.
మాజీ సినిమా నటి మాధవీలత… (ఒవైసీ మీద పోటీచేసిన బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత వేరు)… మనం చెప్పుకునేది గతంలో సినిమాల్లో నటించిన నటి మాధవీలత… నిజానికి ఆమెకూ బీజేపీకి ప్రస్తుతం ఏ సంబంధమూ లేదు నాకు తెలిసి…
తరచూ కొన్ని వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తుంటుంది… కాకపోతే సాహసి… తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రెయిటుగా, ధైర్యంగా, కేసులకు కూడా భయపడకుండా చెప్పేస్తుంది… సనాతని..!! తాజాగా ఏదో ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ పేరుతో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించింది… అంటే ‘పెళ్లాల మార్పిడి’…
Ads
ఇంకేం, దాని మీద సోషల్ మీడియాలో చర్చలు, పోస్టులు, ప్రచారాలు… వైఫ్ స్వాపింగ్ వంటి కార్యకలాపాలు నగరానికి దూరంగా ఉన్న గెస్ట్‌హౌస్‌లలో మాత్రమే కాకుండా, ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతాల్లోని ఫ్లాట్లు, ఇళ్లలో కూడా జరుగుతున్నాయని ఆమె వివరణ… కొంతమంది తమ నివాస ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా మరో ఫ్లాట్ లేదా ఇంటిని తీసుకుని, వాటిని ఇలాంటి ప్రైవేట్ పార్టీల కోసం ఉపయోగిస్తున్నారనే ప్రచారం ఉందట…
ఈ సంస్కృతి కొత్తగా మొదలైంది కాదని, దాదాపు 15 ఏళ్లుగా ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయని చెబుతోంది… నగర జీవనశైలిలో వస్తున్న మార్పులు, వినోదం పేరుతో కొత్త అనుభవాలను కోరుకునే ధోరణి కారణంగా కొందరు ఇలాంటి కార్యకలాపాల వైపు వెళ్తున్నారని ఆమె విశ్లేషణ… బెంగళూరులో నైట్‌లైఫ్, ప్రైవేట్ పార్టీలపై నిఘా పెట్టినట్లుగానే హైదరాబాద్‌లో కూడా అనుమానాస్పద ప్రైవేట్ పార్టీలపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని మాధవీలత సూచన…
నిజానికి వైఫ్ స్వాపింగ్ అనేది కొత్త విషయమేమీ కాదు… ఎప్పటి నుంచో ఉన్నదే, బయటికి హైఫై సర్కిళ్లుగా చెప్పబడే సమూహాల్లో జరుగుతున్నట్టు ప్రచారం సాగేది… చాలా కాన్ఫిడెన్షియల్ పార్టీలు కాబట్టి బయటికి రావు ఈ వ్యవహారాలు… గ్రూపులోని కుటుంబాలు అందరూ ఓచోట చేరి, కారు తాళాల్ని కుప్పగా పోస్తారు… లాటరీ… ఎవరికి ఏ కారు కీ వస్తుందో సదరు ఓనర్‌తో ఆ రాత్రి గడపడం… ఓ కొత్త అనుభవం…
ఎప్పుడైతే డ్రగ్స్ వినియోగం పెరిగిందో, అరచేతిలో స్మార్ట్‌ఫోన్ బూతు… కొత్త అనుభవాల కోసం వెంపర్లాట… దాంతో ఈ ధోరణి ఇంకా పెరిగిందట… కో-లివింగ్ హాస్టళ్లు, పెరుగుతున్న అక్రమ సంబంధాలు… హైటెక్ వ్యభిచారం… -యో వంటి కొన్ని హోటళ్ల రూమ్స్ ఫక్తు ఇలాంటి యవ్వారాలకే… ఇవేమీ చట్టరీత్యా నేరాలు కావు, మేజర్ల లైంగిక వాంఛ, సంబంధం పరస్పర సమ్మతి ఉంటే చట్టవిరుద్ధం కాదని కోర్టులూ చెబుతున్నాయి… ఇంకేముంది..? వీటిని అనైతికతగా కూడా వాళ్లు భావించరు…
అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని పిల్లలను, మొగుళ్లను కడతేరుస్తున్న రోజుల్లోకి వచ్చేశాం కదా… ఇంకా లోతుల్లోకి వెళ్తే వైఫ్ స్వాపింగ్ చాలాకాలం క్రితమూ ఉన్నదే… రవికల పండుగ ఉద్దేశం అదే కదా… లేటు పెళ్లిళ్లు, కుటుంబాలకు దూరంగా ఉండటం, చేతిలో కావల్సినంత డబ్బు, అందుబాటులో అనేక ప్రలోభాలు, వ్యసనాలు… పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు ఇది…
మాధవీలత చెబుతున్నట్టు నైట్ లైఫ్, లేట్ నైట్ ప్రైవేటు పార్టీలపై నిఘా ప్రతిచోటా సాధ్యం కాదు, సొసైటీయే ‘లైంగిక విశృంఖలత’ వైపు- లైంగిక స్వేచ్ఛ వైపు వెళ్తున్నప్పుడు ఎవరూ ఏదీ ఆపలేరు..!!
Share this Article