నిజంగా ఓ ఇంట్రస్టింగు అంశమే… ముందుగా ఒరిజినల్ వార్త చదవండి ఓసారి… సంక్షిప్తంగా… ‘‘భర్త వీర్యంపై అతడి భార్యకే పూర్తి హక్కులు ఉంటాయని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది… ఇతరులు ఎవరైనా హక్కులు పొందాలంటే.. తప్పనిసరిగా ఆ భార్య అనుమతి పొందాల్సిందేనని తీర్పు చెప్పింది… కోల్కతా వ్యక్తికి 2015లో ఢిల్లీ మహిళతో వివాహమైంది… తనకు తలసేమియా వ్యాధి… 2018లో మరణించాడు… మరణానికి ముందే ఢిల్లీలోని ఓ స్పెరమ్ బ్యాంకులో తన వీర్యాన్ని భద్రపరిచాడు…. 2020 మార్చిలో ఆయన తండ్రి స్పెరమ్ బ్యాంకును కొడుకు వీర్యాన్ని ఇవ్వాలని అడిగాడు, వాళ్లు ఇవ్వంపో అన్నారు… తమ రూల్స్ ప్రకారం భార్యకే ఇస్తామన్నారు… భార్య నుంచి ఎన్ఓసీ తీసుకొస్తే వోకే అన్నారు… ఆమె ఇవ్వనుపో అన్నది… కథ కోర్టుకెక్కింది… తన కొడుకు వీర్యంపై భార్య అధికారం, హక్కులేమిటీ అనడిగాడు… నా వంశవృద్ధి కోసం ఆ వీర్యం తనకు కావాలీ అన్నాడు… నో, నో, నీకు ఆ హక్కు లేదు, భర్త వీర్యంపై భార్యకే హక్కులుంటయ్… చనిపోయేంతవరకూ ఆమెతోనే వివాహబంధంలో ఉన్నాడు కాబట్టి… ఆమె అనుమతిస్తే ఆ వీర్యం తీసుకో, లేకపోతే లేదు అని కోర్టు చెప్పింది…
భర్త వీర్యాన్ని ఇవ్వడానికి సదరు భార్య నిరాకరించడం వెనుక… ఆస్తుల వ్యవహారాలు ఏమైనా ఉండి ఉండవచ్చు… దానికి ప్రస్తుతానికి వెళ్లొద్దు మనం… ఆమెకు ఇష్టం లేదు… ఐతే నిజంగానే ఒక పురుషుడి మీద మహిళకున్న హక్కులు ఎంతవరకు..? భార్య అయినా సరే..! భర్త నుంచి సేకరించిన వీర్యం కూడా భర్త సంబంధ ఆస్తుల జాబితాలో వస్తుందా..? అదెలా..? ఒక మనిషి వీర్యాన్ని కూడా భౌతిక ఆస్తుల కింద పరిగణించాలా..? ఆస్తిగా పరిగణించినా సరే, ఆమె తనతో వైవాహిక బంధంలో ఉన్నది కాబట్టి దానిపై ఆమెకే హక్కులుంటాయా..? అదెలా..? భార్య మాత్రమే సోల్ ప్రొప్రయిటర్ ఎలా అవుతుంది..? మరి తండ్రికి తన వంశవృద్ది మీద ఉన్న ఎమోషనల్ భావనకు అర్థమే లేదా..? ఒక బ్యాంకు డిబెంచర్, డిపాజిట్, షేర్లకు రాసిచ్చినట్టే ఈ వీర్యానికీ తన భార్య పేరును నామినేట్ చేసి ఉంటాడు తను… అయితే అది అల్టిమేటా..? కాదు కదా…
Ads
చిన్న వయస్సులోనే భర్త మరణించాడు కాబట్టి, ఇదేదో ఊహించే ఆ దంపతులు వీర్యాన్ని నిల్వ చేసి ఉండవచ్చు కాబట్టి… ఒకవేళ ఆమె వేరే పెళ్లి చేసుకుంటే గనుక… తను వేరే వివాహబంధంలోకి వెళ్లిపోతున్నది కాబట్టి… ఇక పాత భర్త వీర్యంపై హక్కులు కోల్పోతుందా..? కలిగే ఉంటుందా..? అప్పుడు దానిపై లీగల్ రైట్స్ ఎవరికి దక్కుతాయి..? ఓ సంక్లిష్టమైన ప్రశ్న కదా… అసలు భర్త భౌతిక దేహం మీద, దైహిక భాగాల మీద భార్యకు మాత్రమే ఎందుకు హక్కు వస్తుంది..? రావాలి.,.? అప్పట్లో సుప్రీం కోర్టే వివాహేతర సంబంధాలను సమర్థించే తీర్పు వెలువరించింది… అంటే భర్త దేహం భార్యకు పూర్తి సొంతం కాదు అన్నట్టే కదా…. మరి వీర్యం మీద భార్యకు లీగల్ రైట్స్ ఎలా వస్తాయి..? సో, ఇన్ని ప్రశ్నలు… ఇన్ని లెక్కలు… ఇన్ని తర్కం, ఇంత మీమాంస… అందుకే ఇంట్రస్టింగు కేసు… ఆ తండ్రి పైకోర్టుకు వెళ్తే ఈ కేసు ఇంకాస్త ఇంట్రస్టింగుగా మారవచ్చునేమో…!!
Share this Article