Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం విజయ్ భార్య సంగీత గైర్హాజరు… సరైన నైతిక నిర్ణయం…

May 12, 2026 by M S R

.

ఆమె సంగీత సొర్ణలింగం… తమిళనాడు సీఎం విజయ్ భార్య… తనకు దూరంగా ఉంటోంది… విజయ్ రాజకీయ ప్రస్థానంలో అత్యున్నత ఘట్టం ఆవిష్కృతమైన ప్రమాణ స్వీకార సందర్భంలో ఆమె లేదు… పిల్లలూలేరు… ఇంకేం? సోషల్ మీడియాలో విమర్శలు… తప్పుపడుతోంది… మంచి అవకాశాన్ని కోల్పోయింది అంటూ… ప్రమాణ స్వీకారానికి రాకపోవడం తప్పు అంటూ… ఎందుకు తప్పు..? ఎందుకు నిందించాలి..?

విమర్శలు అత్యంత విడ్డూరంగా, అర్థరహితంగా ఉన్నాయి… ఒక స్త్రీ తన ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నప్పుడు, ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలను అర్థం చేసుకోకుండా “అవకాశాన్ని కోల్పోయారు” అనడం ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమే… (ఐనా తనను ఎవరు రమ్మన్నారు..? వచ్చి ఎక్కడో వెనుక వరుసల్లో అనామకురాలిగా కూర్చోవాలా..? త్రిష ముందు వరుసలో పట్టమహిషిలాగా కూర్చోవాలా..?)

Ads

సంగీత గనుక ప్రమాణస్వీకారానికి వచ్చి ఉంటే, “అధికారం రాగానే పరుగెత్తుకొచ్చింది, అంతా డబ్బు కోసమే” అని నిందించే సమాజమే ఇది… ఇప్పుడు రాకపోయినా విమర్శిస్తున్నారు… నిజానికి, ఆమె అధికారికంగా విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత, కేవలం ఒక వేడుక కోసం అక్కడ కనిపించడం ఆమె నిజాయితీకి విరుద్ధం… ఎన్నో ఏళ్లుగా మౌనంగా భరిస్తూ, ఇక లాభం లేదనుకున్నాకే కదా ఆమె విడాకుల బాట పట్టింది…

ప్రేమ, పెళ్లి – ఆనాటి మధుర స్మృతులు … విజయ్, సంగీతది ఒక అరుదైన ప్రేమకథ… లండన్‌లో సెటిల్ అయిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె సంగీత… విజయ్ నటనకు ముగ్ధురాలై, ఆయన్ని కలవడానికి చెన్నై వచ్చింది… ఆ పరిచయం ప్రేమగా మారి, 1999లో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది… దాదాపు రెండు దశాబ్దాల పాటు సంగీత విజయ్ వెన్నంటే ఉండి, ఆయన కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది… పెళ్లి నాటికి విజయ్ ఏమీ పాపులర్ స్టార్ ఏమీ కాదు కూడా…

విభేదాలకు కారణం: ‘త్రిష’ వ్యవహారం? … గత కొన్నేళ్లుగా విజయ్ వ్యక్తిగత జీవితంలో తుపాను మొదలైంది… ముఖ్యంగా త్రిషతో విజయ్ సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు కోలీవుడ్‌లో బలంగా వినిపించాయి… ‘లియో’ సినిమా సమయంలో ఈ పుకార్లు మరింత ముదిరాయి… కేవలం పుకార్లే కాకుండా, వారి మధ్య నెలకొన్న గ్యాప్ వల్ల సంగీత తీవ్ర మానసిక వేదనకు గురైంది… చివరకు సహనం నశించి, పరాయి స్త్రీతో సంబంధం, మానసిక వేధింపుల ప్రాతిపదికన ఆమె 2026 ప్రారంభంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది…

పిల్లలు – వారి చదువులు, నివాసం… ఈ వివాదాల మధ్య పిల్లలు తమ తండ్రికి దూరంగా, తల్లికే అండగా నిలుస్తున్నారు… తల్లిని అర్థం చేసుకున్నారు, తండ్రి మోసాన్ని అర్థం చేసుకున్నారు…

  • జోసెఫ్ జేసన్ సంజయ్…: విజయ్ కుమారుడు సంజయ్ నటన కంటే దర్శకత్వంపై ఆసక్తి చూపిస్తున్నాడు… లండన్, కెనడాలో సినిమా మేకింగ్ కోర్సులు పూర్తి చేశాడు… ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ సంస్థలో దర్శకుడిగా తన తొలి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు…

  • దివ్య సాష…: కుమార్తె సాష చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువు పూర్తి చేసి, ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం లండన్‌లో ఉంటోంది… ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా…

ప్రస్తుతం సంగీత తన పిల్లలతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివసిస్తోంది… విజయ్ రాజకీయంగా బిజీగా ఉన్నా, పిల్లలు మాత్రం తమ వ్యక్తిగత జీవితాలను, కెరీర్‌ను తల్లి పర్యవేక్షణలోనే నిర్మించుకుంటున్నారు…

ముఖ్యమంత్రి భార్యగా గౌరవం కంటే, ఒక స్వతంత్ర మహిళగా తన ఆత్మగౌరవమే ముఖ్యం అని సంగీత చాటిచెప్పింది… ముఖ్యమంత్రి పదవి అనేది ఒక రాజకీయ విజయం, కానీ కుటుంబం అనేది ఒక ఎమోషన్… ఆ ఎమోషన్ లేనప్పుడు, కేవలం ఫోటోల కోసం అక్కడ నిలబడకపోవడమే సంగీత తీసుకున్న నిజాయితీ కలిగిన నిర్ణయం… విమర్శించే వారికి ఏం చేసినా తప్పే కనిపిస్తుంది, కానీ ఒక స్త్రీగా ఆమె పడుతున్న వేదన ఆమెకు మాత్రమే తెలుసు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం విజయ్ భార్య సంగీత గైర్హాజరు… సరైన నైతిక నిర్ణయం…
  • దేవుడి దగ్గర కూడా రాజస పోకడలే..! సుధారెడ్డి ఆడంబర ప్రదర్శన..!!
  • రెండుగా చీలనున్న రెండాకులు..! అన్నాడీఎంకేలో ముసలం..!!
  • ఎంత అంబానీ అయితేనేం..? అడ్డంగా చేతులెత్తేసిన ‘స్టార్ కలెక్షన్’..!
  • ‘అన్‌ఫాలో’ కంట్రవర్సీ..! అంబానీ జట్టుతో హార్దిక్ పాండ్యా కటీఫ్..!?
  • తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచబడును… ఆల్వేస్ వెల్‌కమ్…
  • ట్యాగర్లకు రష్మి గౌతమ్ జవాబు… నన్ను కాదు, ప్రభుత్వాన్ని అడగండి…
  • అసలు చక్రం తిప్పిన స్టాలిన్ సర్… మీకు మెనీ మెనీ థాంక్స్…
  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions