WW-3 అప్డేట్…
అనుమానించినట్లుగానే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది శనివారం రాత్రి పూట!
1. ఇరాన్ 300 కామికాజ్ (ఆత్మాహుతి) డ్రోన్లు ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. వీటిలో ఒక్కటీ కూడా ఇజ్రాయెల్ లో పడకుండానే ఆకాశంలో ఉండగానే కూల్చేసింది ఐరన్ డోమ్! రెండు డ్రోన్లు ఇజ్రాయెల్ లోని ఎడారి ప్రాంతంలో పడ్డాయి.
2. 110 బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఇరాన్ ప్రయోగించగా 103 మిసైళ్ళని ఇజ్రాయెల్ యారో (Arrow Air Defence System) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చెసింది.
3. మిగిలిన 7 బాలిస్టిక్ మిసైళ్లని బ్రిటన్, ఫ్రాన్స్, US యుద్ద నౌకలు సముద్రం మీద కూల్చివేశాయి.
4. 38 క్రూయిజ్ మిసైల్స్ ఇరాన్ ప్రయోగించగా 38 నీ ఐరన్ డోమ్ కూల్చివేసింది.
5. జోర్డాన్ ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలిచి తన జెట్ ఫైటర్స్ ను పెట్రోల్ కి పంపించింది. జోర్డాన్ ఫైటర్స్ రెండు కామీకాజ్ డ్రోన్లని కూల్చివేయగా అవి ఇజ్రాయెల్ ఎడారిలో పడ్డాయి.
*******
ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసే ముందు సౌదీ, యూఏఈ, కువైట్, ఒమన్ దేశాలతో చర్చలు జరిపి అమెరికన్ సైనిక బేస్ లని తమ మీద దాడి చేయడానికీ అనుమతి ఇవ్వవద్దని కోరింది.
గల్ఫ్ దేశాలలో అమెరికన్ సైనిక బేస్ లు ఉన్నాయి.
ఇరాన్ కోరిక మేరకు సౌదీ అరేబియా, UAE, కువైట్, ఒమన్ దేశాలు అమెరికాకి విజ్ఞప్తి చేశాయి, ఇరాన్ మీద దాడి చేయడానికీ తమ దేశాలలో ఉన్న స్థావరాలను వాడవద్దు అంటూ!
అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో తాము న్యూట్రల్ గా ఉండాలి అని నిర్ణయం తీసుకొని అమెరికాకి నో చెప్పినట్లుగా తెలుస్తోంది!
గల్ఫ్ దేశాలు భయపడ్డాయా?
పూర్తిగా కాకపోయినా భయం మాత్రం ఉంది అనే చెప్పాల్సిన అవసరం ఉంది.
1. గల్ఫ్ లో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీద ఇరాన్ కి పట్టు ఉంది, ఎందుకంటే ఇరాన్ ప్రాదేశిక జలాలలోనే హోర్ముజ్ జలసంధి ఉంది.
2. ఇరాన్ కనుక Hormuz జలసంధిని మూసివేస్తే 40% క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది ప్రపంచ దేశాలకి.
3. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ దేశాలు నష్టపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.
4. సౌదీ అరేబియాకి పక్కలో బల్లెంలా యెమెన్ లోని హుతీ గ్రూపుతో ఇప్పుడు శతృత్వం ఇష్టం లేదు.
5. హుతీ గ్రూపు ఇప్పటికే ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలు తిరగకుండా పట్టు సాధించింది. ఇరాన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే హుతీ గ్రూపు సౌదీ అరేబియా మీద దాడికి దిగే అవకాశం ఉంది.
5. హుతీ దాడుల నుంచి రక్షించేందుకు సౌదీ అరేబియా అమెరికా సహాయం కోరాల్సిఉంటుంది, ఇది సౌదీ రాజుకి ఇష్టం లేదు. అఫ్కొర్స్! జో బిడన్ డెమొక్రాట్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు సౌదీ అమెరికాకి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ట్రంప్ గెలిస్తే మాత్రం సౌదీ రాజు అమెరికాతో కలిసి పని చేస్తాడు.
6. రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు Arrow Anti Ballistic missile defence System మీద నిరంతరం పరిశోధనలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. నిన్న ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్స్ అన్నిటినీ కూల్చివేసిందీ Arrow.
7. ఏ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కి అయినా రియల్ టైమ్ డాటా అనేది ముఖ్యమైనది. కృత్రిమ టార్గెట్ ను కొట్టడం వేరు నిజంగా శతృ టార్గెట్ ను కొట్టడం వేరు. నిన్న ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడి వలన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలకు రియల్ టైమ్ డాటా ను రికార్డ్ చేసి దానిని విశ్లేషించి తమ Arrow సిస్టం ఎలా ప్రతిస్పందించింది మరియు Arrow మిస్సైల్ ట్రాక్ మరియు ట్రాజెక్టరీ ఎలా ఉంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. డేటా విశ్లేషణ తరువాత మరింత మెరుగ్గా పని చేసే విధంగా మార్పులు చేస్తారు సాఫ్ట్ వెర్ ను.
8.ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ మూడు అంచెలుగా ఉంటుంది. మొదటిది ఐరన్ డోమ్: ఇది అన్ గైడెడ్ రాకెట్స్, RPG (Rocket Propelled Grenades) ల నుండి రక్షణ ఇస్తుంది.
