.
మన దరిద్రపు రాజకీయ వ్యవస్థలో… ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో… అది ప్రతిపక్షంలోకి వెళ్లిపోయి, వేరే పార్టీ అధికారంలోకి వస్తే…. సాధారణంగా నెగెటివ్ ధోరణిలో వెళ్తుంది…
పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచిస్తుంది… ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపించడానికి ప్రయత్నిస్తుంది… నేనిక్కడ విస్తృత పరిధిలోకి వెళ్లడం లేదు, ఈ స్పేస్ సరిపోదు… తెలంగాణకు సంబంధించి..!
Ads
యాదగిరిగుట్టకు సంబంధించి… దానికి చిన జియ్యర్ మోస్ట్ కంట్రవర్షియల్ కేరక్టర్ (నేనిక్కడ పీఠాధిపతి వంటి విశిష్ఠ విశేషణాలేవీ వాడటం లేదు, గమనించగలరు… తనొక ఆధ్యాత్మిక కేరక్టర్ అంటేనే అదొక అరిష్టం… కారణాలు అనేకం…) యాదాద్రి పేరు పెట్టాడు… సగం దరిద్రం అది…
కేసీయార్ లెక్కలు వేరు… చిన జియ్యరుడిని మోశాడు, మోశాడు… తరువాత అధఃపాతాళానికి తొక్కాలని అనుకున్నాడు… పాత కథల్లో చక్రవర్తులు, ప్రధాన ఆధ్యాత్మిక సలహాదారులు పాత్రలు… లక్ష పుస్తకాలు చదివాననే తుపాకీ రాముడు కథలే తప్ప, పాలకస్థాన అహం తప్ప కేసీయార్‌కు ఆధ్యాత్మిక విజ్ఞత లోపించింది…
తన బొమ్మలు, తన పథకాలు స్థంభాలపై చెక్కించడమే కేసీయార్ అసలు తత్వానికి నిదర్శనం… దేవుడిని మించిన నేను అనే భావనల్లోకి ఎవరు వెళ్తారో వాళ్లు కాలసర్ప ద్రష్టులు అవుతారు… అదే జరిగింది… స్వయంకృతం…. ఎవరూ సానుభూతి చూపనక్కర్లేదు… నేను సుప్రీం అనుకున్నవారెవరూ కాలగతిలో బట్టకట్టలేదు… కొట్టుకుపోయారు… ఈ చిన్న చీమలు ఎంత..?
కానీ పాత కేసీయార్ ఏదో చేశాడు కదా, మనం నెగెటివ్‌గా వెళ్దాం అనుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వ మంచితనం… అంతేకాదు… ఎక్కడా యాదగిరిగుట్టకూ కేసీయార్‌కూ ముడిపెట్టి విమర్శలు చేయడం లేదు సరికదా… ప్రధాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తోంది… అది పూర్తయితే తిరుమల గోపురం ఎత్తుకన్నా ఎత్తయిన స్వర్ణగోపురం కాబోతోంది… ఆల్రెడీ పనులు స్టార్టయ్యాయి… బంగారం సమకూరింది… పూర్తయితే గుట్టకు మరింత స్వర్ణ శోభ…
థ్యాంక్స్ టు ఎండోమెంట్స్ మినిస్ట్రీ అండ్ అఫిషియల్ అడ్మినిస్ట్రేషన్… అడ్మినిస్ట్రేషన్‌లో పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్ లేకపోతే ఒక ప్రధాన ఆలయ పాలన, నిర్వహణ ఎంత సజావుగా సాగుతుందో చెప్పొచ్చు… అఫ్‌కోర్స్, కొన్ని దిగువ స్థాయి పొలిటికల్ వికారాలు సహజంగా బాధించినా సరే…
1) గిరిప్రదక్షిణ… మంచి కార్యక్రమం… దానికి ప్రయారిటీ ఇస్తున్నారు ఈమధ్య… 3 కిలోమీటర్లు… 2) ఇది మా గుట్ట అనే వైబ్స్ దూరమయ్యాయి కేసీయార్ హయాంలో… కొంత పునరుద్ధరణ ప్రయత్నాలు సాగుతున్నాయి… 3) రాత్రి నిద్ర ఏర్పాట్లపై ఆలోచనలు చేస్తున్నారు… 4) స్థానికులకు ఉపాధి, వారం వారం ఆ ప్రాంతీయులకు దర్శనాలు ఇప్పిస్తున్నారు…
5) ఒకప్పటి వైబ్స్ దూరమయ్యాయి కదా… పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా… వచ్చే వారం అయ్యప్ప స్వాములకు (భారీ సంఖ్యలో) భిక్ష, ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయబోతున్నారు…
6) అదేసమయంలో పాత గుట్ట సంప్రదాయాల్ని విస్మరించకుండా… శుక్రవారం గుట్ట సొంత వనాల్లో తులసి- దామోదర కల్యాణ పూజ, సత్యనారాయణవ్రతం, ఉసిరి పూజతో సంప్రదాయికంగా కార్తీక వనభోజనాల్ని నిర్వహించారు…
7) సొంత గోశాలలో 180 వరకూ గోవుల సంరక్షణ గుడ్… సంస్కృత పాఠశాల… తిరుమలకు ఏం తక్కువ..? ఇది తెలంగాణ తిరుమల… కాదు, పోలిక దేనికి, ఇది తెలంగాణ గుట్ట..!!
కొత్త ఆలోచనలు… ఈ ప్రాంతంలోని ప్రతి భక్తుడు గుట్టను ఇంకా ఓన్ చేసుకోవాలనే దిశలో ప్రయత్నాలు,.. గుడ్… వృద్ధులు, వికలాంగులకు నేరుగా లిఫ్టులో తీసుకెళ్లి ఉచిత ప్రత్యేక దర్శనాల ఏర్పాటు కూడా అభినందనీయం… ఎటొచ్చీ, గిరి ప్రదక్షిణకు జనం తాకిడి ఎక్కువైంది కదా… ఆమేరకు పార్కింగ్ లేదు…
గిరిప్రదక్షిణ దారిని ఇంకా ఆధునీకరించాల్సిన పనులు బాకీ ఉన్నాయి… ఆ మొత్తం యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ ఏరియాలో ఇంకా చేయాల్సిన పనులూ ఉన్నాయి… గుడ్… గుడ్… కేసీయార్ అత్యంత భారీ సంకల్పంతో… ఒక సెక్యులర్ స్టేటయినా సరే 1500 కోట్లతో ఓ భారీ ఆలయ పునర్నిర్మాణం చేయడం అభినందనీయం… కాకపోతే తనకు అలవాటైనట్టు మధ్యలో వదిలేశాడు…
కేసీయార్‌కు క్రెడిట్ వస్తుందేమో అనే దురాలోచనలో లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం… దిద్దుబాటు, మరింత వృద్ధి అనే దిశలో పాజిటివ్‌గా వెళ్తోంది… అదీ అభినందనీయం… ఆఫ్టరాల్ పాలిటిక్స్… వాటిని దేవుడి దాకా తీసుకురావద్దు…. మరీ తిరుమల ధర్మవ్యతిరేక దుష్పరిపాలన స్థాయికి యాదగిరిగుట్టను తీసుకుపోవద్దు… అదే సగటు నర్సన్న భక్తుల అభిలాష..!! రేవంత్ ప్రభుత్వం ఈ స్పిరిట్ ఇలాగే కొనసాగించాలనే అభిలాష కూడా..!!
అన్నట్టు…. వైష్ణవ కేసీయారుడు శైవక్షేత్రాలను విస్మరించాడు… చివరకు భద్రాచలాన్ని కూడా…! ఎవడికీ అర్థం కాని పాలకాంతరంగం… జనవ్యతిరేకం… వేములవాడకు ఈమధ్య రేవంతుడు ఏవో వరాలు ప్రకటించాడు కదా… మరీ కేసీయార్‌లా గాలికి వదిలేయకుండా… ఎములాడ ప్లస్ కొండగట్టు ప్లస్ భద్రాచలం ప్లస్ కొమురవెళ్లిని కూడా పట్టించుకుంటే…. రేవంత్‌కు ఓ అధ్యాత్మిక ఆశీర్వాదం… లేదంటే…!?
చివరగా….. గుడి అంటే దైవదర్శనం మాత్రమే కాదు… ధర్మప్రచారం కూడా… ఆ దిశలో ఈ సర్కారు ఇంకాస్త ఆలోచించాలి…
Share this Article