Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!

September 2, 2025 by M S R

Pardha Saradhi Potluri …… రా కలిసి పంచుకుందాం – part 2

ఆగస్ట్ 15 న వ్లాడిమిర్ పుతిన్, డోనాల్డ్ ట్రంప్ అలస్కాలో సమావేశం అయిన రోజు ప్రపంచ మీడియా దృష్టి ఉక్రెయిన్ గురుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అనే విషయం మీద ఉంచారు, కానీ అదే రోజు రెండు ముఖ్య సంఘటనలని వెలుగులోకి తీసుకురావడం మీద మీడియా దృష్టి పెట్టలేదు అవి….

1.పుతిన్, ట్రంప్ సమావేశానికి వచ్చిన రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావరోవ్ ( Sergei Lavrov) ఒక T shirt వేసుకొని దానిపైన చలిని తట్టుకొనే కోటు వేసుకొని వచ్చాడు. లావరోవ్ వేసుకున్న T షర్ట్ మీద రష్యన్ అక్షరాలు CCCP అంటే USSR ( Union of Socialist Soviet Republic) అని ముద్రించి ఉన్నాయి!

Ads

2.అదే రోజు ఇజ్రాయేల్ తాము గ్రేటర్ ఇజ్రాయేల్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించింది!

పైరెండు విషయాలు సాధారణ వార్తలు కావు. అంతర్జాతీయ మీడియా ఎందుకు పట్టించుకోలేదో తెలియదు కానీ దేశాల సరిహద్దులు మారిపోయే పరిణామాలు ఉన్న వార్తలు ఇవి.
ఏమో! ఎవరు చెప్పగలరు? మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ముఖ్యమైన సంఘటనకి కారణం అవవొచ్చేమో!

ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు గ్రేటర్ ఇజ్రాయేల్ గురుంచి అధికారికంగా ప్రకటించలేదు!
పుతిన్ USSR గురుంచి అధికారికంగా ప్రకటించలేదు.
కానీ లావరోవ్ అలస్కా సమావేశానికి వచ్చినప్పుడు USSR అని ముద్రించి ఉన్న T షర్టు ధరించి రావడం అనేది నర్మగర్భంగా పాత సోవియట్ యూనియన్ ని పునర్నిర్మిస్తాము అనే సందేశం ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది.

ఇజ్రాయేల్ పౌరుడు ఒకరు గ్రేటర్ ఇజ్రాయేల్ ని సూచించే మ్యాప్ ని పట్టుకొని ఇజ్రాయేల్ సిరియా సరిహద్దు దగ్గర నిలబడి మ్యాప్ స్పష్టంగా కనపడేట్లుగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కానీ అది అతని వ్యక్తిగత అభిప్రాయం అని ఇజ్రాయేల్ ప్రకటన చేయలేదు ఎందుకని?

రెండు సంఘటనలు ఒకే రోజున అంటే ఆగస్ట్ 15 న జరగడం అదీ పుతిన్, ట్రంప్ ల మధ్య సమావేశం జరుగుతుండగా జరిగినవే!
కాకతాళీయం కాదు!
ముందే రహస్య ఒప్పందం చేసుకొని పుతిన్, ట్రంప్ అలస్కాలో సమావేశం అయ్యారు, అదీ కంటి తుడుపు చర్యగా!

.

ఇల్యూమినాటి విజయవంతంగా సోవియట్ యూనియన్ ని ముక్కలు చేసి 35 ఏళ్ళు అవుతున్నది. ప్రస్తుత ఇల్యూమినాటి ఆలోచనలు, ప్రణాళికలు బలహీనపడుతున్న తరుణంలో పుతిన్ పాత పగ తీర్చుకోవడానికి పావులు కదుపుతున్నాడు?

Yes! అలస్కా శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికాకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పుతిన్ తన ఖాతాలో వేసుకుని తిరిగి మాస్కో వెళ్ళిపోయాడు! ఇది నా అభిప్రాయం కాదు. ఇంటర్నేషనల్ మీడియా సాక్షిగా ప్రపంచదేశాలు ప్రత్యక్షంగా చూసినదే!

