Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… ఇంతకీ చిరంజీవి చెవిలో యముడు ఏం సలహా ఊదాడబ్బా..!!

December 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. తెలుగు ప్రేక్షకులకు యముడికి ఏదో అనుబంధం ఉంది . యముడి మీద వచ్చిన సోషల్ ఫేంటసీ సినిమాలన్నీ కనకవర్షం కురిపించాయి . 1960 లో యన్టీఆర్ , కృష్ణకుమారి , యస్వీఆర్లతో దేవాంతకుడు వచ్చింది . 1977 లో యన్టీఆర్ , జయప్రద , సత్యనారాయణ , అల్లు రామలింగయ్యలతో వచ్చిన యమగోల బ్లాక్ బస్టర్ .

2007 లో యమదొంగ టైటిలుతో జూనియర్ యన్టీఆర్ , ప్రియమణి , మమతా మోహన్ దాస్ , మోహన్ బాబు , ఖుష్బూ , బ్రహ్మానందంలతో వచ్చిన సినిమా మరో బ్లాక్ బస్టర్ . 2012 అల్లరి నరేష్ , రిచా , సయాజీ షిండే , రమ్యకృష్ణలతో వచ్చిన మరో యముడికి మొగుడు బాగానే ఆడింది . యమలోకం, యముడు చాలా సినిమాల్లో…

Ads

ఇంక ఈ చిరంజీవి సినిమాకొస్తే ఇది టాప్ లేపింది . మిత్రులు నారాయణరావు , సుధాకర్ , హరిప్రసాదుల కోసం చిరంజీవి నటించిన ఈ యముడికి మొగుడు మరో బ్లాక్ బస్టర్ అయింది . సినిమా మొత్తంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా స్లో కాదు , బోరించదు . తుఫాన్ ఎక్స్ప్రెస్ లాగా దడదడలాడిస్తుంది .

నారాయణరావు , రవిరాజా పినిశెట్టి కలిసి నేసిన కధ అద్భుతంగా వచ్చింది . కధకు , చిరంజీవి స్టార్డంకు తగ్గట్లే బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు దర్శకుడు రవిరాజా పినిశెట్టి . నిర్మాతలకు , పంపిణీదారులకు , ప్రదర్శకులకు తినే ప్రాప్తం ఉంటే అన్నీ అలాగే కలిసొస్తాయి కొబ్బరి బోండంలోకి నీళ్లు వచ్చినట్లు .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . బ్రహ్మాండమైన చిత్రీకరణ . వేటూరి వారు పాటల్ని వ్రాస్తే బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , మనో శ్రావ్యంగా పాడారు . మొదటి తాంబూలం అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం పాటదే . బెంగుళూరు పేలస్సు ప్రాంగణంలో చిత్రీకరించబడిన ఈ డ్యూయెట్టుకి ఇప్పడు కూడా కుర్రకారు గంతలు వేయాల్సిందే . చిరంజీవి , రాధ అదరగొట్టేసారు .

ఇదే పాటను చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ , రాశి ఖన్నాల మీద అదే ప్రాంగణంలో 2016 లో వచ్చిన సుప్రీం సినిమాలో రీమిక్సుతో చిత్రీకరించబడింది . అది కూడా వీర హిట్ఠయింది .

ఈ 1+2 సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో చిరంజీవి ఒకేసారి డాన్స్ చేస్తాడు కన్నెపిల్లతోటి పిల్లగాడికొచ్చెనమ్మ పీకులాట పాటలో . కర్టెసీ : విచిత్రగుప్తుని మేజిక్ . చిరంజీవి విజయశాంతి మీద వాన పాట హాటుగా ఉంటుంది . వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా నీటిముళ్ళే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా అంటూ విజృంభిస్తుంది వేటూరి వారి పాట .

వీళ్ళిద్దరి మీదే మరో డ్యూయెట్ ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా అంటూ లైటు నాలుగా, బూతుగా సాగుతుంది ఈ పాట . చిరంజీవి , రాధల మీద డ్యూయెట్ బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా బాగుంటుంది . ఈ అన్ని పాటలకు నృత్య దర్శకురాలు తారే .

యమలోకంలో రంభతో సాగే రీమిక్స్ పాటకు , ఫ్రెష్ పాటకు డాన్సుని ప్రకాష్- సురేఖ కంపోజ్ చేసారు . ఈ పాటలో చిరంజీవి , అంబిక నటించారు . అంబిక అంటే రాధ అక్క . పాటలన్నీ హిట్టే .

రెండు పాత్రల్లో చిరంజీవి బ్రహ్మాండంగా నటించారు . కాస్త యన్టీఆర్ నటించిన రాముడు భీముడు , వాణిశ్రీ నటించిన గంగ మంగ సినిమాలు గుర్తుకొస్తాయి . రాధ , విజయశాంతి ఇద్దరూ గ్లామరస్ గా నటించారు .

  • ముఖ్యంగా పాటల్లో . క్లైమాక్సులో యముడు ఏదో సలహా ఇస్తాడు . చిరంజీవి వాళ్ళిద్దరి చెవుల్లో ఏదో ఉపదేశిస్తాడు . ఇద్దరూ ఓకే అంటూ గుండె మీద వాలిపోవటంతో 1+2 సమస్య పరిష్కారం అవుతుంది . ముగ్గురు మురిపెంగా నటించారు .

విలనాసుర పాత్రల్లో రావు గోపాలరావు , గొల్లపూడి మారుతీరావు , కోట శ్రీనివాసరావు , సుధాకర్ , వయ్యారాల వై విజయ , ప్రసాద్ బాబు నటించారు . సాధు పాత్రల్లో అన్నపూర్ణ , సూర్యకాంతం , హరిప్రసాద్ , డా శివప్రసాద్ నటించారు .

chiru

యముడిగా ఆస్థాన యమ పాత్రధారి సత్యనారాయణ , చిత్రగుప్తునిగా మరో ఆస్థాన చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య , కొత్త పాత్ర విచిత్రగుప్తుడుగా సుత్తి వేలు , ఇతర పాత్రల్లో మమత తదితరులు నటించారు .
చిరంజీవి సినిమా అంటే పాటలు , డాన్సులతో పాటు , ఫైట్లు కూడా అదరాలి కదా !

స్టంట్ మాస్టర్ రాజు ఆధ్వర్యంలో ఫైట్లన్నీ బాగుంటాయి . చేతులకు తాడు కట్టించుకుని చేసే ఫైట్ బాగుంటుంది . క్లైమాక్సులో బస్ కొండచరియ మీద బేలన్సింగ్ పాత ఇంగ్లీషు సినిమా ఇటాలియన్ జాబ్ నుండి అరువు తెచ్చుకున్నారు . పెళ్ళాం ఊరెళితే సినిమాలో కూడా ఈ విన్యాసం ఉంటుంది .

తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తమిళంలో రజనీకాంత్ రీమేక్ చేసారు . రజనీతో దేవిక కూతురు కనక , షీబా లీడ్ పాత్రల్లో నటించారు . హిందీలోకి డబ్ చేయబడింది . 1988 ఏప్రిల్లో వచ్చిన ఈ యముడికి మొగుడు సినిమాను చూడని తెలుగు వారు ఎవరూ ఉండరేమో !

ఎవరయినా ఒకరూ అరా ఉంటే యూట్యూబులో చూసేయండి . An unmissable social-fantasy , romantic , action oriented , feel good entertainer .

నేను పరిచయం చేస్తున్న 1192 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ఫోటోకు పులిట్జర్ ప్రయిజ్ వచ్చింది… ఈ సంఘటన ఏమిటో తెలుసా..?!
  • రాత్రి ప్రపోజ్ చేసినట్టు గుర్తు… కానీ ఆమె ఏమన్నదో చస్తే గుర్తురావడం లేదు…
  • My Old Neighbours- హఠాత్తుగా వాళ్ల ప్లస్ పాయింట్స్ కనిపించసాగాయి…
  • ఎన్నికల స్క్వాడ్ వేషాలు… వసూళ్ల దందాలో జర్నలిస్టులు…
  • ఇండియా చేతికి ఒమన్ పోర్ట్ డుఖం… పాకిస్థాన్‌కు కొత్త దుఖం…
  • అల్లుకు అవార్డు… లైవ్ కుదరడం లేదు.., ఆ అవసరానికి ఓ అబద్ధం…
  • ఏ పార్టీ ప్రభుత్వం ఐతేనేం…? పాలకుల్ని నడిపించేది ఆ కంట్రాక్టర్లేనా…!!
  • సౌందర్య మరణానికి ముందురోజు… అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్…
  • ‘పాలమూరు పాపం’లో కేసీయార్, హరీష్‌ ఫిక్స్…. రేవంత్‌ ‘సిట్’..!
  • తనికెళ్ల భరణి నోట పదే పదే ‘సామాన్లు’ మాట… బూతు కాదండీ బాబూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions