Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోహ్లీ…! అన్ని జట్ల అభిమానులకూ ఆరాధ్యుడివే… నువ్వు తోపున్నర…!!

May 23, 2026 by M S R

.

నిన్నటి హైదరాబాద్ – బెంగుళూరు ఐపీఎల్ మ్యాచ్… ఈ సీజన్‌కే హైలైట్ మ్యాచ్… విరగబడిన ప్రేక్షకులు… బ్లాకులో టికెెట్ల దందా… ప్రేక్షకులు అదోరకం మేనియాతో ఊగిపోయారు… ఇక్కడ ఓ విశేషం చెప్పాలి… ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ‘కోహ్లీ మస్తు ఆడాలి, కానీ హైదరాబాద్ గెలవాలి’ అనే భావన… మరోవైపు బెంగుళూరు ఫ్యాన్స్‌కు ‘కోహ్లీ మస్తు ఆడాలి, బెంగుళూరు కూడా గెలవాలి’ అనే భావన…

(టెండూల్కర్ తరువాత ఇంత పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకుని, ఈరోజుకూ నిలబెట్టుకున్న క్రికెటర్ కేవలం కోహ్లీయే… సినిమా భాషలో చెప్పాలంటే తను పాన్- వరల్డ్ సూపర్ స్టార్…)

Ads

ఇరువైపులా ఫ్యాన్స్‌కు కోహ్లీ డెమిగాడ్… కాకపోతే తను త్వరగా ఔటయ్యాడు, అది వేరే విషయం, ఎవరైనా ఎల్లవేళలా సెంచరీలు కొట్టలేరు కదా… కానీ హైదరాబాద్ ఫ్యాన్స్‌ అంత ఖర్చు పెట్టారు కదా… పైసా వసూల్… హైదరాబాద్ గెలిచింది… దూరదూరాల నుంచి వచ్చిన బెంగుళూరు ఫ్యాన్స్ కూడా గెలిచారు… అదెలాగంటే..?

ఈ మ్యాచులో హైదరాబాద్ గెలిచి ఓడింది… బెంగుళూరు ఓడిపోయినా గెలిచింది… వెరసి ఇద్దరూ ఓడారు, ఇద్దరూ గెలిచారు… విచిత్రం కాదు, వివరంగా చెప్పాలంటే…



ipl



పాయింట్ల పట్టికలో 3వ స్థానం, 4వ స్థానం సాధించిన జట్ల మధ్య జరిగే నెక్స్ట్-లెవెల్ పోరాటమే ‘ఎలిమినేటర్’… ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుండి నేరుగా ఎలిమినేట్ (అవుట్) అయిపోతుంది… వారికి మరో అవకాశం ఉండదు… విజేతకు ప్రయోజనం…: ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లడానికి మరో మ్యాచ్ (క్వాలిఫైయర్-2) ఆడాల్సి ఉంటుంది…

ఎలిమినేటర్ దశ నుంచి తప్పించుకోవాలని హైదరాబాద్ ప్రయత్నించింది… టాప్-2 లోకి వెళ్దామని ట్రై చేసింది కానీ… నెట్ రన్‌రేట్ లెక్క చూస్తే అది అలాగే మూడో ప్లేసులో ఉండిపోయింది… రేప్పొద్దున ఎవరు టాప్-4 ప్లేసులోకి వస్తే వాళ్లతో ఎలిమినేటర్ ఆడాల్సిందే… అందులో ఓడిపోతే ఇంటికే… అందుకే టాప్-2 లోకి వెళ్లడానికి ట్రై చేసి… ఈ మ్యాచ్ టెక్నికల్‌గా గెలిచినా… అసలు టార్గెట్‌తో పోలిస్తే ఓడిపోయినట్టే…


క్వాలిఫైయర్ 1 (Qualifier 1)…: పాయింట్ల పట్టికలో 1వ స్థానం, 2వ స్థానం లో నిలిచిన జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది… ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది… ఓడిన జట్టుకు ఇంకొక అవకాశం ఉంటుంది (వారు క్వాలిఫైయర్-2 ఆడతారు)… అంటే ఎలిమినేటర్ మ్యాచులో గెలిచిన జట్టుతో ఆడతారు… సో, బెంగుళూరు, గుజరాత్ ఈ మ్యాచ్ ఆడతాయి…

ఓడిపోయినవాళ్లకు మరో చాన్స్ ఉంటుంది… క్వాలిఫైయర్-1లో ఓడిపోయిన జట్టుకు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుకు మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది… ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరగా, ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది… క్వాలిఫైయర్-1 విజేత, క్వాలిఫైయర్-2 విజేత మధ్య గ్రాండ్ ఫినాలే జరుగుతుంది… గెలిచిన జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతుంది…

ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? … ప్రస్తుత సమీకరణాల ప్రకారం హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది కాబట్టి, వారు ఖచ్చితంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది… అంటే లీగ్ దశ ముగిశాక తేలే 4వ స్థానపు జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది… టైటిల్ రేసులో నిలవాలంటే హైదరాబాద్‌కు ఇకపై ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ (గెలవాల్సిందే) లాంటిదే! అందుకెే పాపం, కావ్య మారన్ మొహం కళ తప్పింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోహ్లీ…! అన్ని జట్ల అభిమానులకూ ఆరాధ్యుడివే… నువ్వు తోపున్నర…!!
  • ఏపీ పాలనలో ఏదో భారీ తేడా కొడుతోంది… పవన్‌ కస్సుమనేలా…
  • రాజదీప్ సర్దేశాయ్ ఓ బొద్దింక… మరోసారి నిరూపించుకున్నాడు…
  • మోదీ శకం ఇక ముగిసినట్టేనా..? మరో కొత్త నాయకుడు అవసరమా..?
  • రాయి అంటే భౌతికంగా రాయి కాదు… అహల్య అసలు కథ వేరు…
  • ఇప్పటి మగాళ్లు ఎంత మొరటుగా కనిపిస్తే అంత ట్రెండీ మరి..!
  • రాజీవ్‌ను బలిగొన్న థాను కథ తెలిసిందే… మరి ఎవరు ఈ అథిరై..?
  • ఓ విఫల పైరవీ కథ … ‘నీట్‌గా పరీక్షలు అసాధ్యం… లీకులు నిజం…
  • సోషల్ కాక్రోచ్ వింగ్స్..! సొంత పార్టీలనే బలితీసుకుంటయ్… బహుపరాక్..!!
  • ఓ వారసంత నుంచి… ఆ గ్లోబల్ మార్కెట్ దాకా… మన మహిళలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions