.
మూడోసారీ బరిలో ఉంటా… ఇదీ ట్రంప్ మాట… ఇప్పుడప్పుడే శని ఈ ప్రపంచాన్ని వదిలే ఆలోచనలో లేదు… ఇప్పటికే ప్రపంచ దేశాలను కుదుపుతున్నాడు, తన చేష్టలతో… అంతకుమించిన తన వాచాలత్వంతో…
ఐతే ఇది సాధ్యమేనా..? ఈ మూడేళ్లలో శని ప్రపంచాన్ని శని వదలదా… ఇది ఏడున్నరేళ్ల శనేనా..? (సాడే సాత్)… అసలు అమెరికా రాజ్యాంగం మూడోసారి బరిలో ఉండటానికి అనుమతిస్తుందా..?
Ads
అమెరికా అధ్యక్షుడు మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం సాధ్యం కాదు… ఎందుకంటే, అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ (Twenty-second Amendment) ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది…
ఈ నియమం గురించి ముఖ్య వివరాలు…
- 22వ సవరణ…: ఈ సవరణ 1951లో ఆమోదించబడింది…. దీని ప్రకారం, ఒక వ్యక్తి రెండు పర్యాయాలు (ప్రతి పర్యాయం నాలుగు సంవత్సరాలు) మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు…
- పూర్వ సంప్రదాయం…: 1933 నుండి 1945 వరకు నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ మినహా, జార్జ్ వాషింగ్టన్ కాలం నుండి అధ్యక్షులు రెండు పదవీకాలాల సంప్రదాయాన్ని పాటించారు… రూజ్‌వెల్ట్ ఉదాహరణ తర్వాత, అధ్యక్ష పదవీకాలాలకు పరిమితిని రాజ్యాంగబద్ధంగా నిర్ధారించారు…

ఏవైనా లొసుగులు ఉన్నాయా?
మళ్లీ బరిలో ఉండటానికి మార్గాలున్నాయని అంటున్నాడు… కానీ రాజ్యాంగ నిపుణులు 22వ సవరణ చాలా స్పష్టంగా ఉందని చెబుతున్నారు… అయితే, కొంతమంది మద్దతుదారులు కొన్ని “సృజనాత్మక” మార్గాలను సూచిస్తున్నారు, అవి….
- ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి, ఆ తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టడం…: ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉపాధ్యక్షుడిగా ఎన్నికై, ఆ తర్వాత అధ్యక్షుడు రాజీనామా చేసినా లేదా మరణించినా అధ్యక్ష పదవిని చేపట్టవచ్చు… అయితే, దీనిపై కూడా చట్టపరమైన అడ్డంకులు, రాజ్యాంగపరమైన చర్చలు ఉన్నాయి… ఈ మార్గాన్ని ట్రంపే కొట్టి పారేస్తున్నాడు… జనం ఇష్టపడరని అంటున్నాడు…,
- రాజ్యాంగ సవరణను రద్దు చేయడం…: అధ్యక్షుడిగా ఎన్నిసార్లైనా పోటీ చేయడానికి వీలు కల్పించేలా 22వ సవరణను రద్దు చేయడం లేదా సవరించడం మరొక సిద్ధాంతం… కానీ, దీనికి కాంగ్రెస్, 38 రాష్ట్రాల ఆమోదం అవసరం, ఇది చాలా కష్టమైన మరియు అరుదైన ప్రక్రియ… సో, అదయ్యే పనికాదు… ఇప్పటికే ట్రంపు పట్ల అమెరికన్లలో వ్యతిరేకత బాగా పెరుగుతోంది…
- వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదా మరో నేత మార్కో రుబియో అధ్యక్ష పోటీకి సమర్థులని ట్రంపు అభిప్రాయపడ్డాడు… సరే, అప్పటికి ఎవరి పరిస్థితి ఏమిటో కాలం చెబుతుంది…
మోడీ భాయ్, వింటివా... ఫిర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్... అట..!!
Share this Article