శివాజీ… ఇన్నిరోజులుగా చెప్పుకుంటున్నదే… మళ్లీ అదే వితండవాదం… తన మాటే నెగ్గాలనే పెత్తందారీ ధోరణి… ఈసారి కెప్టెన్సీ ఎంపికను కంపు కంపు చేసి, చివరకు ఎవరూ కెప్టెన్ గాకుండా చెడగొట్టేశాడు… ఇక్కడ శోభాశెట్టి శివాజీ మీద చాలా చాలా బెటర్…
అర్జున్, అమర్‌దీప్… ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలంటే, మరొకరిని మెషిన్ గన్‌తో ఫోటో కాల్చి రిమూవ్ చేయాలి… శివాజీ మొదట్లో అమర్‌దీప్‌కు మాట ఇచ్చాడు… సపోర్ట్ చేస్తానని… కానీ ఎప్పుడైతే అర్జున్, అమర్‌దీప్‌ల నడుమ చివరి పోటీ నెలకొన్నదో అప్పుడు ప్లేట్ మార్చేశాడు… అర్జున్ భార్య హౌజుకు వచ్చినప్పుడు మాట ఇచ్చాడట… దాంతో అమర్‌దీప్‌కు ఇచ్చిన మాటను మూసీలో కలిపేశాడు…
అదెలా..? అమర్‌దీప్ చెబుతూనే ఉన్నాడు… నేను కూడా మా పేరెంట్స్‌కు మాట ఇచ్చాను… ఈసారి కెప్టెన్ కావడానికి చివరి చాన్స్, మళ్లీ రాదు, ఆల్‌రెడీ అర్జున్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు… సో, నాకు ఈసారి సపోర్ట్ చేయండి అనేది తన వాదన… అందులో పాయింట్ ఉంది… తనకు అలా కోరే నైతిక హక్కు కూడా ఉంది… దానికి సెంటిమెంట్ ప్రయోగించకు అని దబాయించాడు శివాజీ… మరి తను అర్జున్ భార్య మాట ఇవ్వడం అనేది సెంటిమెంట్ కాదా..? టికెట్ ఫినాలే గెలుచుకో అని ఓ ఉచిత సలహా పడేశాడు… అవును, ఆ మాట అర్జున్ కి కూడా చెప్పొచ్చు కదా… ఏడ్చి చెడగొట్టకు అని దబాయించాడు… ఏడ్చినా సరే చెడగొట్టింది శివాజీయే…
Ads
పైగా ఇన్నాళ్లూ నిన్ను కెప్టెన్ గాకుండా అడ్డుకున్నది ఎవరు అని వితండవాదంతో అమర్‌దీప్ నోరు మూయించడానికి ప్రయత్నించాడు శివాాజీ… అర్జున్ కూడా ఎవరు డిజర్వ్, ఎవరు అన్ డిజర్వ్ తేల్చుకోవాలి తప్ప సెంటిమెంట్ కాదు అంటాడు… అమర్ దీప్ కూడా గరిష్ట స్థాయిలో టాస్క్ ప్లే చేసినవాడే కదా… అన్ డిజర్వ్ ఎలా అవుతాడు..? ఇక్కడ శోభాశెట్టి వాదన గురించి చెప్పాలి…
తను హండ్రెడ్ పర్సెంట్ అమర్ దీప్ పట్ల కృతజ్ఞత చూపించడానికి ప్రయత్నించింది, తన మాట మీద నిలబడింది… చివరకు తనను పదే పదే దెబ్బ కొడుతున్న శివాజీని కూడా బతిమిలాడింది… గ్రాటిట్యూడ్, ఈ పదానికి కట్టుబడి, స్థిరంగా తన మాట మీద నిలబడింది… చివరకు శివాజీ మొండాట, తొండాట కారణంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేక… చివరకు బిగ్‌బాస్‌కే చిరాకెత్తి ఈసారి కెప్టెన్సీ టాస్కే రద్దు చేసి, ఇద్దరి ఫోటోల్ని కాల్చిపారేశాడు… కథ ఒడిశింది…
అంబటి అర్జున్ వాదనలో లోపం ఏమిటంటే… కెప్టెన్ అయిపోతే ఎలిమినేషన్ ఉండదనే భ్రమ… సేమ్ అశ్విని అలాగే బాధపడింది… కెప్టెన్ గా ఎంపికైతే వచ్చేవారం నామినేషన్ల నుంచి immunity వస్తుంది… ఈవారం అది కాపాడదు…
నిన్న బిగ్‌బాస్ హత్యల టాస్కులో అట్టర్ ఫ్లాపయిన శివాజీ… ఈరోజు కెప్టెన్సీ ఎంపికలోనూ ఫెయిల్… SPY గ్రూపుగా చెప్పబడే (శివాాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కు శివాజీ లీడర్… అదేసమయంలో SAP గ్రూపుగా చెప్పుకునే (శోభ, అమర్, ప్రియాంక) బ్యాచ్‌కు శోభ లీడర్… శోభ తన మాట మీద నిలబడి, కృతజ్ఞురాలిగా ఉండటానికి బాగా ప్రయత్నించింది… అదేసమయంలో శివాజీ మాత్రం అర్థంపర్థం లేని తిక్క వాదనలతో మొత్తం ఆ ఎంపిక ప్రక్రియనే అపహాస్యం చేశాడు… ఫాఫం, అమర్ దీప్…!! (ఈ మొత్తం ప్రక్రియలో పాపం యావర్, ప్రశాంత్‌లకు తమకంటూ ఓ స్థిర వైఖరి లేక, శివాజీ చెప్పినట్టు ఆడి పిచ్చోళ్లయిపోయారు…) ఐనా సరే, రేప్పొద్దున నాగార్జున ఆ శివాజీ మీద ఈగ కూడా వాలనివ్వడు…!!
Share this Article