.
ముందుగా ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా శివలింగం గురించి చెప్పుకుందాం… బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా… అక్కడ ఈ శివలింగం ప్రతిష్ఠాపన జరగబోతోంది… అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ మందిర్ ప్రాంగణంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు… ఇది కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ కంటే రెట్టింపు పరిమాణంలో ఉండే భారీ ఆలయ సముదాయం… అయోధ్య బాలరాముడికన్నా మూడు రెట్లు పెద్ద…
శివలింగం విశేషాలు…:
Ads
-
పరిమాణం..: ఈ శివలింగం 33 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు (చుట్టుకొలత) కలిగి ఉంటుంది…
-
బరువు..: దీని మొత్తం బరువు సుమారు 210 టన్నులు…
-
తయారీ..: తమిళనాడులోని మహాబలిపురంలో ఒకే ఒక నల్ల గ్రానైట్ శిల నుండి నిపుణులైన శిల్పులు దీనిని చెక్కారు… దీని తయారీకి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది…
-
సహస్రలింగం…: ఈ భారీ శివలింగంపైనే 1008 చిన్న శివలింగాలు చెక్కబడి ఉంటాయి… దీనిని దర్శించుకుంటే 1008 శివలింగాలను పూజించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం…

ప్రయాణం – ప్రతిష్ఠాపన
ఈ భారీ శివలింగాన్ని మహాబలిపురం నుండి బీహార్‌కు చేర్చడం ఒక పెద్ద సాహసంగా మారింది…
-
రవాణా…: 210 టన్నుల బరువును మోయడానికి 96 చక్రాల భారీ హైడ్రాలిక్ ట్రక్కును ఉపయోగించారు…
-
ప్రయాణ మార్గం…: ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా దాదాపు 2,500 కిలోమీటర్లు ప్రయాణించి బీహార్ చేరుకుంది…
-
ప్రతిష్ఠాపన..: ప్రస్తుత సమాచారం ప్రకారం, 2026, జనవరి 17న ఈ శివలింగాన్ని కైత్ వాలియాలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించబోతున్నారు… ఈ వేడుక కోసం ఐదు పవిత్ర నదుల (గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్రాజ్ మొదలైనవి) నుండి నీటిని తీసుకువస్తున్నారు…
విరాట్ రామాయణ్ మందిర్ గురించి చెప్పుకుందాం…
-
ఈ ఆలయ సముదాయంలో మొత్తం 22 దేవాలయాలు, 18 గోపురాలు ఉంటాయి…
-
ప్రధాన గోపురం ఎత్తు 270 అడుగులు…
-
ఇది పూర్తి స్థాయిలో పూర్తయితే (2030 నాటికి), ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా అవతరిస్తుంది…

ప్రస్తుత పరిస్థితి (జనవరి 2026 నాటికి)…
ఆలయ పునాది (Piling work), ..ప్లింత్ లెవల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రధాన ఆలయ గోపురాలు, ఇతర ఉపాలయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి…
-
వైశాల్యం…: ఈ ఆలయ సముదాయం సుమారు 125 నుండి 161 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది…
-
పరిమాణం..: ఇది 2,800 అడుగుల పొడవు, 1,400 అడుగుల వెడల్పు, 270 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది… ఇది అయోధ్యలోని రామ మందిరంకంటే దాదాపు మూడు రెట్లు పెద్దదిగా ఉండబోతోంది…
-
శిల్పకళ…: ఈ ఆలయ డిజైన్ కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్, తమిళనాడులోని రామేశ్వరం, మదురై మీనాక్షి ఆలయాల శిల్పకళా రీతుల కలయికగా ఉంటుంది…
-
ప్రత్యేకతలు…: ఆలయ ప్రాంగణంలో మొత్తం 22 ఉపాలయాలు ఉంటాయి… ప్రధానంగా శ్రీరాముడు, సీతాదేవి కొలువై ఉంటారు… ఇక్కడ ఉండే హాలులో ఒకేసారి 20,000 మంది భక్తులు కూర్చునే వీలుంటుంది…
-
బడ్జెట్…: దీని అంచనా వ్యయం సుమారు 500 కోట్ల రూపాయలు... దీనిని పాట్నాలోని ప్రసిద్ధ మహావీర్ మందిర్ ట్రస్ట్ నిర్మిస్తోంది…
-
లక్ష్యం…: ఈ ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో 2030 నాటికి పూర్తవుతుందని అంచనా… ఈ ఆలయం పూర్తయితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా రికార్డు సృష్టించనుంది…
Share this Article