.
జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా బ్యాటర్, కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేశాడు… సరే, అది జింబాబ్వే వంటి జట్టు మీదైనా సరే, అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి మంచి రికార్డు…
కానీ ఆయన ఆ తొలి ఇన్నింగ్స్‌ను 625 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు… తమ దేశ జట్టు బ్యాటర్ హషీమ్ ఆమ్లా సాధించిన 311 పరుగులతో పోలిస్తే ఇది చాలా మెరుగైన రికార్డు… ఈ క్రమంలో తను దక్షిణాప్రికా తరఫున చాలా రికార్డులు బ్రేక్ చేశాడు…
Ads
టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ఆటగాళ్లు వీళ్లు…
300 రన్స్ చాలామంది చేశారు… మన సెహ్వాగ్ రెండుసార్లు… కరుణ్ నాయర్ కూడా 300 దాటాడు ఒకసారి ఇంగ్లండ్‌పై… కానీ 400 అనే చరిత్రాత్మక మైల్ స్టోన్ బ్రియాన్ లారా పేరిటే లిఖించబడి ఉంది… కానీ అది జరిగి 21 ఏళ్లు గడిచాయి… ఇప్పటికి బ్రేక్ చేయబడని రికార్డు…
ఐతే… 367 దాకా వచ్చావు కదా, 400 ట్రై చేయలేదా అనడిగితే మోస్ట్ హిపోక్రటిక్ సమాధానం వచ్చింది ముల్డర్ నుంచి… ఆ అద్భుత రికార్డు లారా పేరిటే ఉంటే బాగుంటుంది కాబట్టి 400 చేయలేదట… అదసలు సరైన క్రీడా స్పూర్తి కానే కాదు…
రికార్డులంటేనే బ్రేక్ కావాలి… ఎవరో ఒకరు చేధించాలి… అది పాత రికార్డు ఉన్న క్రికెటర్‌కు గౌరవమే… అన్నింటికీ మించి ఆటకు గౌరవం… అదే అసలైన స్పూర్తి… అయ్యో, నా రికార్డు బ్రేక్ అయ్యింది అని లారా బాధపడడు… ఎందుకంటే, ఇది ఆట… ఒకరినొకరు దాటేసి పరుగు తీయడమే రియల్ స్పిరిట్…
అదుగో అదీ ముల్డర్ నుంచి లోపించింది… పోనీ, లారాను దాటొద్దు సరే… మాథ్యూ హైడెన్ 380, మహేళ జయవర్ధనే 374 లను ఎందుకు దాటాలని ప్రయత్నించలేదు..? సో, ఇవన్నీ మాటలు వేస్ట్… ఒకే టెస్టులో అత్యధిక రన్స్ గ్రాహం గూచ్ పేరిట ఉన్నాయి…
- 1 Graham Gooch – 456 vs India (1990)2. Shubman Gill – 430 vs England (2025)3. Mark Taylor – 426 vs Pakistan (1998)
4. Kumar Sangakkara – 424 vs Bangladesh (2014)
5. Brian Lara – 400 vs England (2004)
6. Greg Chappell – 380 vs New Zealand (1974)
7. Matthew Hayden – 380 vs Zimbabwe (2003)
ఈ జాబితాలో సెకండ్ బ్యాటర్ శుభమన్ గిల్… ఔటయ్యాడు గానీ, ఖచ్చితంగా తను గ్రాహమ్ గూచ్ రికార్డును సవరించేవాడే.,. అదే అసలైన స్పిరిట్ కూడా… ఈ జాబితా పరిశీలించండి… ఆ ఏడుగురిలో ఈ ముల్డర్ పేరు లేదు… మరీ తెలుగు సినిమా హీరోల్లాగా అంత హిపోక్రటిక్ స్టేట్‌మెంట్లు దేనికి బ్రదర్ ముల్డర్…!!
Share this Article