.
ఆహా రష్మిక… అనాలనిపించింది ఆ పాట చూడగానే… ది గరల్ ఫ్రెండ్ అనే ఓ సినిమా వస్తోంది ఆమెది… దానికి సంబంధించిన ఓ పాట రిలీజ్ చేశారు… ఎంత బాగుందో…
సగటు తెలుగు సినిమా పాట అనగానే స్టెప్పులు అనగానే కుప్పిగంతలు, కప్పగెంతులు, సర్కస్ ఫీట్లు… కాదంటే పిల్ల పిరుదుల మీద పిల్లగాడి అరచేతుల దరువులు… మరీ శేఖర్ మాస్టర్ స్టెప్పులయితే మరీనూ… పైగా దాన్ని డాన్స్ అంటారట…
Ads
మరి ఇందులో… దిగువ వీడియో చూడండి ఓసారి… ఎంత డిఫరెంటుగా ఉందో డాన్స్… ఈ సినిమాను ఈనెలాఖరులోనో, వచ్చే నెల ఆరంభంలోనో రిలీజ్ చేస్తారేమో… ఏదో పొయెటిక్ టీజర్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు కొన్నాళ్ల క్రితం… అది పెద్ద ఇంప్రెసివ్ ఏమీ లేదు, కానీ ఈ ‘నదివే’ పాట మాత్రం బాగుంది…
ఇక్కడ రష్మికను మెచ్చుకునే కారణం ఏమంటే..? ఇప్పుడు తన రేంజ్ అల్లు అర్జున్, రణబీర్ కపూర్ లేకపోతే ధనుష్, విక్కీ కౌశల్… ఇప్పుడామె హైరేటెడ్ యాక్ట్రెస్ ఆన్ ఇండియన్ సినిమా… పెద్ద హీరోలందరికీ ఆమె కావాలి… అలాంటిది దీక్షిత్ శెట్టి అనే చిన్న నటుడితో జతకట్టడం… రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం… అల్లు అరవింద్ సమర్పిస్తున్న పాన్ ఇండియా చిత్రం…
ఎవరబ్బా ఈ కొరియోగ్రాఫర్ అని కాసేపు వెతకాల్సి వచ్చింది… మన యూట్యూబ్ వీడియోల్లో డ్రమ్స్ ఎవరు వాయించారు, వయోలిన్ ఎవరు మీటారు, మిక్సింగ్ ఎవరు చేశారు వంటివీ రాస్తారు గానీ… కెమెరా, కొరియోగ్రఫీ ఎవరో ఎక్కడో దిగువన రాసుకొస్తారు…
ఈ పాటలో ముందుగా మెచ్చుకోవాల్సింది కెమెరా… భిన్నమైన సెట్లు, కలర్స్, లైటింగ్… నర్తకుల ప్రతి కదలికనూ మరింత బాగా ఎలివేట్ చేసింది… సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫి… (మన కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థి కమ్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్… తరువాత సినిమాటోగ్రఫీలో పాపులర్ ఇన్‌స్టిట్యూట్‌లో మాస్టర్స్ చేశాడు…)
తరువాత ఖచ్చితంగా చెప్పాల్సింది కొరియోగ్రాఫర్… పేరు విశ్వకిరణ్ నంబి… తను డాన్సర్, భిన్నమైన నాట్య ప్రదర్శనలు కంపోజ్ చేస్తుంటాడు… తన ఫేస్‌బుక్ పేజీ చూస్తుంటే తన వర్క్‌కు అప్రెసియేషన్స్ అవసరమే అనిపించింది… ఈ పాట కోసం రెండు నెలల టైమ్ తీసుకున్నాడట, రష్మిక, దీక్షిత్ సాధనను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టాడు…
ఎస్, ఇక్కడే మరోసారి రష్మికను మెచ్చుకునేది… మామూలుగా సినిమా స్టెప్పులు ఇప్పుడు ఎలా ఉంటున్నయ్… షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే కొరియోగ్రాఫర్ ఏదో పిచ్చి స్టెప్పులు చెబుతాడు, వీళ్లు చేస్తారు… మరీ క్లిష్టమైతే కాస్త రిహార్సల్, ట్రెయినింగ్, సాధన… కానీ రెండు నెలలు ఒకపాట కోసం కష్టపడటం, తన టైమ్‌కు, తన కాల్‌షీట్‌కు ఇంత డిమాండ్ ఉన్న రోజుల్లో… సూపర్…
చివరగా… చిన్న అసంతృప్తి… సంగీతం హేషమ్ అబ్దుల్ వాహెబ్… పాట కంపోజింగ్ బాగుంది… మెలోడియస్… కానీ తనే పాడాడు, అసలు తెలుగు పదాలే అయినా అవేమిటో అర్థం కానంత గందరగోళంగా… సాహిత్యమే సరిగ్గా వినిపించకపోతే ఇక పాట రాసిన రాకేందు మౌళి ఏం రాశాడో ఏం చెప్పాడో ఏం చెప్పుకునేది..?
కానీ సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ… వీటిల్లో తెలుగు సినిమా అనగానే పదే పదే వినిపించే పేర్లు కావివి… అందుకే పాటలో కొత్తదనం, వైవిధ్యం…. ఎస్, నైపుణ్యం కూడా… రాహుల్ రవీంద్రన్ టేస్టుకు అభినందనలు… రష్మికకు మరోసారి..!! (దీక్షిత్ శెట్టి హీరో తెలుగు దసరా మూవీలో కూడా చేశాడు… ఈ ‘శెట్టి’లు రష్మికను వదిలేట్టు లేరు… హహహ…)
Share this Article