.
( పార్థసారథి పొట్లూరి )…… సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన భార్య అస్మా అల్ అసద్ తో పాటు పిల్లలని రష్యా పంపించాడు! బహుశా రేపో మాపో బషర్ అల్ అసద్ కూడా రష్యా వెళ్లిపోవచ్చు!
అస్మా అల్ అసద్ 1975 లో లండన్ లో పుట్టింది. అక్కడే చదువుకుంది. బషర్ అల్ అసద్ ని పెళ్లిచేసుకున్న తరువాత లండన్ నుండి డమాస్కస్ కి వచ్చింది!
Ads
సిరియాలో అసద్ ల 50 ఏళ్ళ పాలనకి త్వరలో అశుభం కార్డు పడపోతున్నది!
రెబెల్స్ ముందు సిరియా, రష్యన్ సైన్యం నిలవలేకపోతున్నది. రెబెల్స్ బలగం నిన్న హమ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నది. అక్కడ ఉన్న సిరియన్, రష్యా సైనికులు రెబెల్స్ దాటికి తట్టుకోలేక ఆయుధాలు వదిలి పారిపోయారు.
హమ పట్టణం నుండి రెబెల్స్ వేగంగా మరో పట్టణం అయిన హోమ్స్ వైపు వెళుతున్నారు. బహుశా రేపు హోమ్స్ ని రెబెల్స్ చేజిక్కించుకుంటే మాత్రం సిరియా రాజధాని డమాస్కస్ కి రష్యన్ ఎయిర్ బేస్ ఉన్న లటాకియా మరియు రష్యన్ నావీ బేస్ ఉన్న టార్టస్ పోర్టుతో సంబంధాలు తెగిపోతాయి!
అందుకే భార్యా పిల్లలని రష్యా పంపించాడు అసద్! బహుశా రేపు అసద్ కూడా ప్రత్యేక విమానంలో మాస్కో వెళ్లిపోవచ్చు!
రెండు రోజుల క్రితమే సిరియాలోని మధ్యదరా సముద్రపు ఒడ్డున ఉన్న టార్టస్ పోర్టు నుండి తన యుద్ధ నౌకలని రష్యాకి తరలించింది! టార్టస్ రేవులో రక్షణ కోసం ఉంచిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అక్కడే వదిలేసి నౌకలు వెళ్లిపోయాయి.
ఆయుధాలని నౌకలలోకి ఎక్కించడానికి తగినంత సిబ్బంది లేకపోవడం చేత ఎక్కడ ఉన్నవి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. యుద్ధ నౌకలో కూడా పూర్తి స్థాయి సిబ్బంది లేరు కానీ అలానే తీసుకెళ్లారు! ఇక లటాకీయాలో రష్యన్ ఎయిర్ బేస్ ని కూడా రష్యన్లు ఖాళీ చేసినట్లుగా తెలుస్తున్నది! అక్కడ కూడా ఎక్కడ ఉన్నవి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
రెబెల్స్ సిరియాలో మూడవ పెద్ద పట్టణం homs ని స్వాధీనం చేసుకున్నారు కొద్దిసేపటి క్రితం! అయితే సిరియా సైన్యం ప్రతిఘటిస్తున్నది కానీ ఉపయోగం ఉండకపోవచ్చు. So… బషర్ అల్ అసద్ రష్యాకి పారిపోవడం తద్యం!
ఇక సున్నీ, షియాల మధ్య పోరు అంటే సివిల్ వార్ తప్పదు! తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అసద్ తో సన్నిహితంగా ఉండే కొంతమంది సైనిక జనరల్స్ అసద్ మీద తిరుగుబాటు చేసి అసద్ ని బంధించి రెబెల్స్ అప్పగించడానికి కుట్ర పన్నుతున్నారు అనే వార్త కూడా వినపడుతున్నది.
అసద్ ని బంధించి మాకు అప్పచెపితే మిమ్మల్ని (సైనిక జనరల్స్ ) ని ప్రాణాలతో వదిలిపెడతామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది! ఏం జరగబోతున్నది అన్నది రెండు రోజుల్లో తెలిసిపోతుంది! రష్యాకి మధ్యధరా సముద్రంతో సంబంధాలు తెగిపోయినట్లే!
పుతిన్ కి ఉన్న కష్టాలు మరింత పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ లో ఫార్వార్డ్ దళాలతో కలిసి పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులలో వెయ్యి మంది ఉన్నట్లుండి మాయం అయిపోయారు! బహుశా ఉక్రెయిన్ లోకి పారిపోయి, అటు నుండి దక్షిణ కొరియా పారిపోయే అవకాశం ఉంది! ఉత్తర కొరియా సైనికులు మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్నారు!
Share this Article