Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండి కూటమి ఎప్పుడో ఇచ్చుకుపోయింది… లెక్కలు పల్టీ కొట్టినయ్…

February 9, 2025 by M S R

.

ఎన్నికల్లో ఓడిపోతేనేం… 43 శాతం వోట్లు వచ్చాయి ఆప్‌కు… కాంగ్రెస్ పార్టీకి 6.82 శాతం వచ్చాయి… గత ఎన్నికల్లోకన్నా ఎక్కువ… కానీ బీజేపీకి వచ్చిన వోట్లు జస్ట్, 47.66 శాతం మాత్రమే… అదే కాంగ్రెస్, ఆప్ కలిస్తే ఘన విజయం దక్కేది…

బీజేపీ యమునలో కలిసిపోయేది… ఇదుగో ఇలాంటి రివ్యూలు, లెక్కలు, సమీకరణాలు గట్రా చాలా వినిపిస్తున్నాయి… వాళ్లందరూ మరిచిపోయిన సంగతి ఏమిటంటే..? రాజకీయాల్లో 2+2=4 ఎప్పుడూ కాదు… భిన్నంగా ఉంటుంది,..

Ads

కాంగ్రెస్ బలం ఆరేడు శాతమే కదా… ఒకవేళ నిజంగానే కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేస్తే… ఆప్ కేవలం ఆ ఏడు శాతానికి తగినట్టు 5 సీట్లు మాత్రమే ఇస్తామని ప్రతిపాదించి ఉంటే కాంగ్రెస్ అంగీకరించేదా..? పోనీ, పది… పోనీ, ఇరవై… అస్సలు అంగీకరించేది కాదు… సగం అడిగేదేమో… ఐనా ఇండి కూటమి ఎప్పుడో ఇచ్చుకుపోయింది కదా… ఇక స్నేహధర్మం ఎక్కడిది..? ఎవరి సత్తా వాడిదే…

జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎవరి దుకాణం వాళ్లదే… ఢిల్లీలో చాలా పార్టీలు పోటీచేశాయి… యాంటీ బీజేపీ కూటమి బలపడాలని పదే పదే చెప్పే పార్టీలు కూడా… సీపీఎం, సీపీఐ కూడా… చివరకు బాగా కూటమి నీతులు చెబుతూ, మహారాష్ట్రలో తనతో కలిసి ఉండే ఎన్సీపీ కూడా పోటీచేసింది… సో, అరయగ కర్ణుడీల్గె అన్నట్టు కేజ్రీవాల్ మునిగిపోయాడు…

delhi

సొంతంగా ఎదగాలని కాంగ్రెస్ భావన… ఒకవేళ నిజంగానే రెండూ కలిసి సీట్ల సర్దుబాటుతో బీజేపీని ఎదుర్కుంటే కొంతవరకూ ఫాయిదా ఉండేది… కానీ అది గెలుపు దాకా తీసుకుపోయేదా అంటే డౌటే… ఎందుకంటే..? ఈ జాబితా చూడండి…

delhi

13 చోట్ల బీజేపీ మార్జిన్‌కన్నా కాంగ్రెస్‌కు వోట్లు ఎక్కువ… సో, కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసి, రెండూ యమునలో నిండా మునిగిపోయాయని విశ్లేషణలు… అలా కలిసి పోటీచేయగానే ఒక పార్టీ వోట్లు మరో పార్టీకి గుండుగుత్తాగా ట్రాన్స్‌ఫర్ కావు… కాకపోతే బీజేపీ వ్యతిరేక వోటు చీలిపోకుండా కొంత లాభం ఉండేది అంతే…

delhi

న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికీ ఇదే కారణం చెబుతూ పైన టేబుల్ ప్రచారంలోకి తీసుకొచ్చారు… మాజీ సీఎం షీలాదీక్షిత్‌కు వచ్చిన వోట్లు, తను బరిలో లేకుండా ఉంటే, కేజ్రీవాల్‌కు పడి, గెలిచేవాడని ఓ సమీకరణం… నిజంగానే సందీప్ దీక్షిత్ బరిలో లేకుండా ఉంటే, తన వోట్లు కేజ్రీవాల్‌కే పడాలని ఏముంది…? ఇది రాజకీయం… అందుకే ముందు చెప్పుకున్నది… వోట్లు గుండుగుత్తాగా పార్టీల నడుమ బదిలీ కావు అని..!!

చాలామంది చాలా కారణాలు చెబుతున్నారు… కానీ ఢిల్లీలో బీజేపీ గెలుపు ప్రధాన కారణం ఖచ్చితంగా హిందూ వోట్లు కన్సాలిడేట్ కావడం… మహారాష్ట్రలో చేసినట్టే ఢిల్లీలోనూ వేలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగి, సైలెంటుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు…

లోకసభ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సహాయ నిరాకరణ చేసింది… ఏమైందో, ఎక్కడ ఏం సర్దుబాటు జరిగిందో గానీ మహారాష్ట్ర ఎన్నికల దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ బాగా ఇన్వాల్వయింది… అందుకే దాని వోటు శాతం 47 దాకా పెరిగింది… ఆప్‌తో పోలిస్తే జస్ట్, రెండు శాతంలోపు వోట్లు ఎక్కువ… దాంతో మొత్తం ఫలితాల ముఖచిత్రమే మారిపోయింది…

ఎస్, మొన్నటి బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని పెంచడం కూడా… అధికశాతం ఎంప్లాయీస్ ఉండే ఢిల్లీలో బీజేపీకి కొంత ఫాయిదా వచ్చింది… యమున నీటిలో విషం కలుపుతారనే కేజ్రీవాల్ పిచ్చి వ్యాఖ్యలు… మద్యం స్కాములో కీలక నేతలు జైలుపాలు కావడం… అవినీతిపై పోరాడుతానంటూ రాజకీయాల్లో కొనసాగే కేజ్రీయే జైలుకు వెళ్లడం, మోడీ డబుల్ ఇంజన్ హామీలు వంటి అనేక కారణాలు బీజేపీకి అధికారంలోకి తెచ్చాయి…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘లోకేష్‌తో కేటీఆర్ గుప్తబంధం దేనికి…, చీకటి కలయికల కుట్రలేమిటి..?’’
  • ‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’
  • వావ్… బనకచర్లపై జగన్ కూడా మాట్లాడుతున్నాడు గ్రేట్…
  • బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
  • న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
  • ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…
  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…
  • కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions