మామూలుగా ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే బూతు… అదయినాసరే, ఒకప్పుడు స్కిట్ అంటే స్కిట్‌లా ఉండేది… తరువాత భ్రష్టుపట్టించి, వాళ్లలోవాళ్లే జోకులు వేసుకుంటూ, పంచులు విసురుకుంటూ, స్కిట్లను-వాళ్ల పర్సనల్ గోలను కలిపేసి, గందరగోళం చేసి, ఓ కామెడీ స్కిట్ అంటే ఎలా ఉండకూడదో చెప్పడానికి ఉదాహరణగా మార్చేశారు… దీన్ని చూసి వాతలు పెట్టుకోబోయిన జీతెలుగు, స్టార్‌మాటీవీ చేతులు, మూతులు కాల్చుకున్నయ్…
మరీ హైపర్ ఆది ఎంటరయ్యాక మొదట్లో కాస్త పంచులు గట్రా అలరించినా సరే, తరువాత మొనాటనీ వచ్చేసింది… వేషాలు, ప్రయోగాలు, కంటెంట్ మీద గాకుండా పంచులే కామెడీ చేశారు… మరీ తరువాతకాలంలో మింగుడు, మంగళవారం భాషతో ప్లస్ తోటి కమెడియన్ల మీద వెక్కిరింపులు, పంచులతో ఇంకా దిగజార్చేశారు… చాన్నాళ్ల తరువాత… నిజమే చాన్నాళ్ల తరువాత… అవునూ, ఇది జబర్దస్తేనా అనిపించేలా ఓ స్కిట్… తాజా ప్రోమో చూసి ఆశ్చర్యమేసింది…
ప్రోమో కాబట్టి, రఫ్‌గానే చెప్పుకుందాం… బింబిసార సినిమా, సీతారామం, ఉప్పెన సినిమాల్ని కలగలిపిన స్పూఫ్ అది… పెద్ద పర్‌ఫెక్షన్ ఏమీ కనిపించలేదు… బింబిసార ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే ఆది పిచ్చి పంచులు ఉన్నయ్… తరువాత సీతారామంలోకి నెట్టేస్తారు స్కిట్‌ను… లింక్ పెద్దగా కుదిరినట్టు లేదు గానీ… హఠాత్తుగా రాఘవ సూర్యకాంతం వేషంలో ప్రత్యక్షం… ఉప్పెన స్పూఫ్ సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి వేషాలతో… ఆది బిట్ లేకుండా ఉంటే, ఇంకాస్త బాగుండేది, బట్, ఈ ఆలోచన మంచిదే… నెత్తిమాశిన స్కిట్ పైత్యాల నుంచి కొత్తగా బాగుంది…
Ads
ప్రత్యేకించి రాఘవ… తను కమెడియన్‌గా బాగా చేస్తాడు… వెధవ కంట్రవర్సీల్లోకి రాడు… ఉన్నంతలో బెటర్ పర్‌ఫార్మర్… తను సూర్యకాంతం వేసి, ఆ స్పూఫ్‌ను భలే రక్తికట్టించాడు… పంచులే కాదు, ఇలా పర్‌ఫామ్ చేయాలని ఆదికి పరోక్షంగా ఓ లెసన్ చెప్పాడు… నిజానికి కృష్ణభగవాన్ అంత వీజీగా ఒక స్కిట్ పట్ల కన్విన్స్ కాడు… ఏదో ఓ సెటైర్ వేస్తాడు… తను కూడా ఈ స్కిట్ పట్ అప్రిసియేట్ చేశాడు… ఇంద్రజను వదిలేయండి, నవ్వడం, ఆహా ఓహో అనడం…
ఓహ్, అయితే జబర్దస్త్‌కు మంచి రోజులు వచ్చాయా అని అమాయకంగా అడక్కండి… చుక్కతెగి రాలిపడ్డట్టుగా ఓ రియల్ కామెడీ స్కిట్… ఆది కామెడీ తీరు పట్ల అభ్యంతరాలున్నా సరే… ఒక్క విషయంలో మాత్రం తనను సమర్థించాలి… మొన్న ఏదో స్కిట్‌లో తను ఆర్ఆర్ఆర్ మీద ఏదో అన్నాడట… రాజమౌళి, ఎన్టీయార్, రాంచరణ్ ఫ్యాన్స్ ఆగ్రహించారట… ఫేక్, అలా ఏమీ ఉండదు, ఎవడో యూట్యూబర్ లేదా సైట్ వాడు బరబరా అలా గీకేసి ఉంటాడు…
పాపులర్ సినిమాల మీద స్పూఫులు తప్పేముంది..? అది ఫన్ కోసమే… సో, ఆది తప్పేమీ లేదు… ఐనా, రాజమౌళి తీసేవే కాపీ సీన్లు కదా… స్పూఫులు, మీమ్స్, వెక్కిరింపులకు అర్హుడే కదా… పాపులర్ సినిమాలకు కాస్త సరదాగా స్పూఫులు చేస్తే ఎంత రక్తికడతాయో చెప్పడానికి ఈ తాజా బింబిసార, సీతారామం, ఉప్పెన స్పూఫ్ ఉదాహరణ… మళ్లీ బరబరా గీకకండి… సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి, కల్యాణరామ్ ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారని…!!
Share this Article