అర్కిటిక్ లో అమెరికాకి భాగం లేదు?
అలస్కా నుండి పుతిన్ మాస్కో తిరిగి వెళ్లిన మూడోరోజునే భారత విదేశాంగ శాఖ మంత్రి  జై శంకర్ పుతిన్ ని కలిశారు!
పుతిన్, జై శంకర్ సమావేశం ఏదో మొక్కుబడిగా జరగలేదు!
భారత ప్రధాని నరేంద్ర మోడి సందేశాన్ని మాస్కోకి తీసుకెళ్లారు జై శంకర్ !
జైశంకర్ ఎలాంటి దుబాసి అవసరం లేకుండా అనర్గళంగా రష్యన్ భాషలో పుతిన్ కి మోడీ సందేశం చెప్పారు.

పుతిన్ తిరిగి మోడీకి ఇచ్చిన సందేశం: ఇప్పటికే ఇస్తున్న ధర మీద మరో 5% డిస్కౌంట్ పెంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చు ఇది తక్షణం అమలులోకి వస్తుంది…

ఆర్కిటిక్ లో ఆయిల్, నాచురల్ గ్యాస్, ఇతర అరుదైన భూ ఖనిజముల ( Rare Earth Minerals) అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్ కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరాడు పుతిన్.
ఈరోజు చైనాలో పుతిన్, మోడీ, జిన్జ్పింగ్ లు కలిసి సమావేశం అయి ఇల్యూమినాటి టారిఫ్స్ మీద కీలక చర్చలు జరుపుతున్నారు!
రేపటి రోజు ప్రపంచ రాజకీయ సమీకరణాలని మార్చబోయే రోజు అవుతుంది!
రేపటి రోజు ఇల్యూమినాటికి మరణం ఎప్పుడో నిర్ణయించే రోజు అవబోతున్నది!

అఫ్కోర్స్! ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్యూమినాటి భారత్ మీద విధించిన టారిఫ్స్ విషయం మీద ట్రంప్ తో చర్చలు జరుపుతున్నాడు!
అందుకేనేమో ట్రంప్ భారత ప్రధాని మోడితో మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ మోడీ స్పందించలేదు!

ఈ వార్త నిజమేనా?

ఈ వార్తని మొదటి సరిగా వెలుగులోకి తెచ్చింది జెర్మన్ పత్రిక FAZ ( Frankfurter Allgemeine Zeitung).
ఢిల్లీకి పోయి మెడలు వంచిన బాబు, జగన్.. ఇలా ఎలివేషన్లు ఇచ్చి జాకీలు వేసే తెలుగు మీడియాని చూశాం, ఇంకా చూస్తేనే ఉన్నాం!
కానీ…. న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద ఆర్టికల్ ప్రచురించింది ట్రంప్, మోడీ ఫోన్ ఉదంతం మీద! ఎప్పుడూ భారత వ్యతిరేక వార్తలు వండి వార్చే న్యూయార్క్ టైమ్స్ ఈసారి జెర్మన్ పత్రిక FAZ వార్తని ధృవీకరిస్తూ ట్రంప్ మోడీతో మాట్లాడడానికి ప్రయత్నించి విఫలం అయింది నిజమే అని ఒప్పుకుంది.

Yes! ట్రంప్ అసహనం వల్ల కలిగిన కోపంతో మోడీతో మాట్లాడడానికి 4 సార్లు ప్రయత్నించినట్లు తెలుస్తున్నది.
ట్రంప్ అసహనానికి చాలా కారణాలు ఉన్నాయి…

ఆపరేషన్ సిందూర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం చేయడం వల్లనే భారత్ కాల్పుల విరమణకి ఒప్పుకుంది అని బయటి ప్రపంచానికి చెప్పుకున్నా, దానిని మోడీ, జైశంకర్ పదే పదే ఖండించడం ట్రంప్ అసహనానికి ప్రధాన కారణం.

భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరగడాన్ని ట్రంప్ ఆపాడు కాబట్టి తనని నోబెల్ శాంతి బహుమతి కోసం మోడీ నోబెల్ సెలక్షన్ కమిటీకి తన పేరుని ప్రతిపాదించాలి అని ఆశించాడు ట్రంప్!

అసలు అణు వార్ హెడ్స్ ఉన్న రెండు చోట్ల బ్రహ్మోస్ దాడి చేస్తే అణు యుద్దానికి ఆస్కారం ఎక్కడ ఉంది?
యుద్ధ నౌక, జలాంతర్గాముల నుండి అణు వార్ హెడ్స్ కలిగిన బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించగల సామర్ధ్యం పాకిస్థాన్ కి లేదు. భూమి మీద నుండి ప్రయోగించగల సామర్ధ్యం మాత్రమే ఉంది. ఈ విషయం అన్ని దేశాలకి తెలుసు.

సెకండ్ స్ట్రైక్ కాపబిలిటీ అంటే మొదటి దాడి భూమి మీద జరిగి అణుధార్మికత వ్యాపించడం వలన ఎదురు దాడి చేయలేని స్థితి వచ్చినప్పుడు సముద్ర ఉపరితలం మీద ఉండే ఫ్రీగేట్స్ లేదా జాలాంతర్గాముల నుండి అణు దాడి చేయడాన్ని సెకండ్ స్ట్రైక్ అంటారు. సెకండ్ స్ట్రైక్ కాపబులిటి కోసం కావాల్సిన టెక్నాలజీ కోసం చైనాని అడుగుతున్నది పాకిస్తాన్ చాలా కాలం నుండి. అటువంటప్పుడు అణు యుద్ధం ప్రసక్తి ఎక్కడ నుండి వస్తుంది? దానిని ట్రంప్ ఎలా ఆపగలిగాడు?

సర్గోద ఎయిర్ బేస్ లో భూగర్భ బంకర్లలో ఉన్నవి అమెరికా అణు వార్ హెడ్స్ అని మోడీ ప్రపంచానికి తెలియచేసాడు. ట్రంప్ అసహనానికి ఇది కూడా ఒక కారణం.

ఆపరేషన్ సిందూర్ కి మోడీ విరామం ఇస్తున్నాను, పూర్తిగా ఆపేసినట్లుగా కాదు అని ప్రకటించడం మరో కారణం.

well..! ట్రంప్ ఆహ్వానం మేరకు మునీర్ అమెరికా వెళ్లి మూడు రోజులు వైట్ హౌస్ కి అతిధిగా ఉన్నాడు.
అదే సమయంలో అమెరికా రావాల్సిందిగా మోడీకి ఆహ్వానం వచ్చింది వైట్ హౌస్ నుండి, కానీ మోడీ తిరస్కరించారు.

  • మోడీ వైట్ హౌస్ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి బలమైన కారణం ఉంది, అదేమిటంటే, అసిఫ్ మునీర్ తో మోడీ సమావేశం అయ్యి ట్రంప్ సమక్షంలో చేతులు కలిపి శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఆశించాడు… తప్పు తప్పు, అది ఇల్యూమినాటి ఆర్డర్. ట్రంప్ కాకపొతే ఇంకో పేరు ఉంటుంది. అది ఇల్యూమినాటి సైనిక వ్యూహం!

మోడీ ఎలా ఒప్పుకుంటారు? అసిఫ్ మునీర్ అనే వాడు సైన్యాధ్యక్షుడు మాత్రమే, అదే సమయంలో భారత్ మీద ఉగ్రవాదులని ఉసిగొల్పి భారత పౌరుల హత్యలకి కారణం అయినవాడితో మోడీ చేతులు కలపగలరా!

ఇక్కడ ఇల్యూమినాటి ప్రయోజనమే ముఖ్యంగా అసిఫ్ మునీర్ తో మోడీ చేతులు కలపాలి అనే అజెండా దాగివుంది. అమెరికా అణు వార్ హెడ్స్ ఉన్నాయని తెలిసీ మోడీ దాడి చేసి మరీ ప్రపంచ దేశాల ముందు బయటపెట్టడం అనేది ఇల్యూమినాటిని భయపెట్టింది అనడంలో సందేహం అక్కరలేదు.

