.
మనం రీసెంటుగా చెప్పుకున్నాం కదా… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్న చిరంజీవికి అమిత ప్రాధాన్యం ఇస్తూ సాగిలపడుతోందని..!
ది రాజా సాబ్ సినిమాకు టికెట్ రేట్ల పెంపు మెమో ఇవ్వడానికి సతాయించి, చివరకు ఎప్పుడో అర్ధరాత్రి ఇచ్చిన ప్రభుత్వం… తెలంగాణ అనధికారిక సినిమాటోగ్రఫీ మంత్రి దిల్ రాజు పంపిణీదారుడుగా ఉన్న చిరంజీవి సినిమా మన శివశంకర ప్రసాద్ గారికి మాత్రం రెండు రోజుల క్రితమే రహస్యంగా టికెట్ రేట్ల పెంపు మెమో ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం…
Ads
గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్య అతిథి… ఏమాత్రం పెట్టుబడులతో గానీ, పాలసీ మేకింగుతో గానీ సంబంధం లేదు చిరంజీవికి… ఐనా మంత్రులను పంపించి పిలిచారు… పెడితే గిడితే తన వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రాలో పెడతాడు తప్ప తెలంగాణలో పైసా పెట్టడు తను…
తరువాత కుటుంబ వినోద పర్యటనకు వచ్చిన చిరంజీవిని దావోస్‌కు పిలిచి, అమిత ప్రాధాన్యం ఇచ్చాడు రేవంత్ రెడ్డి… నిజానికి దావసో ఈవెంట్‌కు ఏరకంగానూ లింక్ లేని వ్యక్తి చిరంజీవి… ఏమిటిదంతా…

అంతకుముందు కొన్ని సినిమాల టికెట్ రేట్ల పెంపు మీద హైదరాబాద్ హైకోర్టు వ్యతిరేకంగా స్పందించిన విషయం తెలియదా... తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఐపీఎస్ ఆనంద్ ఆ మెమోను ఎందుకు జారీ చేసినట్టు..? తను ఇప్పుడు నేరుగా హైకోర్టు రాడార్ పరిధిలోకి వచ్చాడు...
ఒకవైపు సంబంధిత మంత్రి కోమటిరెడ్డి నథింగ్ డూయింగ్ టికెట్ రేట్లు పెంచేది లేదంటాడు, మరోవైపు హోం శాఖ రేట్ల పెంపు మెమో జారీ చేస్తుంది… ఏమిటిది..? ఎస్, అదే హైకోర్టు కూడా అదే అంటోంది.,..

తాజాగా జరిగింది ఏమిటీ అంటే…? ఈ చిరంజీవి సినిమాకు పెంచిన టికెట్ రేట్లతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… ఆ వసూళ్లపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశం…

మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రత్యేక షో టికెట్ ధర రూ.600, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుతూ ఈ నెల 8న మెమో జారీ చేశాడు హోంశాఖ ముఖ్య కార్యదర్శి… కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మెమో జారీ చేసి రూ.42 కోట్లు అక్రమంగా ఆర్జించారని వాటిని రికవరీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి…

దీనిపై విచారణ జరిపి రూ.42 కోట్లపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీఎస్టీ అధికారులను ఆదేశించిన హైకోర్టు… ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేసింది…
ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏమిటంటే..? కోర్టు ధిక్కారమని తెలిసీ తెలిసీ చిరంజీవి సినిమాకు ఆ ఆర్జన మెమో ఎందుకు జారీ చేసినట్టు..?

Share this Article