Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!

August 25, 2025 by M S R

.

ఏపీలో తెలుగుదేశం కూటమికి ఒకడే ప్రత్యర్థి… స్ట్రెయిట్ టార్గెట్… సరే, ఆ కూటమిని కౌంటర్ చేయడంలో ఆపసోపాలు ఎలా ఉన్నా… తెలంగాణలో..?

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ప్రత్యర్థులు… బీజేపీ, బీఆర్ఎస్… అఫ్‌కోర్స్, బీజేపీ గనుక నిజంగానే బీఆర్ఎస్‌ను విలీనం చేసుకుంటే… ఇక స్ట్రెయిట్ ఫైట్ బీజేపీ, బీఆర్ఎస్ కూటమితోనే… దానికి టీడీపీ, జనసేన తోడు…

Ads

సో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓ క్లారిటీ ఉండాలి… ఈరోజుకు ఏదో మాట్లాడాంలే, రోజు గడిచిందిలే అనుకునేట్టు ఉండొద్దు… ఓ టెంపర్ ఉండాలి… మాటల్లో క్లారిటీ, స్ట్రాటజీ ఉండాలి… రేవంత్ రెడ్డి ఓయూ ప్రసంగంలాగా దూకుడు ఉండాలి…

  • ఫాఫం, అదేమిటో గానీ.., తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి అవేమీ లేనట్టుంది… ఏమంటున్నాడు..?

‘‘లోకసభ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ నేతలు దొంగ ఓట్లతో గెలిచారన్న అనుమానం ఉంది… దేవుడు పేరు మీద ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు… దొంగ ఓట్లతో బండి సంజయ్ ఎంపీగా గెలిచారని అనుమానం ఉంది… బండి సంజయ్ బీసీ కాదు, దేశ్‌ముఖ్…’’ అంటున్నాడు తను…
ఈ విమర్శలు చదివి నిజంగానే బండి సంజయ్ పడీ పడీ నవ్వుకుని ఉంటాడు… ఫాఫం, తెలంగాణ పీసీసీ మరీ ఈ దుస్థితిలో ఉందా అని..! చివరకు కాంగ్రెస్ కేడర్ కూడా నవ్వుకునే రేంజ్ విమర్శలు, వ్యాఖ్యలు… ఇక్కడే టీపీసీసీ జాగ్రత్తగా ఉండాల్సింది…



1. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది కాంగ్రెసే… మొన్నటి లోకసభ ఎన్నికల సమయంలో కూడా..! మరెందుకు దొంగ వోట్ల మీద యాక్షన్ లేదు..?

2. 15 నెలలు అవుతున్నా ఫిర్యాదు చేయలేదెందుకు..? అది మీ బాధ్యత కాదా..? ఐనా బండి సంజయ్ దేశ్‌ముఖ్ ఏమిటి..? ఏదైనా మాట్లాడితే జనం ఆమోదించాలి, నవ్వుకోవద్దు… దేశ్‌ముఖ్ అంటే తెలుసా అసలు టీపీసీసీ అధ్యక్షుడికి..?!

3. బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు దుబ్బాక బై ఎలక్షన్ బిజెపి గెలిచింది… హుజురాబాద్ బై ఎలక్షన్ బిజెపి గెలిచింది… అప్పుడు కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాలేదు… GHMC ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలిచింది… కాంగ్రెస్ కేవలం రెండే గెలిచింది… మరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 63 సీట్లు వచ్చాయంటే, అదే కదా దొంగ ఓట్లతో గెలిచినట్లు..?

ఇదీ బీజేపీ పొలిటికల్ కౌంటర్… సో, టీపీసీసీ అనాలోచితంగా బండి సంజయ్‌తో గోక్కుని, అక్షింతలు వేయించుకోవడమే ఇదంతా…! మొన్నటికి మొన్న ఉత్తర తెలంగాణ పరిధిలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజక వర్గాల 2 ఎమ్మెల్సీలను గెలిపించుకున్నది బీజేపీ… సో, కాంగ్రెస్ తన ప్రథమ ప్రత్యర్థి ఎవరో ముందుగా తేల్చుకోవాలి…




  • బండి సంజయ్ గురించి అని కాదు గానీ… తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చారు… దొంగ వోట్లతో గెలిచారు అనడం తెలంగాణ ప్రజల విజ్ఞత, తీర్పును అవమానించడం..! ఏదో ఒకటి మాట్లాడేశాం అనుకుంటే… అవి కాస్తా కౌంటర్ ప్రొడక్ట్ అవుతాయి… దిగువ స్థాయిలో ఎవరైనా ఇలా మాట్లాడితే… పీసీసీ అధ్యక్షుడు నియంత్రించాలి… మరి తనే మాట్లాడితే..? ఫాఫం…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంపైన ఎమ్మెల్యేల మీదే పేద్ద రాద్దాంతం ఇప్పుడు..! ఒకవేళ నిజంగానే బీజేపీ గనుక తన ఎంపీలను, ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు సిద్ధపడితే..? ఇప్పుడంత గోక్కోవడం అవసరమా కాంగ్రెస్‌కు..? అసలే ప్రభుత్వానికి అరకొర మెజారిటీ..!

ఎస్… ఒకవైపు రేవంత్ రెడ్డి ఏదో తిప్పలు పడుతున్నాడు… బీసీ రిజర్వేషన్లు కావచ్చు, మరొకటి కావచ్చు, కాంగ్రెస్ వోట్లను సస్టెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు… ఈ దశలో బండి సంజయ్ వంటి బీసీ లీడర్లను టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ సాధించేది ఏమిటి..? ఉన్న వోటు ఊడగొట్టుకోవడం తప్ప..!

బీహార్ రాజకీయాలు వేరు… వోట్ చోరీ అనే నినాదం, స్ట్రాటజీ వేరు… అక్కడే అవి ఎదురుతంతున్నయ్… మరి తెలంగాణలో ఆ ప్రస్తావనే శుద్ధ దండుగ…

నిజానికి తాము అధికారంలోకి వచ్చిందే కేసీయార్ వ్యతిరేక వోటుతో… దాన్ని స్థిరంగా కొనసాగనివ్వాలి… కేసీయార్ మళ్లీ కోలుకోకపోతేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ… ఈ సోయి లేనట్టుంది ఫాఫం టీపీసీసీ అధ్యక్షుడికి… టాక్ట్‌ఫుల్, స్ట్రాటజిక్ కామెంట్లు లేకపోతే… అది పార్టీకే నష్టం… ప్చ్, మీనాక్షి నటరాజన్‌కు కూడా ఇవేమీ అర్థమవుతున్నట్టు లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions