.
సెలబ్రిటీలకు గానీ, ఇతరులకు గానీ కొన్నిసార్లు ఫ్లోలో మాటలు జారుతాయి… వాటిని ఎవరైనా గుర్తుచేసినప్పుడో, తనకే తప్పు అర్థమైనప్పుడో లేక విమర్శలు మొదలైనప్పుడో సరిదిద్దుబాటు అవసరం…
బిగ్‌బాస్ ఫేమ్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి కనిపించిన ఓ రీల్ చూస్తే ఆశ్చర్యమేసింది… అందులో ఓ పెద్ద దున్న దగ్గర నిలబడి ఏదో చెబుతోంది… దేశంలోనే బాగా ఎత్తయిన, పొడవైన దున్నపోతు అన్నమాట ఇది, మంచిగున్నవ్, బాహుబలి, ప్రభాసన్న లెక్క ఉన్నవ్ దిట్టంగా… ఇవీ ఆమె మాటలు…
Ads
దున్నపోతును ప్రభాస్‌తో పోల్చడం అంటే ఆ దున్నపోతుకు ప్రశంసే గానీ, మరోవైపు ప్రభాస్ ఆ దున్నపోతులా ఉన్నాడనే తప్పుడు అర్థం కూడా వస్తుంది… పాపం, ప్రభాస్‌కు తన జీవితంలోనే ఇలాంటి తిక్క వ్యాఖ్య ఎదురుకాలేదేమో… ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇంకా గమనించినట్టు లేరు…
ఈమధ్య టీవీ, సినిమా సెలబ్రిటీలు తామేం మాట్లాడుతున్నారో తమకే తెలియడం లేదు కదా… ఆమధ్య ఏదో సినిమా ఫంక్షన్‌లో హోస్ట్ శ్రీముఖి రామలక్ష్మణులు ఫిక్షనల్ కేరక్టర్స్ అని తూలింది… తరువాత క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసి తప్పు కడుక్కుంది… సేమ్, దిల్ రాజు కూడా తెలంగాణ కల్చర్‌ను కించపరుస్తూ తెల్లకల్లు, మటన్ ముక్కకే వైబ్స్ ఇస్తారని ఓ పిచ్చి వ్యాఖ్య చేశాడు…
తరువాత తనూ క్షమాపణ చెప్పినట్టు గుర్తు… కానీ కొందరు ఉంటారు… విమర్శలు రానీ, ఎవరేమైనా అననీ పట్టించుకోరు… సింగర్ మధుప్రియ కాలేశ్వరం గుళ్లో ప్రైవేటు సాంగ్ షూట్ చేసింది, భక్తుల క్యూలు నిలిపేసి మరీ… అక్కడ ఈవోకు బదిలీ శిక్ష పడింది గానీ మధుప్రియ మాత్రం ఏమీ స్పందించలేదు…
సేమ్, మంగ్లీ… కాళహస్తి గుళ్లో ప్రైవేటు సాంగ్ షూట్ చేసింది… ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోలేదు, వీర వైసీపీ ప్రచారకర్త, ఎస్వీబీసీ సలహాదారు మొన్నామధ్య టీడీపీ రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఉత్తరాంధ్రలో మంచి ప్రోటోకాల్ గౌరవాన్ని పొందింది… కట్ చేస్తే, టీచర్ ఎమ్మెల్సీకి పోటీపడిన బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు ప్రచారం చేసిన వీడియో కనిపించింది…
https://www.facebook.com/reel/4100155590308086
ఆమధ్య శ్రీకాంత్ అయ్యంగార్ మీద సినిమా రివ్యూయర్లు విరుచుకుపడ్డారు… తను కించపరిచినట్టుగా, చిల్లరగా, రోత తిట్లతో కూడిన కామెంట్స్ చేశాడని… ఏమైంది..? త్వరలో క్షమాపణ చెబుతాలేవోయ్ అని ఎటకారంగా మరో వీడియో చేసినట్టున్నాడు తప్ప మీరు నన్నేమి చేయగలరు అనే ధోరణే కనబరిచాడు… వేణుస్వామి మీద ధ్వజమెత్తిన సినిమావాళ్లకు ఈ పెద్దమనిషి మాత్రం క్షమించేయదగిన కేరక్టర్‌గా కనిపించినట్టున్నాడు, వదిలేశారు…
రీసెంటుగానే ఒక దర్శకుడో, నిర్మాతో మన్మథుడు ఫేమ్ అన్షు అంబానీ సైజుల మీద తిక్క కామెంట్స్ పాస్ చేశాడు… తరువాత లెంపలేసుకున్నాడా..? గుర్తులేదు… హీరోయిన్ కాయదు లోహర్ మీద మరొకరు కాయలు పళ్లు అని కూశాడు… తనూ సారీ చెప్పాడో లేదో తెలియదు… ఇలాంటివి ఈమధ్య చాలా కనిపిస్తున్నాయి… నోటికి హద్దూఅదుపూ లేని వ్యాఖ్యలు..!!
Share this Article