ఆపరేషన్ సిందూర్ అనేది విరామం మాత్రమే అని మోడీ అనడంలో ఉన్న ఉద్దేశ్యం, మళ్ళీ ఏదన్నా ఉగ్రవాద చర్య జరిగితే ఈసారి అవే ప్రదేశాలలో తీవ్రమైన దాడి జరుగుతుంది అని చెప్పకనే చెప్పినట్లయింది. మోడీ ఆ పని చేయగలరు అనే విశ్వాసం అన్ని దేశాలకి ఉంది. మళ్ళీ దాడి అంటూ జరిగితే ఈ సారి అణు వార్ హెడ్స్ అనేవి శాశ్వత సమాధి అయిపోతాయి, ఆయా ప్రదేశాలని చేర్నోబిల్ లాగా నివాస యోగ్యం కాని ప్రదేశాలుగా ప్రకటించాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త సొరంగాలు తవ్వి కొత్త అణు వార్ హెడ్స్ ని భద్రపరచాలి అంటే మరో అయిదేళ్ల కాలం పడుతుంది. అంటే మరో అయిదేళ్ల పాటు ఇరాన్, చైనాలని బెదిరించే అవకాశం ఉండదు.

అసిఫ్ మునీర్ దగ్గర ఉన్న బ్లాక్ మనీని ‘TRUMP’ క్రిప్టో కరెన్సీలోకి మార్చుకున్నాడు. YES..! BITCOIN లాగానే TRUMP క్రిప్టోని ప్రవేశపెట్టాడు తన పేరుతోనే… ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసాడో తెలియదు కానీ TRUMP క్రిప్టోలో అసిఫ్ మునీర్ ఇన్వెస్ట్ చేసినందుకుగాను వైట్ హౌస్ లో మూడు రోజుల ఆతిధ్యం దొరకడంతో పాటు ట్రంప్ అండ ఉండడంతో అణు యుద్ధం అంటూ అవాకులు, చెవాకులు పేలుతున్నాడు అసిఫ్ మునీర్! మోడీ అలాంటి పని చేయరు.

May లో ఆపరేషన్ సిందూర్ జరిగితే జూన్ 15 నుండి 17 వరకూ రెండు రోజులపాటు G7 దేశాల సమావేశాలు జరిగాయి కెనడాలోని అల్బెర్టా ( ALBERTA) లో… ఈసారి డోనాల్డ్ ట్రంప్ నుండి G7 కి రమ్మని ఆహ్వానం రాలేదు మోడీకి. అనూహ్యంగా కెనడా ప్రధాని మార్క్ కర్నీ ( Mark Carney) నుండి G7 సమావేశాలకి రమ్మని ఆహ్వానం వచ్చింది మోడీకి.

కెనడాలో జరిగిన G7 సమావేశంలో ట్రంప్, మోడీలు ఒకరినొకరు పలకరించుకోలేదు. అంటే గత జూన్ నాటికే మోడీ ట్రంప్ మధ్య విభేదాలు పొడసూపాయి పాకిస్థాన్ విషయంలో.

మోడీకి కెనడాలో ఉన్న భారతీయులు ఘనస్వాగతం పలకగా, కెనడా పౌరులు మాత్రం ప్ల కార్డులు పట్టుకొని ట్రంప్ కి నిరసన తెలిపారు. కెనడా మీద టారిఫ్ లు విధించడం ఒక కారణం అయితే కెనడాని 51 వ రాష్ట్రంగా అమెరికాలో కలిపేసుకుంటానని ట్రంప్ అప్పటికే ప్రకటించడం మీద కెనడా పౌరులు ప్ల కార్డులతో నిరసన తెలపడమే కాదు, కెనడాలో అమెరికన్ ఉత్పత్తులని బహిష్కరిస్తున్నారు!

కెనడా మీద బ్రిటన్ రాణికి సర్వహక్కులు ఉన్నాయన్న సంగతి మరువకూడదు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీ లాండ్ దేశాల మీద బ్రిటన్ రాణికి హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం కెనడా, అమెరికాలమధ్య సత్సంబంధాలు లేవు. కెనడా తన ఉత్పత్తులని అమెరికాకి ఎగుమతి చేయడం ఆపేసింది, అలాగే అమెరికా నుండి దిగుమతులని నిలిపివేసింది…

జూన్ 16 న రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నుండి ఒక ఎగ్జిక్యూటివ్ విమానం బయలుదేరి నేరుగా జాన్ f కెన్నడి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ ఐయినట్లు టెక్ రాడార్ సంస్థ ఆ విమానం ప్రయాణించిన మార్గం మ్యాప్ తో సహా ప్రచురించింది. ఆగస్టు 15 న అలస్కాలో జరగబోయే చర్చల గురుంచి పుతిన్ తరపున సందేశం తీసుకొచ్చారు అన్నమాట! కానీ అలస్కా నుండి వెళ్లిపోయాక పుతిన్ జైశంకర్ తో సమావేశం అవ్వడం క్రూడ్ ఆయిల్ మీద మరో 5% డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.

అక్కడితో ఆగకుండా మోడీ ఢిల్లీ పర్యటనకి రావాల్సిందిగా పుతిన్ కి ఆహ్వానం పంపడం, దానికి పుతిన్ వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి.

ఇల్యూమినాటి ఊహించినది ఏమిటంటే మోడీ SCO (Shanghai Cooperation Organization) సమావేశాలకి వెళ్లడని… కానీ మోడీ SCO కి చైనా వెళ్ళడానికే నిర్ణయించినట్లు తెలియగానే ట్రంప్ & CO పానిక్ అయిపోయి వెంటనే టారిప్స్ విషయమై మాట్లాడడానికి ప్రయత్నించే క్రమంలో నాలుగు సార్లు ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించాడు. గత SCO సమావేశానికి మోడీ వెళ్ళలేదు కాబట్టి ఈసారి కూడా వెళ్ళడు అని భావించి భంగపడ్డాడు ట్రంప్!

********************
ఏ ముహూర్తాన మోడీతో వైరం పెట్టుకున్నాడో కానీ ట్రంప్ కి మనఃశాంతి లేకుండాపోయి నవ్వుల పాలు అవుతున్నాడు.
మెలానియా ట్రంప్ డోనాల్డ్ ట్రంప్ భార్య… ట్రంప్ కి తెలియకుండా పుతిన్ కి లేఖ వ్రాసింది ఉక్రెయిన్ లోని మహిళలు, పిల్లలు చనిపోతున్నారు కాబట్టి యుద్ధం ఆపేయాలంటూ!
ఎంత అప్రదిష్ట!
ట్రంప్ కి అవమానం కదా?

ఇల్యూమినాటి ట్రంప్ ని రాజీనామా చేయమని కోరవచ్చు అనారోగ్య కారణాలు చూపి.
JD వాన్స్ తదుపరి అధ్యక్షుడిని నేనే అని ప్రకటించేసాడు ఆల్రెడీ!
సీనియారిటి ప్రకారం నేనే అధ్యక్షురాలిని అవ్వాలి అని కమలా హారీస్ డిమాండ్ చేస్తున్నది.
ఏది ఏమైనా మోడీతో వైరం ఇల్యూమినాటికి అచ్చిరాలేదు!
కానీ ప్రయత్నం ఆపరు. మరింత తీవ్రతరం చేస్తారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…
  • కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
  • మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!
  • నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!
  • సినిమా ఆటంటేనే ఓ లాటరీ… నష్టానికి సిద్ధపడే ఆట మొదలెట్టాలి…
  • పంచెలో ఉన్న భర్తతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి..!!
  • సాక్షాత్తూ కేసీయార్ బిడ్డే చెబుతోంది… కాళేశ్వరంలో అవినీతి నిజమేనని..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions