ఇది సాక్షిలో నిన్న వచ్చిన స్టోరీ… విషయం ఏమిటంటే..? ఆంధ్రజ్యోతి, ఈనాడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగు గురించి తప్పులు రాసి, తరువాత తప్పనిసరై నిజాలు రాసి… ఎంతసేపూ జగన్ మీద ద్వేషంతో నిజాలకు ఎలా పాతరేస్తున్నాయో చెప్పే స్టోరీ ఇది… సరిగ్గా ప్రజెంట్ చేయడం చేతకాలేదు కానీ… నిజానికి సాక్షి చేయాల్సిన పనుల్లో ఇదీ ఒకటి… సరిగ్గా చేయలేక చేతులెత్తేస్తున్న పని కూడా ఇదే…
గతంలో రెండు కూల్ డ్రింకుల నడుమ ఫుల్ పోటీ నడిచేది… ఒకరి డ్రింక్ గురించి మరొకరు వ్యంగ్యంగా యాడ్స్ క్రియేట్ చేసి టీవీల్లో కుమ్మేసేవాళ్లు… ఎస్… మనం వినియోగదారులం… వాళ్లూ వాళ్లూ తన్నుకుంటూ ఒకడి లోపాన్ని ఇంకొకడు గనుక బయటపెడితే జనానికి హేపీ… యూజ్ ఫుల్ కూడా… అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలని… ఒకడి బాగోతం మరొకడు బయటపెట్టాలనీ సగటు జనం కోరుకోవడం కూడా ఇందుకే… వాళ్లువాళ్లూ కుమ్మక్కయితే నామాలు జనాలకే…
Ads
సేమ్… ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తల్లోని నలుపు ఏమిటో సాక్షి బయటపెట్టాలి… అది జగన్ కోసమే కానక్కర్లేదు… పాత్రికేయం మీద ప్రేమతో కూడా చేయొచ్చు… అది జగన్కు ఉపయోగపడడం అనేది అదనపు ప్రయోజనం… ఎస్, సాక్షిలో అబద్ధాలు రాస్తే కచ్చితంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి బట్టలు విప్పాలి కూడా… సగటు పాఠకుడికి, సగటు వోటరుకు అసలు నిజం ఏమిటో తెలియాలి… తప్పేముంది..? నిజానికి పత్రికలు ఇంతకుమించి ఉద్దరిస్తున్నది కూడా ఏమీ లేదుగా…
ఆమధ్య నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతిపై ఇలాగే విరుచుకుపడింది తెలంగాణలో… అది కేసీయార్ కోసమే… నిజమే… కానీ ఆంధ్రజ్యోతి రాసింది ఒప్పా తప్పా అని సగటు పాఠకుడు ఆలోచించుకుంటాడు… తరువాత వెలుగు పత్రిక మీద కూడా ఏదో రాసినట్టున్నాడు… అవును… ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే… వెలుగు వర్సెస్ నమస్తే… ఫైట్ నడవనీ… ఎలాగూ తెలంగాణలో ఈనాడుకు ఏమీ చేతకాదు… వణుకు తప్ప… ఆమధ్య టీవీ5, ఎన్టీవీ కూడా ఏదో ఫైట్ అన్నట్టుగా ప్రోమాలతో కలరిచ్చాయి… కాసేపటికే భాయీ భాయీ అనుకుని ముడుచుకున్నాయి… కానీ టీవీ9, టీన్యూస్ చానెళ్లకూ రాజ్ న్యూస్కూ నడుమ ఈ కన్ఫ్రంటేషన్ తప్పకపోవచ్చు అనిపిస్తోంది…
ప్చ్, పతంజలి బాగోతాన్ని డాబర్ వాడు… ఆదానీ కథల్ని అంబానీ… అమిత్ షా యవ్వారాల్ని అహ్మద్ పటేల్… స్టార్ మాటీవీ వాడి రేటింగ్ తిరకాసుల్ని జీతెలుగు వాడు… జియో ప్యాకేజీల బండారాన్ని ఐడియావొడాఫోన్… బైడన్ గెలుపు తంత్రమేమిటో పుతిన్… ఇలా నిజాలన్నీ బయటికొచ్చేస్తే ఎంత బాగుండు కదా… కానీ అనేక ఫీల్డుల్లో అందరూ తేలుకుట్టిన దొంగలే… తాము ఎదుటోడి చొక్కా విప్పడానికి ట్రై చేస్తే, ఎదుటోడు తమ లుంగీ, డ్రాయర్ కూడా లాగేసే ప్రమాదం ఉంది… ఎట్ లీస్ట్, మన తెలుగు పాత్రికేయం తమ రాజకీయ ప్రయోజనాల కోసం అయినా సరే… తిట్టుకుంటున్నయ్… తప్పులు వెతికి, అవేమిటో చెప్పేస్తున్నయ్… ఆహ్వానిద్దాం… కమాన్… కమాన్… ఇంకా… ఇంకా…
Share this Article