.
మన తాజా జర్నలిజం ఎలా తగలడింది అని ప్రశ్న వేయండి… నిన్నటి అయనాంతం ఎపిసోడ్‌లాగా వెలిగిపోయింది అనేదే సమాధానం…
అర్థం కాలేదా…? కొన్నాళ్లుగా సైట్లు, ట్యూబర్లు తెగ రాసేస్తున్నాయి… డిసెంబరు 21… అదుగో, 16 గంటలపాటు రాత్రి… జస్ట్, 8 గంటలే పగలు… అద్భుతమైన భౌగోళిక విశేషం… అరుదైన సందర్భం అన్నట్టుగా కూశాయి, రాశాయి… చివరకు ప్రధాన మీడియా బాపతు సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ కూడా కళ్లు మూసుకుని ఇదే రాశాయి…
Ads
హహహ… ఏమైంది…? వర్తమాన డిజిటల్ జర్నలిజం ఎంత డొల్లో స్పష్టంగా తేలిపోయింది… ఏమీ లేదు, ఎవడికీ తేడా తెలియరాలేదు… అదే పగలు, అదే రాత్రి… ఉదయమే తెల్లారింది… సాయంత్రానికి చీకటిపడింది…
మరెందుకు రాశారివన్నీ… ఏదో ఒకటి… లోతుగా తెలుసుకునే పనిలేదు, నిజమో కాదో ముందుగా తాము అర్థం చేసుకోవాలనే సోయీ అక్కర్లేదు… కనీసం ఇలాంటి విషయాల్లో కాస్త బుర్ర పెట్టి ఆలోచించేవాళ్లు దొరికితే మాట్లాడింపజేద్దామనే ఆలోచన అసలుకే లేదు…
సగటు తెలుగు స్టార్ హీరోలకున్నట్టే… మనకన్నా జ్ఞానవంతులు ఎవరున్నారు బ్రదర్ అనే పోకడ… అయనాంతం కరెక్టే, కానీ అది మన దేశానికి ఎంతమేరకు వర్తిస్తుందనే బేసిక్ నిజం తెలుసుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు… అంతా అయిపోయాక కొన్ని వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో మాత్రం ఈ వివరణ కనిపించింది… బెటర్…
‘‘కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న వార్త ఇది! డిసెంబర్ 21 న “16 గంటలపాటు రాత్రి” సంభవించబోతుంది అని. ఇది నిజమేనా?
ఇది నిజమే కానీ, మనదేశంలో కాదు!
డిసెంబర్ 21 నాడు భూమికి, సూర్యుడికి మధ్య దూరం ఎక్కువగా ఉండడం వలన జరిగే అయనాంతమును “శీతాకాల అయనాంతం” అని అంటారు. ఆ సమయంలో భూమిపైన రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది.
అసలు విషయం ఏమిటంటే, ఈ ప్రభావం ఉత్తరార్ధ గోళం మీద, అంటే, ఆర్కిటిక్ ప్రాంతం & నార్వే, స్వీడన్ లాంటి దేశాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అయనాంతాల కారణంగా ఇక్కడ సంవత్సరంలో 4 నెలలకు పైగా రోజంతా పగలు “మాత్రమే” ఉంటే, 4 నెలల పైన రోజంతా చీకటిరాత్రి “మాత్రమే” ఉంటుంది.
ఈ పరిస్థితి ఆర్కిటిక్ ప్రాంతానికి దగ్గర ఉంటుంది. భూమధ్యరేఖకు వచ్చేసరికి పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.
ఈ 16 గంటల రాత్రి కాలం కర్కాటకరేఖకు పైన, ఆర్కిటిక్ ప్రాంతానికి క్రింద ఉండే దేశాల్లో ఉంటుంది. మనదేశంలో అంతగా ఉండదు. ఈ విషయం తెలుసుకోకుండా, మన YouTube channels ఓ తెగ ఊదరగొట్టేస్తున్నాయి. వాళ్లకు views కావాలి, అంతే!
మనదేశం మీదుగా “కర్కాటక రేఖ” వెళ్తున్న కారణంగా మనకూ శీతాకాల అయనాంతం ప్రభావం కొంతవరకు ఉంటుంది. ఈ YouTube channels చెప్పిన విధంగా మరీ “16 గంటలు రాత్రి” ఉండదు కానీ, మామూలు రోజుల్లో కంటే, కాస్త ఎక్కువ గంటలు రాత్రి ఉంటుంది!
Share this Article