.
అవును, మోడీకి 75 ఏళ్లు వచ్చేస్తున్నాయి… అంటే, తనే చెప్పిన సూత్రాల ప్రకారం తను కూడా మార్గదర్శక్ మండల్‌కు వెళ్లాల్సిందేనా..? లేక అదేదో హిమాలయ గుహలో పూర్తి తపస్విగా కాలం గడిపేస్తాడా..? అది ఒక చర్చ…
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి, తమ ఎఐసీసీ బాస్ 83 ఏళ్ల ఖర్గే పక్కన నిలబడి… వాటీజ్ దిస్, మోడీకి 75 ఏళ్లొచ్చాయి, ఐనా రిటైర్ కాడా అని భీకరంగా గర్జిస్తాడు… అక్కడే ఫాఫం 78 ఏళ్ల సోనియా నవ్వుతూ చప్పట్లు కొడుతుంది… సరే, ఇది వేరే చర్చ…
Ads
ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చెప్పినేట్టే… నిజంగానే మోడీ నిజంగానే కాడి కింద పడేస్తే… ఇప్పటికిప్పుడు దాన్ని మోసేంత కెపాసిటీ ఎవరికి ఉంది బీజేపీలో..? ఇదీ ప్రశ్నే… ఫాఫం అమిత్ షా లక్ష్మణుడే కానీ రాముడు కాలేడు కదా…
ఈమధ్యే ఓ వార్త కనిపించింది… యూపీ సీఎం యోగీ గ్రాడ్యుయేటే కానీ… ఈమధ్య విదేశాంగ, ఆర్థిక, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్సెట్రా కీలక జాతీయ వ్యవహారాలపై ఫుల్లు ట్రెయినింగ్ తీసుకుంటున్నాడట… అంటే, నేనే వారసుడిని అని చెప్పబోతున్నాడా..? ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా..?
ఇవన్నీ చదువుతుంటే మరో వార్త కనిపించింది… ఏమిటయ్యా అంటే… అజయ్, ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి అనే సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదట… ఎందుకయ్యా అంటే..? వెళ్లి ఉత్తరప్రదేశ్ సీఎం ఆఫీసు నుంచి ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తెచ్చుకొండి, లేకపోతే నో సెన్సార్ సర్టిఫికెట్ అన్నారట…
ఈ దేశ సెన్సార్ చరిత్రలోనే తొలిసారి, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎన్వోసీ అడగడం… ఓ నాన్సెన్స్, చెత్తా సెన్సార్ బోర్డు… ఆ సినిమా తీసిందే సీఎం యోగి బయోపిక్… తన పాజిటివ్ సైడ్ భజన… అది తీసిందే ది మాంక్ వూ బికేమ్ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా…
అది యోగీ భజనే కదా, యూపీ సీఎంవో కూడా ఎండార్స్ చేసింది కూడా… మరి అలాంటప్పుడు యూపీ సీఎంవో అభ్యంతరం పెట్టేది ఏముంటుంది..? ఏమీ ఉండదు… కానీ సీబీఎఫ్సీ ఓవరాక్షన్… ఎవరో యోగీ ఇమేజ్ బిల్డింగు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడం… ఎవరు వాళ్లు..? ఎందుకంటే, సీబీఎఫ్సీ కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తుంది కదా… ఈ పిచ్చి కారణంతో ఎందుకు అడ్డుకుంది..? పైగా ఆ పుస్తకం ఎనిమిదేళ్లుగా సర్క్యులేషన్‌లో ఉంది, ఎక్కడా ఏమీ వ్యతిరేకత రాలేదు…
అడ్డమైన బూతు, అశ్లీలం, హింస కంటెంటుకే కళ్లు మూసుకుని సంతకం పెట్టే బోర్డు యోగి బయోపిక్ ఎందుకు వద్దంటోంది…? సరే, అది వదిలేస్తే..? సదరు సినిమా ప్రొడక్షన్ కంపెనీ కోర్టుకు ఎక్కింది… తప్పదు కదా ఫాఫం… కోర్టు గమనించింది ఏమిటంటే..? సింపుల్‌గా సెన్సార్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు రాగానే నో అనేసిందట బోర్డు…
అంటే ఎవరో యోగికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డును బెదిరిస్తున్నారు… ఇదేందిర భయ్ అని బోర్డును కోర్టు అడిగితే అబ్బే, మేం సంభాషణలు, స్క్రిప్ట్ పరిశీలించాం కదా అన్నారట… ఓ చెత్తా సమర్థన… అందుకే నీ క్లారిఫికేషన్ ఇవ్వురా భయ్ అని సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది కోర్టు…
యూపీ సీఎం ఎన్వోసీ ఎందుకు ఇవ్వాలి..? ఒక సినిమాకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది..? పైగా సినిమా చూడకుండానే సెన్సార్ దరఖాస్తు రిజెక్షన్ ఏమిటి..? అభ్యంతరాలు ఉన్నచోట్ల కట్స్ చెప్పాలి గానీ మొత్తానికే తిరస్కరణ ఏమిటి..? అసలు సెన్సార్ బోర్డు వెనుక యోగీకి మీద కస్సుమంటున్న ఆ కేరక్టర్ ఎవరు..? ఎవరు..?
Share this Article