Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మమత ఎందుకు ఓడిందంటే..? బెంగాల్ ఎలా విముక్తం అయ్యిందంటే..?

May 4, 2026 by M S R

.

తాటకి ఓడిపోయింది..! ఈ వ్యాఖ్య చేయడానికి సందేహించడం లేదు… పాత్రికేయ పడికట్టుపదాల్లో ఒకటైన బ్యాలెన్స్ కూడా ఇక్కడ అక్కర్లేదు… మమతా బెనర్జీ ఈ దేశసమగ్రతకు, భద్రతకే ప్రమాదకారిగా మారిన స్థితిలో ఆమె ఓటమి బీజేపీ గెలుపు కాదు… దేశం గెలుపు… జాతీయత గెలుపు… ఖచ్చితంగా చెప్పాలంటే ఇదే నిజం…

బెంగాల్ ఎన్నికల ఫలితాలు వర్తమాన భారతీయ అధికార యవనికపై విశేష చిత్రం… కొన్నాళ్ల పరిణామాలు పరిశీలించండి ఓసారి…

Ads

ఢిల్లీ బీజేపీ చేతుల్లోకి… ఒడిశా బీజేపీ చేతుల్లోకి… బీహార్ దాదాపుగా బీజేపీ చేతుల్లోకి.., హిమాచల్ అనే చిన్న రాష్ట్రంలో కాంగ్రెస్, పంజాబ్‌లో ఊగిసలాడుతున్న ఆప్… తాజాగా బెంగాల్‌లో మమత ఓటమి… అంతే… ఇక మొత్తం నార్తరన్ ఇండియా బీజేపీ చేతుల్లోకి… మోడీషా క్రమంగా ఆక్రమించుకుపోతున్నారు…

మమత ఓడిపోగానే కొన్ని యాంటీ ఇండియన్ మెంటాలిటీస్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు… సర్ పుణ్యం, సీఈసీ విజయం… సీఏఆర్ఎఫ్ బలగాల విజయం… సుప్రీంకోర్టు నియమించిన న్యాయాధికారుల విజయం… బీజేపీ అధికార దుర్వినియోగం… ఇలాంటి కుంటిసాకులకుతోడు ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేసిందనే విఫల వాదన కూడా వినిపిస్తారు…

ఓ రౌడీరాజ్యంగా మార్చిన మమత వైఫల్యం ఇది… జనం తీవ్రంగా థూత్కరించిన సందర్భం… బంగ్లా అక్రమ వలసదార్లను వోట్ల కోసం చేరదీసి, మద్దతు పలికి… స్థానిక డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ చెల్లాచెదురు చేసి, చివరకు చికెన్ నెక్, సిలిగురి కారిడర్‌ను సున్నిత ప్రాంతంగా మార్చింది ఆమె… బంగ్లా సరిహద్దుల్లో కంచెకు అడ్డు.,. పాకిస్థాన్ చంకలో దూరిన బంగ్లాదేశ్ ఓ భస్మాసురదేశం ఇప్పుడు మనకు… ఈ స్థితిలో మమత ఓటమి ఈ దేశావసరం…

ఆమె సీబీఐ, ఈడీలను రానివ్వదు… బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల నుంచి స్థానిక ఎన్నికల్లో నామినేషన్లే వేయనివ్వదు… వోట్లు వేయనివ్వదు… పక్కా హిందూ వ్యతిరేకి… అడుగడుగునా రౌడీరాజ్యమే… దీనికితోడు మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆర్థిక అరాచకం సరేసరి… క్రమేపీ హిందూ వోటు అక్కడ కన్సాలిడేట్ అయ్యింది…

ఎస్, ఇప్పుడు ఆ తాటకి నుంచి బెంగాల్ విముక్తమైంది… ప్రభుత్వ వ్యతిరేకతను మించి ఆమె ఈ దేశానికి ప్రమాదకారి అనే భావన ప్రజల్లో వ్యక్తమైంది… అందుకే ఊహించని స్థాయిలో ఓటమి… ఆమె ధోరణి ఏమిటో సీఈసీ గమనించింది, సుప్రీం గమనించింది, ప్రజలు గమనించారు… దేశం గమనించింది… అదే ఆమె ఓటమికి కారణం… కలకత్తా కాళిమాత శపించింది…

ఇంకా అనేక కారణాలు ఉండవచ్చుగాక… కానీ దెబ్బతిన్న పాము మరింత ప్రమాదకరం… అందుకే బీజేపీ చాలా జాగ్రత్తగా పాలించాల్సి ఉంది… టీఎంసీ రౌడీలను అణిచివేయాల్సిన అవసరమూ ఉంది… లేకపోతే రెట్టించిన బలంతో లేస్తుంది ఆమె… ఎన్నిక గెలవడం కాదు, బీజేపీ అసలు పరీక్ష ఆమె మళ్లీ లేవకుండా ఉక్కుపాదం మోపడం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మమత ఎందుకు ఓడిందంటే..? బెంగాల్ ఎలా విముక్తం అయ్యిందంటే..?
  • పుదుచ్చేరి..! బీజేపీ సౌత్ స్ట్రాటజీకి బ్లూప్రింట్… ప్రయోగం సక్సెస్…!!
  • కేరళం వామపక్షాన్ని తిరస్కరించడం వెనుక ఇవీ కారణాలు..!!
  • డెలివరీ ఆఫ్ ప్రజెన్స్… ఫుడ్ కాదు, పలకరించే గొంతుక కావాలి…
  • హిమంత హేట్రిక్… కాంగ్రెస్ స్వయంకృతం… ఇవీ అసలు కారణాలు…
  • మరదళ్లకు అక్క మొగుడు బావే కాదు… నాన్న కూడా..!
  • ఇద్దరూ అగ్రనటులే… ప్చ్… ఆ గ్రేట్ కాంబినేషన్ రేంజ్ మిస్సయింది…
  • Unsung Hero of IPL… భువనేశ్వర్ కుమార్… పక్కా పర్‌ఫామర్…
  • IPL 2026… తోపుల తోకలు కత్తిరించబడ్డయ్… పంజాబ్, హైదరాబాద్ ఓటమి…
  • ’వారణాసి‘కి నీటిఎద్దడి… జలమండలి నిర్ణయం భేష్… కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions