార్గెటైంది..? అదీ ప్రశ్న… ఇప్పటిదాకా సోషల్ మీడియా ఆమెను ఎత్తుకుంది, ముద్దు చేసింది, పొగిడింది… జిందగీ న మిలే దుబారా నుంచి మొన్న ఏదో పాట పాడాక ఆమెను, ఆమెతోపాటు పాడిన ఆశిష్ కులకర్ణిని ఎలిమినేట్ చేయాలంటూ ట్రోలింగ్ మొదలైంది… సాధారణంగా ఇలాంటి షోలలో విజేతలను జడ్జిలు వేసే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తుంటారు… లేదా ఓ ముందస్తు స్కీం ప్రకారం షో నడిపిస్తారు… బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలకు సంబంధించి, జనం నుంచి వోట్లు తీసుకుంటారు, దీనివల్ల షో లైవ్‌గా ఉంటుంది, జనాభిప్రాయం మేరకు ఎంపిక చేశామనే ఓ పిక్చర్ ఇస్తారు… అఫ్ కోర్స్, వాళ్లు అనుకున్న వ్యక్తుల్నే అంతిమంగా విజేతల్ని చేస్తారు, అది వేరే కథ… ఇండియన్ ఐడల్‌కు కూడా వోటింగ్ పెట్టారు… ఈ షో జడ్జిలు విశాల్, నేహ, హిమేష్ కాగా, కరోనా కారణంగా షూటింగు ముంబై నుంచి డామన్‌కు మారింది… జడ్జిల్లో విశాల్ మిస్సింగ్… మధ్యలో హోస్ట్ కొన్నాళ్లు మిస్సింగ్… సో, వోటింగ్ వచ్చి చేరింది…
Ads
సహజంగానే వోటింగ్ అనగానే రకరకాల ప్రభావాలుంటయ్… ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ ఎగరేసుకుపోతుందనే ప్రచారం సాగుతున్న షణ్ముఖప్రియ మీద కావాలనే ట్రోలింగ్, నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్టయ్యిందా అనే అనుమానాలు వస్తున్నయ్… అందుకే ఏకంగా ఎలిమినేట్ చేయాలనే ట్రోలింగ్ మొదలైందా..? ఆమె మీద ఆరోపణ ఏమిటంటే…? క్లాసిక్, మెలొడీ పాడలేదు.., ఉత్త లౌడ్ స్పీకర్, అరుపులు తప్ప ఇంకేమీ లేదు… ఇదీ విమర్శ… నిజానికి ఆమె క్లాసిక్ నేర్చుకుంది, చిన్నప్పటి నుంచీ ఆమె బతుకంతా పాటల సాధనే… ఆ కుటుంబమే అది… మెలొడీతోపాటు అన్నీ పాడగలదు… ఇక్కడ ఇండియన్ ఐడల్‌లో కూడా పాడింది… కాకపోతే తను ఎంచుకుంటున్నవి ఎక్కువగా పాప్ తరహా సాంగ్స్… అవి పాడి రంజింపజేయడం అంత ఈజీ కాదు… ఊరికే ఒరిజినల్‌ను కాపీ కొట్టి, పాడేసి వదిలేయడం కూడా కాదు, ప్రయోగాలు చేస్తుంది, ఇంప్రూవైజ్ చేస్తుంది… ప్రయత్నిస్తుంది… అన్నీ క్లిక్ కావాలనేమీ లేదు… కానీ కొత్తగా ట్రై చేయాలనే ఓ జీల్ ఉంది… సాధన చేసి, ప్రదర్శిస్తుంది… ప్రత్యేకించి యోడిలింగ్లో టాప్… అందుకే ఆమెకు మెచ్చుకోళ్లు లభిస్తున్నాయి.,,. అయితే…?
Pawandeep Rajan | Champawat | |
Shanmukha Priya | Visakhapatnam | |
Sawai Bhatt | Nagaur | |
Anjali Gaikwad | Ahmednagar | |
Ashish Kulkarni | Pune | |
Mohd. Danish | Muzaffarnagar | |
Nihal Tauro | Mangalore | |
Arunita Kanjilal | Kolkata | |
Sayli Kamble | Mumbai | |
Nachiket Lele | Kalyan | Eliminated 6th |
Sireesha Bhagavatula | Visakhapatnam | Eliminated 5th |
Anushka Banerjee | Chandigarh | Eliminated 4th |
Vaishnav Girish | Thrissur | Eliminated 3rd |
Samyak Prasana | Delhi | Eliminated 2nd |
Sahil Solanki | Hisar | Eliminated 1st |
ఇదీ ఈసారి లిస్టు… ఆరుగురు వెళ్లిపోయారు… అందులో శిరీష మన విశాఖ అమ్మాయే… వైష్ణవ్ త్రిసూర్, కేరళ… మిగిలిన తొమ్మిది మందిలో సవాయ్ భట్ ఏవో కారణాలతో ఇంటికి వెళ్లిపోయాడు, మళ్లీ వస్తాడో లేదో తెలియదు… తను రాజస్థానీ… ఎనిమిది మందిలో ఇద్దరే సౌత్ ఇండియన్లు… ఒకరు షణ్ముఖప్రియ, రెండు నిహాల్… ఇందులో నిహాల్ మంగుళూరు… నిహాల్ మంచి పాటగాడే గానీ షణ్ముఖ తనకన్నా ముందంజలో ఉంటుంది… అందుకని ఆమె టార్గెట్ అయ్యిందా..? ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్, కలకత్తాకు చెందిన అరుణిత, ముంబైకు చెందిన సయాలి షణ్ముఖకు బలమైన పోటీదారులు… ప్రత్యేకించి పవన్‌దీప్ రకరకాల సంగీత వాయిద్యాల్ని పలికించడంలో ప్రవేశం ఉన్నవాడు, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాడు… అరుణిత మెలొడీ బాగా పాడుతుంది… మహారాష్ట్రకు చెందిన అంజలి క్లాసిక్‌లో సూపర్, పూణెకు చెందిన ఆశిష్ అన్నీ పాడతాడు, ఢిల్లీకి చెందిన డానిష్ కూడా వోకే… అందరూ నార్తరన్ ఇండియా వాళ్లే… వోటింగులో ఎవరిని టాప్‌లో ఉంచడానికి, షణ్ముఖ మీద ఈ సోషల్ నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్టయ్యిందో బహుశా వోటింగ్ ట్రెండ్ గమనించే చానెల్ వాళ్లే చెప్పాలి… వాళ్లు ఎలాగూ చెప్పరు..! సో, ట్రోల్స్‌ను లైట్ తీసుకుని, తన పాటల మీదే కాన్సంట్రేట్ చేయడమే షణ్ముఖకు బెటర్… చేస్తున్నదీ అదే…!
Share this Article