.
చాన్నాళ్ల తరువాత ఎస్వీ కృష్ణారెడ్డి ఓ సినిమా చేస్తున్నాడు… గుడ్… అప్పట్లో కొన్ని హిట్ సినిమాలు చేశాడు, ఎందుకు కంటిన్యూ చేయలేకపోయాడో తెలియదు గానీ…
జనగామ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మాతగా ఇప్పుడు వేదవ్యాస్ అనే సినిమా స్టార్ట్ చేశారు… కొమ్మూరి వ్యాపారి, కాలేజీలు, రియల్ ఎస్టేట్… తను ఫిలిమ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడని ఎవరూ ఊహించలేదు…
Ads
సరే, మారిపోయిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీస్తే మళ్లీ ఎస్వీ కృష్ణారెడ్డి సక్సెస్ కావచ్చు, కానీ..? ఏమో చెప్పలేం..!
ఆశ్చర్యంగా అనిపించింది ఏమిటంటే..? ఈ సినిమాకు ఏకంగా కొరియా నుంచి ఓ హీరోయిన్‌ను పట్టుకొచ్చారు… పేరు జున్ హ్యూన్ జి… గతంలో కూడా ఒకరిద్దరు ఫారిన్ అమ్మాయిలను తీసుకొచ్చారు… ఎవరూ నిలబడలేదు, వాళ్లు ఆయా సినిమాలకు ప్లస్ కూడా కాలేదు… సో, కొరియన్ నటిని పట్టుకురావడం పెద్ద విశేషమేమీ కాదు… అది స్ట్రయికింగ్ పాయింట్ అయితే కాదు…
మరెందుకు కొరియన్ హీరోయిన్..? కథ డిమాండ్ చేస్తే వోకే, కానీ ఎందుకో కృష్ణారెడ్డి చెప్పలేదు… విలన్‌ను మంగోలియా నుంచి తెస్తారట… ఎందుకు..? తెలియదు..? పేరు తెలియదు… కేవలం ఈ రెండు పాయింట్లూ జనాన్ని థియేటర్ల దాకా రప్పించే ‘విశేషాలు’ మాత్రం కాదు…
కొంపదీసి సదరు కొరియన్ నటితో స్టెప్పులు వేయించరు కదా… ‘భారతీయ సంస్కృతిని నేర్చుకుని ఈ సినిమా చేస్తుండటం హేపీగా ఉంది’ అంటోంది ఆమె… అంటే..? ఏమిటో మరి..! ఈ సినిమాలో అసలు హీరో ఎవరో కూడా తెలియదు… త్వరలో చెబుతారట… అన్నట్టు ఈ సినిమాయే కాదు, వరుసగా ఇక కొమ్మూరి ప్రతాపరెడ్డికే సినిమాలు చేస్తాడట ఎస్వీ కృష్ణారెడ్డి…
వాస్తవం ఏమిటంటే.., కొరియా నుంచి హీరోయిన్, మంగోలియా నుంచి విలన్ మాత్రమే కాదు… వియత్నాం, ఫిలిప్పీన్స్‌ల నుంచి కమెడియన్లను, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కేరక్టర్ ఆర్టిస్టులను, చివరకు సోమాలియా నుంచి హీరోను దిగుమతి చేసినా సరే… కథకు వాళ్లు నప్పాలి… కేవలం విదేశీ మొహాలు సినిమాను డ్రైవ్ చేయలేవు…!!
ఇదే కృష్ణారెడ్డి యమలీల2 సినిమా కోసం దియా నికోలస్ అనే దక్షిణాఫ్రికా నటిని పట్టుకొచ్చాడు… ఆమె ఎందుకు కావల్సి వచ్చిందో తనకైనా తెలుసోలేదో ఇప్పటికీ..!!
Share this Article