Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హైదరాబాద్ రెండో రాజధాని..? ఎంపీ సీట్ల డీలిమిటేషన్‌పై సౌతిండియా ఆందోళన..!!

May 30, 2023 by M S R

నిజానికి ఇది పెద్ద సబ్జెక్టు… జరగాల్సినంత చర్చ కూడా జరగడం లేదు… జాతీయ పార్టీలు ఎలాగూ మాట్లాడవు… సౌతిండియాలోని ప్రాంతీయ పార్టీలకు ఇంకా జ్ఞానబుగ్గలు వెలిగినట్టు లేదు… ఇది సీరియస్ సబ్జెక్టే… కాస్త వివరాల్లోకి వెళ్తే… ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీ సీట్ల డీలిమిటేషన్ 2026లో జరగనున్నట్టు ఢిల్లీ సర్కిళ్లలో ఓ ప్రచారం సాగుతోంది…

కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత పోకడ చూడబోతే ఇప్పట్లో జనగణన జరిగేట్టు లేదు… నిజానికి సెన్సెస్ జరిగితేనే, ఆ జనాభా వివరాలను బట్టి ఎంపీ సీట్ల పునర్వ్యవస్థీకరణ జరిగితేనే అది శాస్త్రీయం… ఐనాసరే 2026 డీలిమిటేషన్ జరుగుతుందీ అంటే పాత 2011 జనాభా లెక్కలను బట్టి చేస్తారా..? అదే జరిగితే అది అశాస్త్రీయం, లోెపభూయిష్టం అవుతుంది…

వాస్తవానికి జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్… ఈ కోణంలో ప్రగతి చూపని బీమార్ రాష్ట్రాలను నిధుల పంపిణీ విషయంలో డిస్కరేజ్ చేయాల్సి ఉండింది… కానీ వెనుకబడిన రాష్ట్రాలు పేరిట ఆ రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, మెరుగైన ప్రగతి సూచికల్ని కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారు… ఇప్పుడు జరగబోయే అన్యాయం మరింత పెద్దది…

Ads

గతంలో ఎంపీ సీట్ల డీలిమిటేషన్ జరిగినప్పటికీ ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలతో పోలిస్తే… తూర్పు, ఈశాన్య, ఉత్తర రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలా ఎక్కువ… దీంతో జనాభాను బట్టి ఎంపీ సీట్ల డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి సహజంగానే దక్షిణ రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు, ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు అదనంగా రాబోతున్నయ్… తద్వారా పార్లమెంటులో, అంటే దేశంలో దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం ఘోరంగా పడిపోనుంది… ఎలా అంటే, ఇదుగో ఉదాహరణ…


State: Current Seats / Increased Seats

RJ: 25 / 50
Bihar: 40 / 79
UP: 80 / 175
Kerala: 20 / 20

రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు డబుల్ కాబోతుండగా, యూపీలో సీట్ల సంఖ్య డబుల్‌కన్నా ఎక్కువ కాబోతున్నయ్… అంటే వాళ్లు చెప్పిందే పార్లమెంటులో చెల్లుబాటు… వాళ్లకే విలువ… ఉత్తరాదిపై ఎవరు ఎక్కువ పట్టు చూపిస్తే ఆ పార్టీకే అధికారం… అంటే రఫ్‌గా చెప్పాలంటే బీజేపికి ప్రయోజనకరం… దానికి దక్షిణాది అస్సలు కొరుకుడు పడటం లేదు… సో, దక్షిణాదిని పక్కన పెట్టేసినా, మిగతా దేశంలో సాధించే సీట్లతో అధికారం కైవసం చేసుకోవాలి… అంటే, దక్షిణాదిలో సీట్లు పెద్దగా పెరగకూడదు, మిగతా ప్రాంతాల్లో పెరగాలి… జరగబోతున్నదీ అదే…


సపోజ్, ఇప్పుడున్న 543 లోకసభ స్థానాల సంఖ్య 848 సంఖ్యకు పెరుగుతుందీ అనుకుందాం… దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం సీట్లు 165 కాబోతున్నాయి, జస్ట్, యూపీ, బీహార్ రాష్ట్రాల్లోనే 222 సీట్లకు ఈ సంఖ్య పెరగనుంది… మిగతా స్టేట్సన్నీ కలిపి 461… (కొత్త పార్లమెంటు భవనంలో సీట్ల సంఖ్య 888…) అంటే డీలిమిటేషన్‌ను దృష్టిలో పెట్టుకునే సీట్ల సంఖ్య బాగా పెంచేశారు… అది అవసరమే… కానీ డీలిమిటేషన్‌కు కేవలం జనాభా మాత్రమే గాకుండా ఇంకేమైనా ప్రాతిపదికల్ని కూడా జతచేస్తారా..? ఇదీ ప్రస్తుతం చర్చనీయాంశం… కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం జనాభా నియంత్రణలో మంచి ప్రగతి చూపించిన పాపానికి దక్షిణ రాష్ట్రాలు నష్టపోబోతున్నాయన్నమాట…
నిజానికి ఇప్పుడు లోకసభ సీట్లే అశాస్త్రీయంగా ఉన్నయ్… అడ్డదిడ్డంగా చేసేశారు గతంలో… ఉదాహరణకు దిగువ టేబుల్ చూడండి… కేరళలో 1.75 మిలియన్లకు ఒక ఎంపీ ఉంటే, హర్యానాలో 3 మిలియన్లకు ఒక ఎంపీ ఉన్నాడు… సేమ్ గుజరాత్‌లో 2.69 మిలియన్లకు ఒక ఎంపీ… రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దీన్ని హేతుబద్ధం చేసి, కాస్త రీజనబుల్ సగటు సంఖ్యను సాధిస్తారా..? అలాగైతే కేరళకు ఇప్పుడున్న ఎంపీ సీట్లు ఎక్కువేనని అనుకోవాలా..? ఇతర రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల రీజనబులే అనుకొమ్మని చెబుతుందా కేంద్రం..?
కేవలం దక్షిణ రాష్ట్రాలనే తీసుకుంటే… కేరళలో సగటున 1.67 మిలియన్లకు ఒక ఎంపీ ఉండగా… కర్నాటకలో 2.4 మిలియన్లు, తెలంగాణలో 2.3 మిలియన్లకు ఒక ఎంపీ ఉన్నట్టు లెక్క… అంటే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయానికి గురయినట్టే కదా… అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ సీట్ల పెంపు కూడా బిల్లులో రాసి ఉంది… ఈరోజుకూ దానికి దిక్కులేదు… రెండు రాష్ట్రాలూ అడిగీ అడిగీ ఇక మానేశాయి… అఫ్ కోర్స్, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన ఫాయిదా ఏమీ లేదు.., అది వేరే కథ…
ఇంకొందరి అంచనాల మేరకు… 2026 డీలిమిటేషన్‌లో 888 లోకసభ సీట్లను, 384 రాజ్యసభ సీట్లను ఏర్పాటు చేయబోతున్నారని వినిపిస్తోంది… ఈ దిగువన ఉన్న టేబుల్ చూడండి… ఇప్పుడున్న రాజ్యసభ సీట్లు 245 మాత్రమే… పార్లమెంటుపై నిజమైన పెత్తనాన్ని ఇచ్చే లోకసభ సీట్ల లెక్కల్నే ఓసారి పరిశీలిస్తే… ఈశాన్య రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ఓ మోస్తరుగా అస్సోంలో పెరుగుతుంది… తూర్పు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య దాదాపు యాభై శాతం వరకూ పెరగొచ్చు… ఉత్తర రాష్ట్రాలలో యూపీలో 80 నుంచి 134, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో డబుల్ అవుతాయి…
పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 70 నుంచి 80 శాతం వరకూ పెరుగుతాయి… ఇక దక్షిణాదిలో 131 నుంచి 172 వరకు పెరగొచ్చునని అంచనా… అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ పెరుగుదల… (లక్ష ద్వీప్ మొత్తం ఎగిరిపోతుంది…) ఇది దక్షిణాదిలో యాంటీ-బీజేపీ వాతావరణాన్ని ఇంకా పెంచడం ఖాయం… ఈ అన్యాయంపై రాజకీయ పక్షాలు ఆందోళనలకు దిగొచ్చు…
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కువ సీట్లు రాబట్టలేకపోతే… బీజేపీ దక్షిణాదిన చెలరేగే ఉద్యమాల్ని చల్లార్చడానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించవచ్చుననే ఊహాగానాలు ఇప్పటికే సాగుతున్నయ్… ఎన్నికలకు ముందే ప్రకటిస్తే, ఇప్పటికే జనం వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్‌కు బీజేపీయే చేజేతులా అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది… ఓ ఎమోషనల్ ఫ్యాక్టర్‌ను బీఆర్ఎస్‌కు తనే అందించినట్టవుతుంది… అందుకని ఎన్నికలయ్యేవరకు బీజేపీ ఏమీ మాట్లాడదు…
తెలంగాణలో అధికారం గనుక రాకపోతే హైదరాబాద్‌‌ను గనుక రెండో రాజధానిగా చేస్తే, తెలంగాణ జీవగర్రను చేజిక్కించుకున్నట్టవుతుంది… కానీ హైదరాబాద్‌లో గనుక రాష్ట్రపతి పాలన పెడితే మళ్లీ తెలంగాణ అగ్నిగుండం అవుతుంది… సో, తెలంగాణ నుంచి దేశ రెండో రాజధానిని విడదీయడం అంత వీజీ కాదు… ఇలా రకరకాల చర్చలు ఆల్‌రెడీ స్టార్టయ్యాయ్… ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది చాలా చాలా తక్కువ… చాలా పెద్ద సబ్జెక్టు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions