Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!

August 22, 2026 by M S R

.

Enumeration forms ఇంటికే వస్తాయి అన్నారు… ఒక్కడూ రాలేదు… ఏదో కమ్యూనిటీ హాల్‌లో, ఇంకెక్కడో సంబంధిత వ్యక్తులు కూర్చుని, వచ్చి తీసుకుపొండి అన్నారు… మన తీట అనుకుని వెళ్లి తెచ్చుకున్నాం కదా…

పరమ దరిద్రమైన 2002 తో లంకె పెట్టారు, అప్పటికి ఎక్కడున్నామో గుర్తు లేదు, పార్ట్ నంబర్ తెలియదు, మనం ఇంకెక్కడికో మారిపోయాం, పాత పోలింగ్ సెంటర్ కూడా గుర్తులేదు… అప్పట్లోనే మూడు ఎన్నికలకు మూడు సెంటర్లు మార్చారు…

Ads

తీరా నాలుగుసార్లు ఆ BLO ఎక్కడున్నాడో వెతుక్కుని… 2002 బాపతు లిస్టును ఓ జిరాక్స్ సెంటర్‌ వాడి గదుమ పట్టుకుని, బతిమిలాడి  ఆ లిస్టు పట్టుకుని… ఆ వివరాలు నింపి, ఫామ్స్ సబ్మిట్ చేశాక… తీరా డ్రాఫ్టులో పేరు లేదు… మన ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌కన్నా దరిద్రమైన వెబ్‌సైట్ బహుశా సోమాలియా ప్రభుత్వానికి కూడా లేదనుకుంటాను…

ASDD జాబితా అంటాడు… అందులోనూ ఇవే పార్ట నెంబర్లు, సీరియల్ నంబర్లు, పోలింగ్ బూతుల పేర్లు… (నానా బూతులూ తిట్టుకున్నా సరే) వివరాలు ఏమీ కనిపించక… ఏం చేయాలో అర్థం గాక… ఈరోజుకూ ఇంటికి ఆ నోటీసులు ఇచ్చేవాడు లేక… రాక… ఎడ్డిమొహాలు వేసిన వోటర్లు కోటి మంది దాదాపు…
.
మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఇంత దరిద్రంగా, ఇంత అధ్వానంగా, ఇంత గందరగోళంగా నిర్వహించబడే ఓ అధికారిక, అదీ ఓ కీలక ప్రక్రియ మరొకటి లేదు, ఉండబోదు… ఈమాత్రం ఘనతకు ఆ ట్రంపుగాడు మెచ్చుకున్నాడట… ఖచ్చితంగా మన తెలంగాణ చీఫ్ ఎన్నికల అధికారికి కనీసం ఓ పద్మవిభూషణ్ నేరుగా ఇస్తే ఆ పురస్కారానికే గౌరవం… మోదీజీ, ప్లీజ్ కన్సిడర్…
.
నిజంగా ఈ పోస్టు ఎవరికీ నివాళి కాదు… వాళ్లెవరో కూస్తున్నారు… ఈ ప్రక్రియ నాన్ బీజేపీ వోటర్లను తొలగించడం కోసం కుట్ర అని… వెధవల్లారా, అధికశాతం పోతున్నవి బీజేపీ వోట్లే హైదరాబాదులో… ఆ సోయి బీజేపీకి లేదు, మా వోట్లు పోకుండా చూసుకోవాలనే స్పృహ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు లేదు, అధికారం కోసం ఆబగా, ఆశగా చూస్తున్న బీఆర్ఎస్‌కు అంతకన్నా లేదు…
.
పోలింగ్ ముందురోజు కోట్లకుకోట్లు డబ్బు, మందు, కానుకలు, మన్నూమశానం పంచే నాయకులకు, పార్టీలకు నిజంగా సిగ్గూశరం లేదు… ఇప్పుడు కదరా మీరు సగటు వోటరుకు సహకరించాల్సింది… నిన్న పత్రికలో ఓ వార్త చూశాను… అర్హుడైన ఒక్క వోటరు హక్కు కూడా నిరాకరించబడదు అని ఎవడో ఓ ఉన్నతాధికారి కూస్తున్నాడు… నీ తలపండు పలుగ… నీ వేళ్లకు జెట్టలు పుట్ట…!!

.

(నిజంగానే ఇది హైదరాబాదులోని లక్షల మంది అర్హులైన వోటర్ల మనోగతమే… నో, నో, ఖండిస్తున్నాం అని పలికేవాళ్లు కాస్త పక్కకెళ్లి ఆడుకొండి… ప్రతి వోటరుకూ నెట్‌తో పరిచయం, ప్రవేశం, ప్రావీణ్యం ఉందనే చెత్త భ్రమల్లో పడి బతికే ప్రతి అధికారికీ ఈ కథనం అంకితం…)

.

ఫీల్డ్ రియాలిటీ తెలియకుండా, పట్టించుకోకుండా…. ఇలా మీ పేర్లు చెక్ చేసుకొండి, ఇదుగో ఇలా మీ వోటు హక్కును భద్రపరుచుకొండి అని పిచ్చి రాతలు రాసే జర్నలిస్టులకు కూడా… ఆమె, మీనాక్షి నటరాజన్, ఓ రాజ్యాంగేతర శక్తి కూడా పరమ హాశ్చర్యపడిపోయిందట, ఇన్ని లక్షల వోట్లు గల్లంతయ్యాయా అని… ఐ పిటీ హర్ ఆల్సో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!
  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!
  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!
  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions