వరల్డ్ కప్ సెకండ్ ఫేజ్ లో 3,4 స్థానాల కోసం కొద్దిగా ఆసక్తికరమైన పోటీ ఉండబోతుంది… అదెలాగంటే
మొదటి రెండు స్థానాలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే భారత్ కు సౌతాఫ్రికాకు రెండేసి మ్యాచ్ లు ఉన్నాయి…
Ads
భారత్ ఒక మ్యాచ్ సౌతాఫ్రికాతో మరోకటి నెదర్లాండ్స్ తో తలపడాలి.. సౌతాఫ్రికా ఒకటి భారత్ తో మరోకటి ఆఫ్ఘన్ తో ఆడాలి…. భారత్ రెండు మ్యాచ్ లు గెలిస్తే 18 పాయింట్లతో నెంబర్ 1 లో ఉంటుంది… భారత్ సౌతాఫ్రికాతో ఓడిపోయి నెదర్లాండ్స్ తో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి… … నెదర్లాండ్స్ తో ఓడటం కష్టం కాబట్టి ఆ ఉదాహరణ తీసుకోవడం లేదు…
సౌతాఫ్రికా రెండు మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండ్ అవకాశం ఉంటుంది… భారత్ తో గెలిచి ఆఫ్ఘన్ తో ఓడిపోతే సౌతాఫ్రికాకు కూడా 14 పాయింట్లు ఉంటాయి….. రెండు మ్యాచ్ లు ఓడిపోతే 12 పాయింట్లతో ఉంటుంది…..
ఇక ఆస్ట్రేలియాకు ప్రస్తుతం 8 పాయింట్లు ఉన్నాయి. ఇంకా మూడు మ్యాచ్ లు ఉన్నాయి. రేపు ఇంగ్లాండ్ తో, మరోకటి ఆఫ్ఘన్ తో, ఇంకోటి బంగ్లాదేశ్ తో … మూడుకి మూడు గెలిస్తే 14 పాయింట్లతో 2/3 స్థానాల్లో ఉండే అవకాశం ఉంది.. ఒకటి ఓడి రెండు గెలిస్తే 12 పాయింట్లతో ఉంటుంది.. రెండు ఓడి ఒకటి గెలిస్తే 10 పాయింట్లు ఉంటాయి…..
ఇక తరువాత స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు కూడా ఇదే వర్తిస్తుంది.. ఒకటి పాక్ తో (రేపు) ఇంకోటి శ్రీలంకతో ఆడాలి. రెండూ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి… పాక్ తో ఓడి లంకతో గెలిస్తే 10 పాయింట్లు… రెండూ ఓడే అవకాశం తక్కువ..
ప్రస్తుతం 8 పాయింట్లతో 5 వ స్థానంలో ఉన్న ఆఫ్ఘన్ కు కూడా రెండు మ్యాచ్ లు ఉన్నాయి .. రెండూ పెద్ద జట్లతోనే … రెండూ ఓడిపోతే టోర్నీ నుండి నిష్క్రమణ .. సౌతాఫ్రికా మీద గెలిచి ఆస్ట్రేలియాతో ఓడిపోతే టోర్నీలో న్యూజిలాండ్ పాక్ తో ఓడితే నెట్ రన్ రేట్ తో న్యూజిలాండ్ తో పోటీ పడాల్సి వస్తుంది….
నిన్న నెదర్లాండ్స్ తో ఆఫ్ఘన్ గెలవడం వల్ల పాకిస్థాన్ అవకాశాలు బాగా సన్నగిల్లాయి… పాకిస్థాన్ కు రెండు మ్యాచ్ లు ఉన్నాయి.. ఒకటి న్యూజిలాండ్, మరోకటి ఇంగ్లాండ్.. ఇంగ్లాండ్ ఆల్రెడీ టోర్నీ నుండి నిష్క్రమించింది కాబట్టి చివర మ్యాచ్ తాను ఇంటికి వెళ్తూ వెళ్తూ తనతో పాక్ ను తీసుకొని వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది…
Share this Article