Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవివేక్ కాదు… తను వివేక్ రామస్వామి… వివేకంతో తప్పుకున్నాడు…

January 20, 2024 by M S R

Jagannadh Goud……    అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నాడు. ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా చివరికి ఒకటే అని ఒక ముతక సామెత. ఇది ఇంతకాలం ఎగిరెగిరి పడిన రామస్వామికి కరక్ట్ గా సరిపోతుంది. అయితే అమెరికా లో వచ్చే నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్నై (నవంబర్ 2024). ఇక్కడ ప్రధానం గా డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఉన్నై. రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ ప్రెసిడెంట్ అభ్యర్ధులు ఉండగా వాళ్ళలో వాళ్ళకి రాష్ట్రాల వారిగా వాళ్ళ పార్టీ అభ్యర్ధులు వోట్ వేసి ఫైనల్ గా ఒకర్ని తమ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి పంపుతారు.

డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఒక్కరే వస్తున్నట్లు ఉంది కాబట్టి వాళ్ళ క్యాండిడేట్ పేరు ఎన్నికల ముందు బయటికి వస్తుంది.ఒకవేళ డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఎక్కువ అభ్యర్ధులు ఉంటే ఆయా అభ్యర్ధుల రాష్ట్రాల్లో పోటీ లొ ఉన్న వారికి వచ్చిన సొంత పార్టీ వోట్స్ ఆధారం గా ఒక్కరిని ఫైనల్ గా అధ్యక్ష బరిలోకి పంపుతారు (డెమొక్రాటిక్ పార్టీ లో కూడా ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ భైడెన్ తో పాటు ఇంకో ఇద్దరు ఆసక్తి చూపుతున్నారు: మేరియానా విలియం సన్, డీన్ ఫిలిప్స్ – మిగతా ఇద్దరూ డ్రాప్ కాకుంటే వీళ్ళలో కూడా సొంత డెమోక్రాటిక్ పార్టీ లో ఎన్నికలు పెట్టి ఒకర్ని ఫైనల్ చేస్తారు)

May be an image of 2 people and the Oval Office

వివేక్ ది రిపబ్లికన్ పార్టీ. నన్ను మించిన మొనగాడు అమెరికా లో లేడు, నేను ఒక్కడ్నే అమెరికా ని కాపాడతాను అని డకోటా కటింగ్స్ ఇచ్చి రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగాడు. తన సొంత పార్టీ వాళ్ళు అయోవా రాష్ట్రం లో వేసిన వోట్స్ ని గమనిస్తే అక్కడ రిపబ్లికన్ అధ్యక్ష బరిలో ఉన్న వారికి వచ్చిన ఓట్లని గమనిస్తే; డోనాల్డ్ ట్రంప్ కి 51% ఓట్లు, రాన్ డి శాంటిస్ కి 21.2%, నిక్కీ హేలీ కి 19.1%, వివేక్ కి 7.7% ఓట్లు. అయొవా రాష్ట్రం లో వీళ్ళ పార్టీ కి 40 మంది డెలిగేట్స్ ఉంటే 20 మంది ట్రంప్ కి, 9 మంది డి శాంటిస్ కి, 8 మంది నిక్కీ హేలీ కి, ముగ్గురు వివేక్ ని బలపరిచారు. ఇంకా మిగిలిన 49 రాష్ట్రాల్లో సొంత పార్టీ లో ప్రాధమిక ఎన్నికలు జరుగ నుండగా మొదట్ జరిగిన అయొవా రాష్ట్ర ఫలితాలు చూసి నేను డ్రాప్ అవుతున్నాను, నేను డోనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నాను అని చేతులు ఎత్తేశాడు.

ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ నుంచి డోనాల్డ్ ట్రంప్ కాకుండా బరిలో ఉన్నది ఇద్దరే: ప్రస్తుత ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్, మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ. వీళ్ళు అయినా మొత్తం ఉన్న 50 రాష్ట్రాల్లో జరగబోయే సొంత పార్టీ ఎన్నికల్లో నిలిచి ఉంటారో మధ్యలోనే చేతులు ఎత్తేచి డోనాల్డ్ ట్రంప్ నే మా క్యాండిడేట్ అంటారో చూడాలి. ఏది ఏమైనా నవంబర్ 2024 లో జరగబోయే ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే వివేక్ రామస్వామి కి తన ప్రభుత్వం లో చోటు అయితే కల్పిస్తాడు అనిపిస్తుంది.

ఇంతకాలం నానా యాగీ చేసి సొంత రిపబ్లికన్ పార్టీ లో ఉన్న 50 రాష్ట్రాల్లో ఇంటర్నల్ గా జరిగిన ఎన్నికల ఫలితాలు అదీ మొదటి రాష్ట్రం ఫలితాలు రాగానే చేతులెత్తేయటం మాత్రం వివేక్ తెలివి కి నిదర్శనం. ముందు ముందు జరగబోయే మిగతా 49 రాష్ట్రాల్లో ఎక్కడా/ ఏ రాష్ట్రం లో కూడా ఆ పిలగాడు సొంత పార్టీ లోనే గెల్వడు అని తెలుసుకొని మొదటి రోజే చెతులు ఎత్తేచి నేను డోనాల్డ్ ట్రంప్ కే సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. సొంత రిపబ్లికన్ పార్టీ లో ఉన్న ముగ్గురిలో డొనాల్డ్ ట్రంప్ నే ఆధిక్యత సాధించి నవంబర్ లో జరిగే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి మీద డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే వివేకం అలవర్చుకున్న వివేక్ రామస్వామి కి ఏదో ఒక పదవి ఇస్తాడని భావిస్తూ…!

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions