.
WW3 అప్డేట్ ….. మొండివాడు రాజు కంటే బలవంతుడు! అదే రాజే మొండివాడు అయితే?
ఇక్కడ మొండి రాజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్! MGM 140 ATACMS ( Army Tactical Missile System )
Ads
ATACMS సిస్టమ్ ని మొదట అమెరికన్ డిఫెన్స్ సంస్థ అయిన LING – TEMCO VOUGHT డిజైన్ చేసి తయారు చేసింది. తరువాత ఈ సంస్థని లాక్ హీడ్ మార్టిన్ ( Lockheed Martin ) టేక్ ఓవర్ చేసింది.
MGM 140 ATACMS అనేది టాక్టికల్ సూపర్ సానిక్ బాలిస్టిక్ మిసైల్. భూమి మీద నుండి భూమి మీదకి ప్రయోగించే ఈ మిసైల్ 300 km వరకూ ప్రయాణించి టార్గెట్ ని కొట్టగలదు!
జో బిడెన్ ప్రభుత్వం MGM 140 ATACMS సిస్టమ్ ని ఉక్రెయిన్ కి సరఫరా చేసింది కానీ ప్రయోగించడానికి అనుమతి ఇవ్వలేదు!
అధ్యక్ష ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి, డెమోక్రాట్స్ ఓడిపోయి, రిపబ్లికన్ అధికారంలోకి వస్తుంది అని తెలియగానే జో బిడెన్ ATACMS ని రష్యా మీద ప్రయోగించడానికి అనుమతి ఇచ్చేశాడు!
ఒక పక్క అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నా లెక్కచేయకుండా అనుమతి ఇవ్వడం చూస్తుంటే వీలున్నంత త్వరగా ప్రపంచ యుద్ధం వైపు నడిపించాలి అని అర్ధం చేసుకోవచ్చు!
డోనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025 న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ రెండు నెలలలోపే ఎంత విధ్వంసం చేయవచ్చో అంతా చేయాలని డీప్ స్టేట్ ప్లాన్.
*********
జో బిడెన్ నుండి అనుమతి రాగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదోమిర్ జేలెన్స్కీ తన ఆర్మీకి ATACMS ని ప్రయోగించమని ఆదేశాలు ఇచ్చాడు.
మొత్తం 6 మిసైల్స్ ని ప్రయోగించింది ఉక్రెయిన్!
ఉక్రెయిన్ ప్రయోగించిన మిసైల్స్ రష్యా లోని బ్ర్యాన్స్క్ ( Bryansk ) ప్రాంతంలో ఉన్న రష్యన్ ఆర్టీలరీ డిపో మీద పడ్డాయి. పక్కనే ఉత్తర కొరియా నుండి దిగుమతి చేసుకున్న ఆయుధ డిపో కూడా ఉంది!
రష్యా మిసైల్ దాడిని ధృవీకరిస్తూ 6 మిస్సయిల్స్ లో 5 మిసైల్స్ ని తమ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకొని కూల్చేశాయని, ఒకటి మాత్రం మనుషులు లేని చోట పడ్డది అని పేర్కొన్నది.
*********
పుతిన్ రెండేళ్ల క్రితమే హెచ్చరిక చేస్తూ పశ్చిమ దేశాలు ఇచ్చే ఆయుధాలు కనుక ఉక్రెయిన్ మా మీద ప్రయోగిస్తే ఆయుధాలు ఇచ్చిన దేశాన్ని రష్యా తన శత్రువుగా పరిగణిస్తుందని చెప్పాడు!
హిమార్స్ రాకెట్స్ అమెరికా ఉక్రెయిన్ కి ఇవ్వడం, వాటిని రష్యా మీద ప్రయోగించడం జరిగి సంవత్సరం అవుతున్నది. నిజానికి హిమార్స్ రాకెట్ రష్యాకి భారీగా నష్టాన్ని కలగచేసింది. కానీ వాటి గురుంచి పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు పుతిన్. అఫ్కోర్స్! హిమార్స్ రాకెట్స్ అనేవి ఆర్టీలరీ విభాగానికి చెందినవి మరియు ఎక్కువలో ఎక్కువ 60 km వరకూ వెళ్ళగలవు. మన దగ్గర ఉన్న పినాక రాకెట్స్ లాగా…
కానీ ATACMS మిసైల్స్ అనేవి బాలిస్టిక్ మిసైల్స్ మరియు MAC 3 అంటే శబ్దవేగానికంటే మూడు రెట్లు వేగంతో వెళ్లడమే కాకుండా GPS నావిగేషన్ తో ఖచ్చితంగా టార్గెట్ ని కొట్టగలవు.
బహుశా ATACMS మిసైళ్ళు రష్యాకి భారీగానే నష్టం కలిగించి ఉండవచ్చు!
*********
పుతిన్ అణు బాంబులు ప్రయోగిస్తాను అని ప్రకటించాడు. దీనర్ధం ఏమిటంటే ఈసారి కనుక ATACMS మిసైల్స్ కనుక రష్యా మీద ప్రయోగిస్తే రెండో ఆలోచన లేకుండా అణు బాంబులు ప్రయోగిస్తాను అని హెచ్చరించాడు.
పుతిన్ ఇంతలా ప్రతిస్పందించడానికి కారణం ఉంది!
డోనాల్డ్ ట్రంప్ vs వోలోదిమిర్ జెలెన్స్కీ…
ట్రంప్ నేరుగా జెలెన్స్కీ ని ఉదేశిస్తూ తాను బాధ్యతలు చేపట్టాగానే అమెరికా ఉక్రెయిన్ కి ఇచ్చే సహాయం నిలిపివేస్తాను అన్నాడు. అలాగే ఉక్రెయిన్ ని దాడులు చేయకుండా నియంత్రిస్తాను అని కూడా అన్నాడు.
దీని మీద జెలెన్స్కీ ప్రతిస్పందిస్తూ ఉక్రెయిన్ అనేది స్వతంత్ర దేశం, శత్రువు మీద ఎలా స్పందించాలో అలానే మా ఇష్టం వచ్చినట్లు స్పందిస్తాం. ఎవరి ఆదేశాలు పాటించే ఖర్మ పట్టలేదు మాకు. ఇలాంటి సమాధానం ఇచ్చి జెలెన్స్కీ తప్పు చేశాడు.
మరో రెండు నెలల్లో అధ్యక్షుడు కాబోతున్న ట్రంప్ తో మాట్లాడే పధ్ధతి ఇలా ఉండకూడదు!
రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్లతో కలిసి యుక్రెనియన్ సైనికులు వేల సంఖ్యలో యూదులని చంపి పాతిపెట్టిన ఘటనని బహుశా జెలెన్స్కీ గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేస్తున్నాడా? రెండు నెలలలోపే రష్యాని ఓడించగలడా? ఆ తరువాత పరిస్థితి ఏమిటి?
పుతిన్ హెచ్చరికని ఈసారి తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే అణుబాంబుని ప్రయోగించాలి అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి.
కానీ ఈసారి పుతిన్ నో ప్రోటోకాల్స్ అంటూ న్యూక్లియర్ వెపన్ డాక్ట్రిన్ ని సవరించి ఆర్డర్ రాగానే ప్రయోగించాలి అంటూ ఆదేశాలు ఇచ్చాడు!
అంటే అణు బాంబు ప్రయోగించమని ఆదేశాలు వస్తే, అవి నిజమా కాదా అని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు వెంటనే ప్రయోగించాలి అన్నమాట! WW3 అని అనవలసి వచ్చింది అంటే ఇదే కారణం!
మొబైల్ అంటే ట్రక్కులు, జాలాంతర్గాములు, భూమి లోపల ఉన్న సిలోలు, అన్నిరకాల ప్రయోగించగల ICBM ( Inter Continental Ballistic Missile ) లు రష్యా దగ్గర చాలా ఉన్నాయి.
ముఖ్యంగా MIRV (Multiple Independent Reentry Vehicle ) టెక్నాలజీ తో కూడిన ICBM లు రష్యా దగ్గర ఉన్నాయి. అంటే వన్ మిసైల్ మెనీ వార్ హెడ్స్. వీటిని ఎదుర్కోగల టెక్నాలజీ ఎవరి దగ్గరా లేదు.
రష్యా ట్రైన్!
రష్యాలో మాస్క్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ ల మధ్యలో ఒక రైలు నిత్యం తిరుగుతూనే ఉంటుంది. ఈ ట్రైన్ ఒకసారి ప్రయాణీకుల రైలులా ఉంటుంది మరొకసారి గూడ్స్ ట్రైన్ లాగా ఉంటుంది కానీ ప్రయాణం మాత్రం ఆగదు. ఈ ట్రైన్ వాగన్స్ లలో రెండింటిలో MIRV టెక్నాలజీ ఉన్న రెండు ICBM లు అణు వార్ హెడ్స్ తో ఉంటాయి. రైలు ప్రయాణిస్తూ ఉండగానే ICBM MIRV లని ప్రయోగించగలదు.
ఒకసారి ICBM లని ప్రయోగించాక అప్పుడు ఏదో ఒక ప్రయాణీకుల స్టేషన్ లో ఆగుతుంది. గత 15 ఏళ్లుగా ఈ ట్రైన్ ఆగకుండా తిరుగుతూనే ఉంది. ఇంజిన్, వాగన్ లకి ఏదన్నా నిర్వహణ చేయాల్సి వస్తే వాటిని వేరు చేసి కొత్తవి వాటి స్థానంలో ప్రవేశపెడతారు.
ఈ ట్రైన్ నేరుగా పుతిన్ కంట్రోల్ లో ఉంటుంది!
*********
బ్రిటన్ ఈ సారి క్రిస్మస్ వేడుకలు అణు బాంబు నుండి కాపాడుకునే అండర్ గ్రౌండ్ బంకర్లలో చేసుకోవాల్సి ఉంటుంది అంటూ రష్యా హెచ్చరికలు చేస్తున్నది.
తమ వద్ద ఉన్న Storm Shadow మిసైల్స్ ని ఉక్రెయిన్ కి ఇస్తామని బ్రిటన్ ప్రకటించిన దరిమిలా రష్యా అణు దాడి హెచ్చరికలు చేసింది!
********
అంతా ముందస్తు వ్యూహంగా జరుగుతున్నదా? అవుననే సమాధానం వస్తుంది!
1.అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోలు ఓడిపోతే ఏం చేయాలి? గెలిస్తే ఏం చేయాలి? ఇలా ముందస్తుగానే ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా కనపడుతున్నది.
2.ట్రంప్ గెలుపు ఖాయం అనే వార్త వెలువడగానే వెంటనే పొలాండ్ దేశ సరిహద్దుల వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మొహరించారు. సరిగ్గా రష్యా పొలాండ్ సరిహద్దు దగ్గర మొహరించారు. దీన్ని పొలాండ్ ప్రకటించింది.
3.నిర్ధారణ కాని వార్త ఏమిటంటే పొలాండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు అవసరం అయితే రష్యా మీద దాడి చేయడానికి మరో మిసైల్ వ్యవస్థని కూడా సిద్ధం చేసింది. అయితే అది ఎలాంటి సిస్టమ్ అనేది తెలియరాలేదు! ఉక్రెయిన్ లాగా పొలాండ్ కూడా రష్యాతో సరిహద్దులు పంచుకుంటుంది కాబట్టి 300 km వెళ్లి దాడి చేయగల ATACMS మిసైల్ వ్యవస్థని పొలాండ్ కి తరలించి ఉండవచ్చు. రెండు వైపులా దాడి చేస్తే రష్యా బాగా దెబ్బతింటుంది!
4.ATACMS మిసైల్ ని రష్యా మీదకి ప్రయోగించడానికి అధ్యక్ష ఎన్నికలకి ముందే అనుమతి ఇచ్చి ఉండవచ్చు జో బిడెన్. డెమోలు ఓడిపోగానే ఉక్రెయిన్ ప్రయోగించింది!
