.
ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ప్రతి జర్నలిస్టు సంఘం ధైర్యంగా బయటికి వస్తోంది ఇప్పుడు… జర్నలిస్టు సంక్షేమం, భద్రత తమ ధ్యేయం అన్నట్టుగా స్పందిస్తున్నాయి…
ఏదీ… మెయిన్ సంఘాలు ఒక్కటీ స్పందించవేం..? భయమా..? భక్తా..? గౌరవమా..? భయంతో కూడిన భక్తితో వచ్చిన గౌరవమా…? ఈ సమయంలో కూడా స్పందించకపోతే మీ బతుకులు ఎందుకు మిత్రమా..?
ఎస్, మోహన్‌బాబు మహా కోపిష్టి, అహంకారి… స్వార్థపరుడు… ధనకాంక్ష… ఎవడిని పడితే వాడిని తిట్టి, అవసరమైతే దాడికి దిగే కేరక్టర్… అవలక్షణాలన్నీ మూర్తీభవించిన రూపం అది… ఇన్నేళ్లూ నడిచింది… తన కులమో, తన ధనమో… భజన తప్ప, కీర్తన తప్ప విమర్శ ఎరుగని కరెన్సీ కవర్ జర్నలిజం అసహాయతో…
Ads
ఏదైనా ఒక్క మాట రాయడానికి భయం… దౌర్జన్యం… లీగల్ నోటీసులు… యూట్యూబ్ చానెళ్ల రద్దు… తనొక తండ్రి, తనొక కొడుకు… ఎప్పుడైనా దొరక్కపోరు అని ఎదురుచూస్తూ కసిగా జర్నలిస్టులు… ఇప్పుడు దొరికాడు… మరీ టీవీ9 రిపోర్టర్ మీద దాడి చేస్తూ దొరికిపోయాడు…
మోహన్‌బాబు నిజ అహంతత్వానికి ఈ దాడి చిన్నదే… మహా ముదురు… మహా పొగరు… మహా —… వద్దులెండి… అందుకే ప్రతీ జర్నలిస్టు సంఘం స్పందిస్తోంది,., ఒరేయ్, కోన్‌కిస్కా, మా జోలికి వస్తావా అని అడుగుతోంది,., కానీ ఈ కొట్లాటల్లో ఒక్కడంటే ఒక్కడూ మోహన్‌బాబును సమర్థించేవాడు లేడు… అదీ తను సాధించిన ఘనత తన జీవితంలో… ఎందుకు బ్రదర్ ఈ బతుకు..?
ఎస్, అదొక దరిద్రపు ఛానెల్… నాటి రవిప్రకాష్ నుంచీ నేటి రజినీకాంత్ దాకా… అది మారదు… ఆఫ్టరాల్ ఓనర్స్ వస్తుంటారు, పోతుంటారు… రజినీకాంతులు మారరు కదా… వాళ్లే నాలుగు చానెళ్లను పెట్టే స్థితికి వచ్చినా సరే మైహోం కళ్లు తెరుచుకోవు కదా…
నిజానికి అక్కడ దాడికి గురైన జర్నలిస్టు టీవీ9 బాపతు కాకపోతే ఇంకా మంచి స్పందన వచ్చేదేమో… అదీ టీవీ9 క్రెడిబులిటీ… సరే, మోహన్‌బాబు క్రెడిబులిటీ గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ… తన జల్‌పల్లి ఇల్లు, ఓ కోట.., ఓ రాజప్రాసాదం… అదొక కోట… అదొక అంతఃపురం.,. ఎవరెవరి ఆస్తులు కలిసి వచ్చాయో… కోడళ్లయో, సౌందర్యయో… విద్యార్థుల తల్లిదండ్రుల బతుకులవో…
ఏమో, నాటి గొప్ప నటి సౌందర్య ఆస్తిని మోహన్‌బాబు కాజేశాడనే టాక్ వినిపిస్తుంది ఇండస్ట్రీలో… ఏమో… ఒకప్పుడు చెన్నైలో పస్తులున్న మోహన్‌బాబుకు ఇన్ని వేల కోట్ల ప్రాపర్టీస్ ఎలా వచ్చాయి మరి..? తన యూనివర్శిటీ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేయడంతోనే కదా… కాదంటారా..? తను తీసిన గొప్ప సక్సెస్‌ఫుల్ సినిమాలు ఏమున్నయ్..?
తను నయాపైసా సమాజానికి తిరిగి ఇచ్చాడా..? నో… సవాలే లేదు, ఇంకాస్త దండుకోవడం తప్ప..! ఈ సమాజం ఎందుకు క్షమించాలి తనను..? కోర్టుకు వెళ్లాడు, తనకు అడిగిన భద్రత ఇవ్వలేదు ఈ తెలంగాణ ప్రభుత్వం అని… ఎందుకివ్వాలి,..? నువ్వెవరు..? నీకెందుకు ప్రజాధనంతో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి…? మీరూ మీరూ ఆస్తుల కొట్లాటలో తన్నుకొండి, సొసైటీకి ఎందుకు బాధ…?
నువ్వెలాగూ సొసైటీకి నయాపైసా అక్కరకు రావు… పోనీ, తెలంగాణ సమాజానికి నువ్వొక వేరుపురుగువు… నీకెందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి…? నీ బౌన్సర్లు ఉన్నారు కదా, నీ కొడుకునే కొట్టిస్తున్నావు కదా,.. తెలంగాణకు నీతో నయాపైసా ప్రయోజనం లేదు, పైగా తెలంగాణ వనరుల అపాత్రదానం…
ఐనాసరే, రేవంత్ రెడ్డి నిన్ను గనుక ఒకవేళ ఆదరిస్తే… అది తన ఖర్మ… నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన రేవంత్ రెడ్డి ఒకవేళ నీ రాజప్రాసాదం లోటుపాట్ల మీద కన్నేయకపోతే రేవంత్ రెడ్డే పెద్ద తెలంగాణ ద్రోహి అవుతాడు… అచ్చం కేసీయార్ మోహన్‌బాబును వదిలేసి క్షమించినట్టే…
ఎస్, టీవీ9 జర్నలిస్టు గాకుండా ఇంకెవరో అయితే మోహన్‌బాబు చర్య మీద ఇంకాస్త ఎక్కువ వ్యతిరేకత వచ్చి ఉండేదేమో… మంచు మనోజ్ క్షమాపణలు చెప్పినా సరే… మోహన్‌బాబు మీడియాకు దొరికాడు… మళ్లీ దొరకడు… బజారులో పరువు పోయిన ఫ్రస్ట్రేషన్‌లో పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నాడు… మీడియా ఎందుకు వదలాలి తనను..? వదలాలి అని చెప్పడానికి 0.000001 శాతం కూడా సమర్థన లేదు…!!
చివరగా ఒక జోక్… మోహన్‌బాబుకు జర్నలిస్టులంటే గౌరవం అని మా అసోసియేషన్ అధ్యక్షుడు, దుబాయ్‌లో నివాసముంటున్న మంచు విష్ణు ఉవాచ… ఫాఫం..!!
Share this Article