Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె చేసిందే ఓ దరిద్రగొట్టు పని… ఆ తప్పుకి ‘ఇండి’ కూటమి తిక్క సపోర్టు…

December 9, 2023 by M S R

మమత బెనర్జీ అంటే అంతే… ఎప్పుడు వెనకేసుకొస్తుందో, ఎప్పుడు సింపుల్‌గా స్లిప్ ఇస్తుందో ఎవరికీ తెలియదు… తనే ఓ మెంటల్ కేసు… ఆమెకు తగినట్టు దొరికింది మహువా మొయిత్రా అనే ఎంపీ… ఆమె చేసిందే దరిద్రగొట్టు పని… తన లోకసభ లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను డబ్బు, కానుకల కోసం ఎవడో స్వార్థపరుడైన వ్యాపారికి ఇచ్చింది… అదీ పార్లమెంటులో స్వార్థపూరిత ప్రశ్నల కోసం… ఆమే అంగీకరించింది…

మరి అత్యున్నత చట్టసభ విలువను ఆమె బజారులో పెట్టి అమ్మేస్తే ఖండించాల్సింది పోయి… యాంటీ బీజేపీ ప్రతిపక్షాలన్నీ సమర్థిస్తున్నాయి… సో వాట్, దొంగతనం, భ్రష్టత్వం తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నాయి… మమత బెనర్జీ అయితే మహువాపై పార్లమెంటు సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఏకంగా ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థకే ద్రోహం’’ అంటోంది… ఓహో, ప్రశ్నలు వేయడానికి అమ్ముడుపోవడమా ప్రజాస్వామిక ప్రమాణం అంటే..?

మొదటి నుంచీ మహువా అంతే… నోటి దురుసు, వివాదాలు, ఎవరినీ లెక్కచేయని తత్వం… ఇప్పుడిక బీజేపీ ‘మహాభారత యుద్దాన్ని’ చూడాల్సి ఉంటుందట… పైత్యం… చేసిందే తప్పు, పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడం… దానికి పార్టీ వత్తాసు, కాదు కాదు, పార్టీల వత్తాసు… ఇదీ మన ప్రజాస్వామిక ప్రమాణాల స్థాయి… ఈ చర్చ జరుగుతున్నప్పుడు ‘ఇండి’ కూటమి పక్షాలు వాకౌట్ చేశాయి…

Ads

mahua

నిజానికి ఈ నోటిదురుసు నాయకురాలికి వివాదాలంటే మహా ప్రీతి… ఒక దశలో సాక్షాత్తూ ఆమె పార్టీయే ఆమె ‘కాళి’పై చేసిన వ్యాఖ్యల్ని ఆమె వ్యక్తిగతం అంటూ డిస్‌ఓన్ చేసుకుంది… గుర్తులేదా..? చెప్పుకుందాం… లీనా మణిమేఖల అనే పెయింటర్ ‘‘హిందూ వ్యతిరేకతే సృజనాత్మక ప్రావీణ్యం’’ అనే మన ఇండియన్ మేధావుల బాటలోనే కలకత్తా కాళిని చిల్లరగా చిత్రించింది… దాంతో బెంగాలీ సమాజం విరుచుకుపడింది… కాళి అంటే బెంగాలీల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రతీక కదా…

mahua

ఐనా సరే, మహువా ఎక్కడో మాట్లాడుతూ మణిమేఖల తప్పేముంది..?  ‘‘నాకు తెలిసి కాళి పొగతాగుతుంది, మందు తాగుతుంది… డౌటుంటే తారాపీఠం వెళ్లి చూడండి’’ అంటూ ఏదేదో రెచ్చిపోయింది… దాన్నీ హిందూ సమాజం ఛీత్కరించింది… దీంతో మమత పార్టీ ‘‘మహువా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, వాటితో మా టీఎంసీకి సంబంధం లేదు, మేం ఎండార్స్ చేయడం లేదు, అవి మా పార్టీ విధానవ్యాఖ్యలు కావు’’ అని అధికారికంగా మహువా వ్యాఖ్యల్ని ఖండించింది… ఒకరకంగా ఆమెకు చెంపదెబ్బ…

మహువాకు ఇవన్నీ అలవాటే… వివాదాలు ఏమీ కొత్తకావు… ఏదైనా అనడానికి జంకు, బెరుకు ఏమీ ఉండవ్… బడబడా అనేస్తుంది… ఎవరి మీదనైనా వ్యాఖ్య చేయడానికి రెడీ… పైగా వెనక్కి తగ్గదు… సారీలు, ఐడోన్ట్ రిపీట్లు ఏమీ ఉండవు…

mahua

మమత కూడా ‘‘తప్పుల్ని దిద్దుకోవచ్చు’’ అని స్పందించడంతో మహువాకు మండుకొచ్చింది… పార్టీ ట్విట్టర్ ఖాతాను ‘అన్ ఫాలో’ చేసి పడేసింది… తద్వారా ఏ చర్యకైనా రెడీ అనే సంకేతాన్నిచ్చింది… వ్యవహారం ముదిరితే, అవసరమైతే పార్టీకి బైబై చెప్పడానికీ రెడీ అయిపోతోంది… నలభై ఎనిమిదేళ్ల మహువా వ్యాఖ్యల్ని పార్టీ డిస్-ఓన్ చేసుకోవడం ఇప్పుడు కొత్తకాదు… గతంలోనూ జరిగింది… 2020లో మీడియాను ఉద్దేశించి దోపైసా అంటూ ఏవో కటువైన వ్యాఖ్యల్ని విసిరింది… దాంతో లోకల్ మీడియా ఆమెను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది… ఆ సందర్భంలో పార్టీ ఆమెవి వ్యక్తిగత వ్యాఖ్యలనీ, పార్టీకి సంబంధం లేదనీ ప్రకటించి, చేతులు దులుపుకుంది… అప్పట్లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మీద ‘‘తన గౌరవాన్ని కించపరిచాడు’’ అని కేసు పెట్టింది…

mahuva

తను ఎవరిని విమర్శిస్తున్నదో, వాళ్లు ఏ హోదాలో ఉన్నారో కూడా ఆమె పట్టించుకోదు… పార్లమెంటులో ఓసారి మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ మీద కొన్ని పరుషమైన వ్యాఖ్యలు చేసింది… బీజేపీ అంటే ఫుల్ మండిపడే ఆమె ఓసారి జీటీవీ మీద వ్యాఖ్యలు చేస్తే జీమీడియా కేసు పెట్టింది… ఢిల్లీ కోర్టు ఈ కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చింది, కేసు నడుస్తోంది… 2018లో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్‌ను బహిరంగంగానే వాయించేసింది… అదీ పెద్ద గొడవ… తరువాత కాళి వివాదం… ఆరేడు కేసులు పడ్డాయి… ఇప్పుడు ఏకంగా పార్లమెంటు నుంచే బహిష్కరించబడింది… అసలు ఎవరీమె..?

mahua

అస్సాంలోని కచార్ జిల్లా, లబాక్‌లో పుట్టిన ఈమె కలకత్తాలో చదువుకుంది… అమెరికాలోని మసాచుసెట్స్‌లో గ్రాడ్యుయేషన్… ఎకనమిక్స్, మ్యాథ్స్… చదువు కాగానే కొన్నాళ్లు జేపీ మోర్గాన్‌ కోసం న్యూయార్క్, లండన్‌లలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసింది… తరువాత ఇండియాకు వచ్చేసింది… 2010లో కాంగ్రెస్‌లో చేరి, కొంతకాలానికి జై టీఎంసీ అనేసింది… నిజానికి ఇంటిపేరు మొయిత్రా కాదు, మైత్ర లేదా మైత్రేయ… వరేంద్ర శాఖకు చెందిన బెంగాలీ బ్రాహ్మణుల పురాతనమైన ఇంటిపేరు…

mahua

ఓసారి అసెంబ్లీకి ఎన్నికై, మొన్నటి జనరల్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచింది… సహజంగానే బెరుకు లేని దూకుడు తత్వం కావడం, ఇంగ్లిషులో మంచి ఫ్లుయెన్సీ కారణంగా పార్లమెంటులో కూడా ధాటిగా మాట్లాడుతుంది… కొన్నాళ్లు టీఎంసీకి అధికార ప్రతినిధిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించింది… గోవా ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జిగా కూడా చేసింది…

ఆమె వ్యక్తిగత కుటుంబ వివరాలు పెద్దగా ఎక్కడా కనిపించవు… తను కొన్నాళ్లు స్కాండినేవియాలో ఉన్నాననీ, డేనిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రార్సన్‌ తన మాజీ భర్త అనీ మహువాయే ఓసారి వెల్లడించింది..! ఇదీ సదరు ‘ఉత్తమ ప్రజాస్వామ్య ప్రతీక’ కథ..!! చివరగా ఓ మాట… మహుశా తప్పులు చేస్తే గతంలో సపోర్ట్ చేయకుండా సంయమనం పాటించిన టీఎంసీ గానీ, ఇతర విపక్షాలు గానీ ఈ విషయంలో, అంటే పార్లమెంటు ప్రమాణాలకు పాతరేస్తే ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు..? మా అందరి వైఖరీ అదే అని చెబుతున్నాయా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions