ఒక గంటపాటు లైట్లన్నీ ఆపేద్దాం… ధరిత్రికి అది మనం చూపించే కృతజ్ఞత… ఒక గంట విద్యుత్తు నిలిపేస్తే ఎంత శక్తి ఆదా అవుతుందో, తద్వారా ఎంత కాలుష్యాన్ని వాతావరణంలోకి పోకుండా ఆపగలమో, ఎంత భూతాపాన్ని నిలువరించగలమో లెక్కలతో సహా అప్పుడప్పుడూ ప్రచారాన్ని, పిలుపులను వింటుంటాం, చదువుతుంటాం, కొన్నిసార్లు పాటిస్తుంటాం కూడా…
మంచిదే, అలాంటివి ఆహ్వానించాలి… ఏ చిన్న సత్సంకల్పమైనా సరే వ్యతిరేకించొద్దు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో హెహె అని వెటకారపు ట్రోలింగూ అక్కర్లేదు… ఎప్పుడో ఓ గంట ఆపేయడం దేనికి..? రోజూ పొద్దున గంట, సాయంత్రం గంట కరెంటు సంస్థలే లోడ్ షెడ్డింగ్ (కోత) చేస్తే సరిపోతుంది కదా అంటారా..? నిజంగా శక్తిని, విద్యుత్తును ఆదా చేసే నిర్మాణాత్మక, క్రియేటివ్, యూజ్‌ఫుల్ నిర్ణయాలు మన ప్రభుత్వాలకు చేతకావు, మళ్లీ ఆ లెక్కలు వేరు గానీ, తాజాగా ఓ పిలుపు ఇంట్రస్టింగు…
CSIR తెలుసు కదా… the Council of Scientific and Industrial Research … రీసెర్చ్ ల్యాబుల పెద్ద నెట్‌వర్క్ ఇది… అది స్టాఫ్‌కు ఓ పిలుపునిచ్చింది… ప్రతి సోమవారాన్ని WAH సోమవారంగా పాటిద్దాం అనేది పిలుపు… WAH అంటే Wrinkle Achcha Hai… అంటే ముడతలు మంచివే… ఇది WAH Mondays’ campaign… వింతగా అనిపిస్తోంది కదా… ఒకరకంగా అంతే…
Ads
మామూలుగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రతి శుక్రవారాన్ని నాన్ ఫార్మల్ డే అని పాటిస్తుంటాయి కదా… Thank God, It’s Friday’ లేదా ‘Casual Friday’ అంటుంటారు… ఆరోజుల్లో డ్రెస్ కోడ్ ఏమీ ఉండదు… రిలాక్స్ బట్టల్లో హాజరు కావచ్చు… అదుగో వాటికన్నా ఈ ముడత మంచిదే క్యాంపెయిన్ బెటర్, ఇది వాతావరణానికి మేలు… ఇంతకీ ఈ పిలుపు కథేమిటంటే…
ఒకసారి ఒక జత బట్టల్ని ఇస్త్రీ చేస్తే 200 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి చేరుతుందట… సో, కనీసం వారానికి ఒక్కరోజైనా ఇస్త్రీ చేయని బట్టల్ని, ఆ ముడతలతో యథాతథంగా ధరిస్తే ఆమేరకు క్లైమేట్ చేంజ్ కోణంలో మేలు చేసినట్టే అని సీఎస్ఐఆర్ చెబుతోంది.,. ఓ సింబాలిక్ ఫైట్…
కలశై సెల్వి అని దీనికి మొదటి మహిళా డైరెక్టర్‌గా వచ్చింది… అదుగో ఆమె చొరవ ఇది… అబ్బే, మన దేశంలో 70, 80 శాతం మంది ఇస్ట్రీ బట్టలే వేసుకోరు, 10, 20 శాతం మందికి అసలు బట్టలే సరిపడా ఉండవు, ఒక సంస్థ పరిధిలోని స్టాఫ్ దీన్ని పాటిస్తే ఏమొస్తుంది..? దీనికన్నా నిజంగా విద్యుత్తు ఆదా చేసే విధానాలు, పరిశోధనలు, నిర్ణయాలపై కాన్సంట్రేట్ చేయొచ్చు కదా అంటారా..? అదీ నిజమే…
కానీ… ముడతల్లేని ఇస్త్రీ బట్టల్ని ధరించడాన్ని నాగరికంగా భావించే పద్ధతి, ఇస్త్రీ బట్టలు లేకపోతే నామోషీగా ఫీలయ్యే వాతావరణాన్ని వారంలో ఒక్కరోజైనా చూడొచ్చు కదా… అదీ ఇక్కడ ఇంట్రస్టింగు… పనిలోపనిగా వాతావరణంలోకి కొంత కార్బన్ డై ఆక్సైడ్ చేరకుండా కూడా మనవంతు ఉడతసాయం కూడా చేసినట్టు ఉంటుంది కదా… అదే కలశై సెల్వి పిలుపు సారాంశం కూడా..!!
Share this Article