దక్షిణ కొరియా పిచ్చి పని!
పుతిన్ కోరిక మేరకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన సైన్యం నుండి 10 వేల సైనికులను రష్యాకి పంపించాడు. ప్రస్తుతం ఉత్తర కొరియా సైనికులు రష్యా సైనికులతో కలిసి ఉక్రెయిన్ లో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులతో పోరాడుతున్నారు!
దీనికి ప్రతిగా దక్షిణ కొరియా తన ప్రధాన యుద్ధ టాంకులని ఉక్రెయిన్ కి పంపిస్తున్నది! ఇది పిచ్చి పని.
ఒకవేళ పుతిన్ అణు దాడి చేయాల్సి వస్తే, కిమ్ కోరిక మేరకు దక్షిణ కొరియా మీద కూడా దాడి చేస్తే ఏమవుతుంది? అనవసరంగా ఉక్రెయిన్ రష్యాల మధ్య తల దూర్చింది దక్షిణ కొరియా!
********
పుతిన్ అణు దాడికి దిగుతాడా?
పుతిన్ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు!
2025 ఫిబ్రవరి 23 నాటికి మూడేళ్లు అవుతుంది ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టి!
సుదీర్ఘ కాలం యుద్ధం చేస్తే ఎలావుంటుంది?
ఒక చిన్న లెక్క చెపుతాను.
2022 ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు 10 వేల మిసైల్స్ ప్రయోగించాడు పుతిన్ ఉక్రెయిన్ మీద. వీటిలో 5 వేల క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. వెయ్యి హైపర్ సానిక్ మిసైల్స్ ఉన్నాయి. మిగిలిన 4 వేలు అటు క్రూయిజ్ మిసైల్స్ కి తక్కువ ఇటు రాకెట్స్ కి ఎక్కువగా ఉంటాయి.
రక్షణ రంగ వ్యవస్థ పని భారంతో కుదేలు అయ్యింది! బలవంతంగా రోజుకి మూడు షిఫ్టులు పని చేయిస్తున్నాడు ఉద్యోగుల చేత! అయినా అనుకున్న టార్గెట్ కి చేరుకోవట్లేదు.
ఇక సైనికులు ఎన్ని లక్షల మంది చనిపోయారో లెక్కలేదు. అందుకే ఉత్తర కొరియా నుండి సైనికులని తెచ్చుకున్నాడు!
నాటో దేశాలు మూకుమ్మడిగా దాడి చేస్తే రెండు రోజుల్లో రష్యా లొంగిపోతుంది!
నిజానికి ఉక్రెయిన్ విషయంలో పుతిన్ పెద్ద తప్పు చేశాడు. తన మిలిటరీ ఆపరేషన్ ని మూడు నెలలలో ముగించేసి ఉంటే బాగుండేది! కానీ 1000 రోజులుగా యుద్ధం చేస్తూనే వచ్చాడు. ఉన్న ఆయుధాలతో పాటు రోజుకి సగటున 10 మిసైల్స్ తయారు చేయడం, వాటిని ప్రయోగించడం చేస్తూ వచ్చాడు.
చైనా టెక్నీక్ ని ఫాలో అయ్యి ఉంటే బాగుండేది. చైనా సలామీ స్లైస్, wolf warrior టెక్నీక్ ని ఫాలో అవుతుంది. చిన్న చిన్న ముక్కలని ఆక్రమించి ఆ భూమి తనదే అని అక్కడ సైనికులని కాపలా పెడుతుంది. ఒక సంవత్సరం ఆగి మరో వంద అడుగులు ముందుకి వచ్చి కంచె వేస్తుంది! దీనిని సలామీ స్లైస్ అంటారు.
So! పుతిన్ నిస్పృహలో ఉన్నాడు. అణు దాడి చేసినా చేస్తాడు!
ట్రంప్ పదవీ స్వీకారం చేసేవరకు అణు దాడి చేయకుండా ఉండాలని ఆశిద్దాం!……. (పొట్లూరి పార్థసారథి)
Share this Article