Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో వెలుగుబంటి… కాదు, వాడి తాత…! గుట్ట ఈఈకి గుట్టలుగా ఆస్తులు..!!

October 31, 2025 by M S R

.

లంచం చేత, లంచం చుట్టూ, లంచం కోసం… లంచం స్వామ్యం అని ముచ్చట పబ్లిష్ చేసిన బీపీసీఎల్ మాజీ సీఎఫ్‌వో పోస్టు ఒకటి చదివారు కదా… అది చదివాక జర్నలిస్టు మిత్రులు పలువురు యాదగిరిగుట్ట ఈఈ ఏసీబీ ట్రాప్, అరెస్టు వార్తను షేర్ చేస్తున్నారు…

అవన్నీ చదువుతుంటే… నాకు నేనే గతంలో బట్టబయలు చేసిన వెలుగుబంగి సూర్యనారాయణ వార్త గుర్తొచ్చింది… అది నొటోరియస్ కేసు… బీఆర్ఎస్ అధినేత, కాళేశ్వరం సహా అనేకానేక అక్రమాల సూత్రధారి కేసీయార్ గుర్తొచ్చాడు… అదే కేసీయార్ సీబీఐ కేసులో ఇరుక్కోవడానికి కారకుడైన వెలుగుబంటీ గుర్తొచ్చాడు…

Ads

యూపీయే హయాంలో కేసీయార్ ఎవరిని పట్టుకుని, చార్జిషీటులో నుంచి తప్పించుకున్నాడనేది వేరే కథ… ప్రస్తుతానికి వద్దాం… యాదగిరిగుట్ట ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) వూడెపు రామారావు అనే భారీ తిమింగలం నిన్న ఏసీబీ ట్రాపుకి చిక్కింది…

సరే, మన దరిద్రపు వ్యవస్థ కారణంగా మళ్లీ బెయిల్ తెచ్చుకుంటాడా, కొలువులోకి మళ్లీ చేరతాడా..? ఇంకా రెట్టించిన ముదురు ఉత్సాహంతో ఇంకా రెచ్చిపోతాడా చూద్దాం… ఆ చాన్సులే ఎక్కువ… ఎందుకంటే..?

అసలు తను పట్టుబడ్డది చాలా చిన్న కేసు తన అవినీతి వ్యవహారాలతో పోలిస్తే…. తన నేటివ్ ఏమిటి..? ఏ సామాజికవర్గం అనేవి తెలియడం లేదు గానీ… వెలుగుబంటికి తాత..! చూస్తూ ఉండండి మన న్యాయ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ పుణ్యమాని…. మళ్లీ అదే యాదగిరి నర్సన్న కొలువులోనే చేరి, మరింత దండుకుంటాడు… మనం చెప్పుకున్నదీ అదే కదా… మన వ్యవస్థే లంచస్వామ్యం…

గుర్తుంది… గుట్ట ఈవోగా భాస్కర్ రావు వచ్చాక, తను అక్రమ యవ్వారాలు లీలలు గమనించి పక్కన పెట్టేశాడు… జీతం కూడా ఆపేశాడు… ఆయన వెళ్లిపోయాక, ఇక ఏ పెద్ద మనిషి పుణ్యం కట్టుకున్నాడో… నర్సింహస్వామి ఆశీర్వదించుగాక…. మళ్లీ కొలువులో చేరాడు…

తన డిగ్రీ నిజమేనా..? డౌట్… కోర్టులో ఉందట… ఏకంగా ఏఈ నుంచి డీఈ దాకా ఎదిగాడు… గుట్ట కెపాసిటీ ఇంజనీరింగ్ కెపాసిటీకి డీఈ చాలు… కానీ ఈఈ అయిపోయాడు అక్కడే… మన వ్యవస్థలో సహజమే కదా… మరో వెలుగుబంటి… అంతేకాదు, దేవాదాయ శాఖ ఎస్ఈ అట కూడా… దరిద్రం పాడుగానూ…

కొన్నాళ్లుగా తన అక్రమాస్తులు, బినామీ ఆస్తుల మీద బోలెడు కథనాలు… ఫాఫం, మెయిన్ స్ట్రీమ్‌కు రాసే దమ్ములేదు… సారీ, ఆ రిపోర్టర్లను నేనేమీ అనడం లేదు గానీ… తన అక్రమ యవ్వారాల్లో పైసా మందం బయటికి రాలేదు… ఏమో, అత్యంత అవినీతిపర కాళేశ్వరం ఇంజినీర్లు కూడా వేస్ట్ ఈయన ముందు…

ఓ మిత్రుడు చెబుతున్నాడు… ‘‘బేగంపేటలో 40 ఎకరాలు… దాతర్ పలి మూడు ఎకరాలు… మల్లాపురంలో 5 ఎకరాలు… కాచారంలో రెండు ఎకరాలు… టెంపుల్ సిటీ మీద 500 ఆర్ట్స్… మల్లాపూర్ రింగ్ రోడ్డు మీద రెండు వేల గజాలు… సురేంద్రపురిలో పది ప్లాట్లు… బస్వపూర్ రిజర్వాయర్ కింద 15 ఎకరాలు… యాదగిరిగుట్టలో ఒక లాడ్జ్… వనస్థలిపురంలో గవర్నమెంట్ క్వార్టర్స్ వేలంలో… చివరకు కొండ కింద పాయికానా బాత్రూంలు కాంట్రాక్టు…

కొండ కింద గ్యాస్ సెక్షన్ వద్ద నర్సరీ కాంట్రాక్ట్… LNT కంపెనీలో పార్ట్నర్స్… ఈసీఐ కంపెనీలో పార్ట్నర్షిప్… కొండపైన సీసీ కెమెరా పార్ట్నర్షిప్… జాబితా అనంతం… ఇవన్నీ పాతవి, మరి కొత్తవి కూడా కలిపితే…? ఏసీబీ మొత్తం స్టాఫ్, పదీపదిహేను మంది సీఏలు అవసరమేమో… రామారావు నువ్వు గొప్పోడివిరా..?

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటే తెలుసు కదా…. గుట్ట డెవలప్‌మెంట్ నిర్ణయాలు తెలిసేకొద్దీ దాని పరిసరాల్లో ఆస్తులను కుమ్మేశాడు, కమ్మేశాడు.., తొక్కలో సిస్టం, నన్నేం పీకగలదు అనుకుని ఈ వ్యవస్థను చెరబట్టినవ్ కదా నయా వెలుగుబంటీ… ఇంకా చాలా బినామీ ఆస్తులు చెబుతున్నారు గానీ వాటి జోలికి పోవడం లేదు ఇక్కడ… పవిత్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ కదా పాపం ఇప్పుడు…

ఫాఫం రేవంత్ రెడ్డి… వోకే, వోకే, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తారట కదా మీరు… గో ఎహెడ్… రేవంతుడికి ఆ గుట్ట లక్ష్మి నర్సింహస్వామి కటాక్ష ప్రాప్తిరస్తు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…
  • కొన్ని ఉద్వేగపు కన్నీళ్లకు పేర్లుండవ్… అవి అనుభవైక వేద్యమే…
  • మరో వెలుగుబంటి… కాదు, వాడి తాత…! గుట్ట ఈఈకి గుట్టలుగా ఆస్తులు..!!
  • లంచస్వామ్యం…! లంచం చుట్టూ, లంచం కోసం, లంచం చేత…!!
  • మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…
  • ది గ్రేట్ సైబర్ రాబరీ..! కుంభస్థలాన్నే కొట్టారు హ్యాక్ దొంగలు..!!
  • చైనా సైబర్ మాఫియా..! ఆ చెరలో వందలాది భారతీయులు గిలగిల..!
  • సింగిల్ మదర్‌హుడ్..! పెళ్లి, విడాకులు, ఐవీఎఫ్ సంతానం… రేవతి స్టోరీ…!!
  • ఆమె అమెరికా అమ్మాయి… పాటేమో వేణువుపై… అతనేమో వీణ సవరింపు…
  • జెమీమా రోడ్రిగ్స్..! ఓ తిలక్ వర్మ… ఓ రోహిత్ శర్మ… ఓ విరాట్ కోహ్లీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions