.
ప్రపంచ అత్యంత ధనికుడు, ప్రయోగాల సాహసి (500 బిలియన్ డాలర్లు) ఎలన్ మస్క్ చేసిన ఓ ప్రకటన ఇండియన్లకు బాగా నచ్చింది… ఎందుకంటే, భారతీయ మూలాలున్న మహిళను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి… ఒక కొడుకు పేరులో ‘శేఖర్’ అనే పదాన్ని కూడా ఇరికించాడు కాబట్టి..!
కానీ, మరీ అంత ఆనందపడాల్సినంత విషయమేమీ కాదంటారు విశ్లేషకులు… ఎందుకో ఓసారి చూద్దాం…
మస్క్ నిజానికి అమెరికాలో పుట్టలేదు… దక్షిణాఫ్రికా ప్రిటోరియాలో పుట్టాడు… కెనడాకు వలసపోయాడు… (తల్లిదండ్రులది బ్రిటిష్, డచ్ జాతీయతలు… వాళ్లు విడాకులు తీసుకున్నారు మస్క్ చిన్నగా ఉన్నప్పుడే)… అక్కడి నుంచి అమెరికాకు వచ్చాడు… సరే, తన వ్యాపార విజయాలు గట్రా కాసేపు పక్కనపెడితే… తన వ్యక్తిగత జీవితం కాస్త వివాదాస్పదమే…
Ads
మొదటి భార్య (రచయిత్రి జస్టిన్ విల్సన్) కు ఆరుగురు పిల్లలు… ఒకరు శిశువుగానే మరణిస్తే, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నారు… ఓసారి కవలలు, మరోసారి ట్రిప్లెట్స్… ఆమెకు విడాకులు ఇచ్చాక మరో నటి (తలూలా రిలే)ని పెళ్లి చేసుకున్నాడు… విడాకులు ఇచ్చాడు, మరుసటి సంవత్సరమే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు… ముగ్గురు పిల్లలు…
ఇద్దరు ముగ్గురితో డేటింగులు… అధికారికంగా తనకు 14 మంది పిల్లలేనేమో గానీ, అసలు సంఖ్య చాలా ఎక్కువ అని అమెరికన్ మీడియా రాస్తూ ఉంటుంది… గ్రిమ్స్ అనే కెనడా మ్యూజిషియన్‌తో ముగ్గురు పిల్లలట… అందులో ఒకరు సరోగసీ ద్వారా… ప్రస్తుత అధికారిక భార్య పేరు శివోన్ జలిస్… (39 ఏళ్లు- మస్క్‌కు 59 ఏళ్లు)…
ఈ శివోన్ ఎవరంటే..? ఒక పంజాబీ హిందూ తల్లికి, మరో కెనెడియన్ తండ్రికీ కెనడాలోనే పుట్టిన బిడ్డ… సో, శివోన్‌కు భారతీయ మూలాలున్నాయి అనేది నిజం… అందుకే అప్పుడప్పుడూ కెనడియన్‌లా తెల్లగా ఉంటాను, ఇండియన్ పెద్ద కళ్లుంటాయి అని చెప్పుకుంటూ ఉంటుంది శివోన్… (శివోన్ అనే పేరును తన బిడ్డకు తన హిందూ మూలాల గుర్తుగా పెట్టుకుంది ఆ తల్లి)…
ఆమె పుట్టాక ఎవరికో దత్తత ఇవ్వబడింది… ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వెంచర్ క్యాపిటల్ (Venture Capital) రంగంలో నిపుణురాలు… ఆమె ప్రస్తుతం మస్క్ సహ-స్థాపక సంస్థ న్యూరాలింక్‌లో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్గా పనిచేస్తోంది…
వీళ్లకు నలుగురు పిల్లలు… అందులో ఫస్ట్ ఇద్దరు ట్విన్స్… మూడో కొడుకు పేరు సెల్డన్ లైకర్గస్ (Seldon Lycurgus)… తన మధ్య పేరు శేఖర్… ఆ పేరు ఎందుకంటే..? (మస్క్ సంతానంలో ఐవీఎఫ్ ఉంది, సరోగసీ ఉంది, ట్విన్స్ ఉన్నారు, ఒక ట్రిప్లెట్ కూడా…)
భారతీయ మూలాలున్న గొప్ప శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (Subrahmanyan Chandrasekhar) గౌరవార్థం పెట్టామని మస్క్ వివరించాడు రీసెంట్ ఇంటర్వ్యూలో..! చంద్రశేఖర్ నక్షత్రాలు ఎలా చనిపోతాయో, బ్లాక్ హోల్స్ (Black Holes) ఎలా ఏర్పడతాయో కనిపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత… గొప్ప సైంటిస్టు పేరును ఎంచుకోవడం మస్క్ ఇష్టమా, శివోన్ ఇష్టమా తెలియదు…
సో, ఇటు మస్క్, అటు శివోన్… ఇద్దరిదీ మిశ్రమ వారసత్వం… తమ జాతీయతల పట్ల అవ్యాజ ఉద్వేగం ఉండవచ్చుగాక… కానీ వాళ్లు ఫక్తు అమెరికన్లు… అమెరికా కోణం నుంచే ఆలోచిస్తారు, బతుకుతారు… అది రియాలిటీ..!!
Share this Article