ఎందుకుండాలి..? సింగర్ మంగ్లిని వెంకటేశ్వర భక్తి చానెల్ సలహాదారుగా నియమిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనేమీ లేదు… తెలిస్తే అభినందిస్తారు… కాకపోతే తనపై ఏ వివాదం తలెత్తినా నేను తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్నానంటుంది కదా, ఏపీ ప్రభుత్వ పదవి ఏమిటనే చిన్న షాక్ చాలామందిలో… నిజానికి ఆ ఆశ్చర్యమూ అక్కర్లేదు… పోస్టులు కట్టబెట్టడానికి జగన్‌కు ఏపీవాళ్లే కావాలని ఏమీ లేదు… వందల మంది సలహాదారులను ఆయన నియమిస్తూనే ఉంటాడు… అద్భుతమైన దాతృత్వం… అసలు ‘ఏపీ ప్రభుత్వ సలహాదారులు’ అనే సబ్జెక్టు ఓ వంద పీహెచ్‌డీలకు అనువైంది…
అఫ్‌కోర్స్, మంగ్లి ఏపీ స్థానికురాలే… పైగా ఓ మారుమూల, బంజారా తండా నుంచి, సొంతంగా కష్టపడి, ఎదిగి… ఆ క్షుద్రరాజకీయాల సినిమా ఇండస్ట్రీలో విజయకేతనం ఎగరేస్తున్నది కాబట్టి ఎస్వీబీసీ పోస్టు ఇవ్వడం పట్ల ఎవరికీ వ్యతిరేకత అక్కర్లేదు… ఆమె ఆస్తికురాలే… ఎటొచ్చీ ఎప్పుడో మార్చిలో ఆమెను సలహాదారును చేస్తే, ఈరోజుకూ అది గోప్యంగా ఉండటం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు… పెద్ద జోక్ ఏమిటంటే, మొన్నీమధ్య రోజాతో కలిసి తిరుపతి, తిరుమలలో తిరిగింది మంగ్లి…
అప్పటిదాకా రోజాకు మంగ్లి పోస్టు గురించి ఏమీ తెలియనట్టు… హఠాత్తుగా సోషల్ మీడియాలో, మీడియాలో వార్త చదివాకే తెలిసినట్టు… తను కూడా ఓ అభినందనల మెసేజ్ పెట్టింది సోషల్ మీడియాలో…! టీటీడీ, ఎస్వీబీసీ ప్రముఖుల నుంచి ఆమాత్రం రియాక్షన్ కూడా కనిపించలేదు, అదొక ఆశ్చర్యం… పైగా జగన్‌కూ టాలీవుడ్‌కూ పొసగదు కదా… తన దగ్గరకు రప్పించుకోవడానికి అప్పుడప్పుడూ కొరడా తీస్తుంటాడు కదా… రిలీఫ్ కోసం లేపనం కూడా పూస్తుంటాడు కదా… ఆలీకి ఒకటి, పోసానికి మరొకటి పోస్టులు పడేశాడు కదా…
Ads
మైనారిటీలకు ప్రాధాన్యం… ఆలీకి పోస్టు… కమ్మవాళ్లను తొక్కేస్తున్నాడు, సహించడు అనే ప్రచారానికి కౌంటర్… పోసానికి ఓ పోస్టు… అలాగే మంగ్లికి పోస్టు బంజారాలకు కూడా గుర్తింపు అన్నట్టుగా ప్రచారంలోకి వచ్చి ఉండాలి… కానీ రాలేదు… ఆమె కూడా తన పోస్టు గురించి చెప్పుకోలేదు… అదీ ఆశ్చర్యమే… ఐబీ, రా తదితర సంస్థల్లో నియామకాలు గోప్యంగా సాగుతుంటయ్… వాళ్ల వివరాలు బయటికే తెలియదు… తెలియకూడదు… జగన్ సలహాదారుల నియామకాలు కూడా అప్పుడప్పుడూ అలా సాగుతుంటాయని సర్దిచెప్పుకోవాలి… అంతే…
సలహాదారు నియామక పత్రం కూడా కాస్త వింతగా కనిపించింది… 2021 నాటి తేదీ ఒకటి కనిపిస్తోంది… నియామకపు తేదీ మార్చి 20222 అని చూపిస్తోంది… మరి ఆమె ఎప్పుడు విధుల్లో చేరిందో తెలియదు, అసలు చేరిందో లేదో కూడా తెలియదు… ఇప్పటికీ బయటపడని పోస్టుల నియామకాలు ఎన్ని జరిగాయో కూడా తెలియదు… కేసీయార్ భాషలో బబ్రాజమానం, భజగోవిందం…
సర్లె, సర్లె… విమర్శలు, సందేహాలు ఎలా ఉన్నా… మంగ్లికి అభినందనలు… కానీ మంగ్లీ బహుపరాక్… అసలు టీటీడీ, ఎస్వీబీసీలు కుట్ర రాజకీయాలకు, క్షుద్రమైన కుతంత్రాలకు పెట్టింది పేరు… అంతటి థర్టీ ఇయర్స్ పృథ్వే భయంతో వదిలేసి పారిపోయేలా చేశారు ఆమధ్య… జాగ్రత్త..! సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఖేల్ ఖతం… వందల మంది ఇతర సలహాదారుల్లాగే సైలెంటుగా, ఉండీ లేనట్టుగా ఉండు… ఈ ఏడెనిమిది నెలల్లో ఉన్నట్టుగానే… అంతే…!!
Share this Article