9. రెండవ వలయం: డెవిడ్స్ స్లింగ్ (David’s Sling). ఈ పదం యూదుల బైబిల్ లోని డేవిడ్ – గోలియత్ నుండి తీసుకోపడ్డది. ఈ సిస్టం పరిధి 240 km. క్రూయిజ్, తక్కువ ఎత్తులో వచ్చే బాలిస్టిక్ మిస్సైల్స్ తో పాటు జెట్ ఫైటర్స్ ను కూల్చివేయగలదు. ఇరాన్ దాడిని ఎక్కువగా ఎదుర్కొన్నది డేవిడ్స్ శ్లింగ్!
10. Arrow 2,Arrow 3 అనేది మూడవ వలయం. ఈ సిస్టమ్ పరిధి 2,400 km. Inter Continental Ballastic Missile (ICBM), హైపర్ సానీక్ మిస్సైల్స్ నీ ఎదుర్కొగలదు.
Ads
10. హమాస్, హెజ్బొల్ల గ్రూపుల అన్ గైడెడ్ రాకెట్ దాడుల వల్ల ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ సిస్టమ్ ను నిరంతరం అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇరాన్ David’s Sling, ARROW ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మరింత డెవలప్ చేసే అవకాశం ఇచ్చింది. అందుకే ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని ప్రకటించింది.
*******
మొదట ఇజ్రాయెల్ కి ఆయుధ సరఫరా ఆపేస్తామని బెదిరించిన జో బైడెన్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాను అని ప్రకటించగానే మాట మార్చాడు.
ఇజ్రాయెల్ కి అమెరికా ఐరన్ క్లాడ్ గా ఉంటుంది అని అనడమే కాదు వెంటనే ఇరాన్ కి హెచ్చరిక చేశారు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అమెరికా రక్షణగా ఉంటుంది అని.
శనివారం రాత్రి ఇరాన్ దాడిచేస్తే శుక్రవారం మధ్యాహ్నానికి తన యుద్ధ నౌకలని రక్షణగా పంపించాడు జో బిడెన్.
1.USS Dwight D Eisenhower ఇది విమాన వాహక యుద్ధ నౌక. ఇజ్రాయెల్ సముద్ర తీరంలో మోహరించింది అమెరికా.
2. USS Philippine Sea అనే మరో యుద్ధ నౌక నీ మోహరించింది.
3. USS Gravely మరియు USS Mason అనే రెండు డిస్త్రాయర్స్ ను మొహరించింది.
4. మరో మిస్సైల్ లాంచర్ వేసల్ ను కూడా ఇజ్రాయెల్ తీరానికి పంపించింది. ఒక చిన్నపాటి కారియర్ స్ట్రైక్ గ్రూప్ (CSG) ను మొహారించింది. ఆఫ్కోర్స్, నాలుగు న్యూక్లియర్ పవర్ సబ్మరైన్స్ ఈ స్ట్రైక్ గ్రూప్ లో ఉంటాయి ఇది డిఫాల్ట్ కన్ఫిగరేషన్ !
*********
మరోవైపు హార్ముజ్ జలసంధికి దగ్గరగా మరో కారియర్ స్ట్రైక్ గ్రూప్ ను తరలించింది అమెరికా. అయితే ఇవి అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్నాయి కాబట్టి మిగతా గల్ఫ్ దేశాలు అభ్యంతర పెట్టలేవు.
*********
ఇరాన్, ఇజ్రాయెల్ కన్ఫ్లిక్ట్ లో నాటో దేశాలు కలుగచేసుకోవు అని భావించిన వారికి షాక్ తగిలింది.
బ్రిటన్, జెర్మనీ, ఆస్ట్రేలియా లు ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు తెలపడమే కాదు కొన్ని క్రూయిజ్ మిస్సైల్స్ ను అడ్డుకున్నాయి బ్రిటీష్ రాయల్ నావీ.
So! జరగబోయే పరిణామం ఏమిటో తెలిసిపోతున్నది.
నాటో దేశాలు ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. మిగతా ప్రపంచం ఏమనుకున్నా లెక్క చేయవు. కానీ ఫ్రాన్స్ పూర్తిగా బయట పడలేదు. అలా అని నాటో కూటమికి వ్యతిరేకంగా వెళ్తుంది అని అనుకోలేము, ఎందుకంటే ఇప్పటికే 1000 మంది ఫ్రాన్స్ సైనికులు, వ్యూహకర్తలు యుక్రేయిన్ లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
అసలు ముస్లిం దేశం ఆయిన జోర్డాన్ ఇజ్రాయెల్ కి మద్దతుగా ఎందుకు నిలిచింది?
జోర్డాన్ రాజు మహమ్మద్ ప్రవక్త వారసుడు!
కానీ యూదులకు ఎందుకు సహరిస్తున్నాడూ?
తరువాతి అప్డేట్ లో తెలుసుకుందాం!
******
కొద్ది గంటల క్రితం ఇజ్రాయెల్ వార్ రూమ్ లో సమావేశం ఆయిన ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులు ఇరాన్ దాడికి ప్రతి దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు! ఈ రోజు రాత్రికి ఇజ్రాయెల్ F-35s, F-16 లు ఇరాన్ ఆయుధ ఫ్యాక్టరీలు, అణు కేంద్రాల మీద దాడి చేసే అవకాశం ఉంది!
Share this Article