Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘ఆ బెడ్‌రూం మూలుగులు, నిట్టూర్పులు, పలవరింతలు ఆపించండి సార్’’

March 23, 2024 by M S R

సాధారణంగా ఇరుగూపొరుగూ ఇళ్ల నడుమ గొడవలు పెద్ద విషయమేమీ కాదు… కామన్… కలిసే ఉంటారు లేదా కలహించుకుంటారు, వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు చాడీలు చెప్పుకుంటారు… నడుమ ఉండే గోడకు చెవులు అతికించుకుంటారు… ఉన్నవీ లేనివీ, ఉన్నవాటికి అతిశయోక్తులు, భూతద్దాలు గట్రా అతికించబడతాయి కూడా… వినేవాళ్లకూ ఓ సరదా, నవ్వుకుంటారు… ఇండిపెండెంట్ ఇళ్లకన్నా అపార్ట్‌మెంట్లలో ఇవి మరీ అధికం… కామన్ వాల్స్, కామన్ స్పేస్ ఎక్కువ… కామన్ సెన్స్ తక్కువ కదా…

ఐనా సరే, కొన్ని విషయాల్లో  కొత్తగా ఒకరి గురించి మరొకరికి ఏం తెలిసినా సరే బయటికి చెప్పరు, చెప్పుకోవడానికి మనకే ఓరకమైన వెనుకంజ… సిగ్గు అడ్డుపడుతుంది… ప్రత్యేకించి సంభోగ వ్యవహారాలు… కానీ ఇది ఓ కొత్త కేసు… బెంగుళూరులో అవలహళ్లి బీడీఏ లేఅవుట్‌లో ఓ భారీ అపార్ట్‌మెంట్… 44 ఏళ్ల ఓ మహిళ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు దాకా వెళ్లింది… ఏమని తెలుసా..? పక్కింట్లో జంట పడక మూలుగులు, ప్రైవేటు సంభాషణలు స్పష్టంగా వినిపిస్తూ తనను డిస్టర్బ్ చేస్తున్నాయట, అంతేకాదు, ఆ కిటికీ కూడా మూసుకోరట, దాంతో ఈమెకు ఏమేమో కనిపించి ఇబ్బంది పెడుతున్నాయట ఆ జంట ఫోజులు…

ఆ జంట రొమాన్స్ కనిపిస్తుంటే, ఆ మాటలు వింటుంటే తనకు మనశ్శాంతి లేకుండా పోతోందని, ఆ బెడ్‌రూం కిటికీ మూసేయాలని చెప్పినా, ఉద్దేశపూర్వకంగా వినిపించుకోలేదట.., తెరిచే ఉంచుతున్నారట… పైగా ఈమె కుటుంబసభ్యులను చంపిస్తామనీ, అత్యాచారాలు చేస్తామనీ బెదిరించారట… ఓనర్‌కు చెబితే తనూ చేతులెత్తేశాడట… సో, ఈ అరాచక మెంటల్ టార్చర్ నుంచి నన్ను కాపాడండి మహాప్రభో అని ఆమె పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది… అరికట్టలేని ఓనర్ మీదా, ఆ ఓనర్ కొడుకు మీదా ఫిర్యాదు ఉంది… వింత కేసు…

Ads

ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి..? ఏం కేసు పెట్టాలి..? చెబితే వింటారా..? ఏయ్, మీ కిటికీలు మూసేసుకుని ఆ రసకార్యాల్లో మునగండి, అంతేగానీ బహిరంగ ప్రదర్శనలు దేనికి అని ఎలా బెదిరించాలి..? అసలు వీళ్ల నడుమ ఏమైనా పాతకక్షలు సెటిల్ చేసుకోవల్సినవి ఏమైనా ఉన్నాయా..? అందుకే ఈ కంప్లయింట్ చేసిందా.? దర్యాప్తు సంగతి తరువాత అనుకుని, ముందైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసేశారు… IPC Sections 504 (Intentional insult with intent to provoke), 506 (criminal intimidation), 509 (insult to modesty of woman), and 34 (criminal act with common intention) గట్రా పెట్టేశారు… ఈ కేసులో ఇన్ని సెక్షన్లు, ఈ చట్టాలు వర్తిస్తాయా అనడక్కండి… మళ్లీ అది మరో లోతైన చర్చ..!!

ఇంతకీ ఆమె ఒంటరి మహిళా..? ఫ్యామిలీ ఉందా..? ఉంటే భర్త ఫిర్యాదు చేయాలి గానీ ఆమె ఎందుకు చేసింది..? అసలు రోజూ తమ సొంత ఒరిజినల్ బూతు సినిమాను ఆమెకు చూపించాలనే దుర్బుద్ధి వెనుక పక్కింటి వాళ్ల ఉద్దేశం ఏమై ఉంటుంది..? అబ్బా, పోలీసులను దర్యాప్తు చేయనివ్వండి, వివరాలు తెలుస్తాయి, ఆగండి కాస్త..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions