అహ్మదాబాద్… వరల్డ్ కప్ ఫైనల్‌కు అడ్డా… ఇండియాలోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి ఆరోజు వెళ్లడానికి విమానం టికెట్ రేటు 50 వేల దాకా చేరిందని వార్తలు… అంతగా హైప్ క్రియేటైంది ఆ మ్యాచ్ మీద… ఇరవై ఏళ్ల తరువాత అదే ఆస్ట్రేలియాతో ఫైనల్… ఈసారి వరల్ కప్ మ్యాచుల్లో ఒక్క ఓటమీ లేకుండా ఫైనల్స్‌కు వచ్చింది భారత జట్టు…
అందుకే విపరీతంగా ఆశలు పెరిగిపోయాయి విజయం మీద… మొన్న సెమీ ఫైనల్స్ మ్యాచ్‌నే హాట్ స్టార్‌లో ప్రేక్షకులు ఒక దశలో 5.2 కోట్ల మంది చూశారు… ఇక ఈ ఫైనల్… అనూహ్యం… ఎంతవరకు పెరుగుతుందో చెప్పలేం… మ్యాచ్ టికెట్లు బ్లాకులో అమ్ముడుబోతున్నాయట… బెట్టింగులు జోరందుకున్నాయి… సాక్షాత్తూ ప్రధాని మోడీ హాజరవుతున్నాడు… అమితాబ్ సహా అనేకమంది పొలిటికల్, సినిమా, కార్పొరేట్ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు…
తోడుగా క్రికెట్ లెజెండరీలు సరేసరి… ఆస్ట్రేలియా గతంలో ఏడు సార్లు ఫైనల్స్‌లో అడుగుపెట్టి అయిదుసార్లు గెలిచింది… ఇండియా అప్పుడెప్పుడో కపిల్ దేవ్ నేతృత్వంలో… పుష్కరం క్రితం ధోనీ సారథ్యంలో… మరి ఇప్పుడు..? సరే, గెలుపోటముల్ని వన్డే మ్యాచుల్లో, అదీ ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థి మీద మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించడం కష్టం… ఐతేనేం, జాతి యావత్తూ ఓరకమైన ఉద్వేగంతో ఊగిపోతోంది… ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు దాని ప్రభావం సినిమాలు, టీవీ ఇతర ప్రోగ్రాముల వీక్షణాల మీద కూడా ఖచ్చితంగా పడుతుంది… చాలా నెగెటివ్‌గా ఉంటుంది కూడా…
Ads
ఎస్, బిగ్‌బాస్ వీకెండ్ షోకు ఆ దెబ్బ బలంగా పడబోతోంది… అసలే బిగ్‌బాస్ తక్కువ రేటింగ్స్‌తో మూలుగుతోంది… అఫ్‌కోర్స్, గత సీజన్‌కన్నా బెటరే అయినా సరే, ఒక్క వారం కూడా ఈ షో మాటీవీ టాప్ 30 ప్రోగ్రాముల జాబితాలోకి ఎక్కలేదు… వీక్ డేస్‌లో పెద్దగా ఎవరూ చూడరు… కానీ నాగార్జున హోస్ట్ చేసే వీకెండ్ షోలకు కాస్త వ్యూయర్‌షిప్ ఉంటుంది…
ఆ రేటింగ్సే షోను కాపాడుతున్నాయి… గత సీజన్ ఘోరంగా ఫ్లాప్… మధ్యలో 24 గంటల ఓటీటీ షో మరీ ఫ్లాప్… అదయితే జరిగినట్టు కూడా చాలామందికి గుర్తులేదు… ఇంత భారీ ఖర్చుతో కొనసాగించే రియాలిటీ షో మరొకటి లేదు… ఈ క్రికెట్ మ్యాచ్ ప్రభావం ఈ ఆదివారం బిగ్‌బాస్ వీకెండ్ షో మీద బలంగా పడటం ఖాయం…
ఫైనల్ మ్యాచ్ డే అండ్ నైట్… మధ్యాహ్నమే ప్రారంభమైనా సరే, రాత్రి పది వరకూ నడుస్తుంది… తరువాత భారత జట్టు గనుక విజయం సాధిస్తే మరో అరగంట వరకూ బహుమతి ప్రదానాలు ఎట్సెట్రా వేడుకలు ఉంటాయి… వీకెండ్ షో 9 గంటలకు స్టార్టవుతుంది… సరిగ్గా మ్యాచ్ కీలక దశ సాగుతున్నప్పుడు… మరెవడు చూడాలి వీకెండ్ షో… ఒకవేళ షోను ఎర్లీగా 7 గంటలకే స్టార్ట్ చేసినా ప్రయోజనం లేదు… (గతంలో 7 గంటలకు స్టార్ట్ చేసిన ఉదాహరణలున్నయ్…)
పోతేపోనీ… అసలు ఎవడు దేకాడు ఆ షోను..? చూస్తే ఎంత..? చూడకపోతే ఎంత..? అంటారా… దానికీ ప్రేక్షకులుంటారు కదా బ్రో అండ్ సిస్… అసలే మూలుగుతున్న నక్క… ఆపై క్రికెట్ తాటిపండు మీద పడితే…!!
Share this Article